Badvel Election: కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల కరోనా నిబంధనల నడుమ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే అట్లూరు మండలంలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది మహిళలు బద్వేలు ఉప ఎన్నికల్లో అట్లూరు మండలంలో ఫేక్ ఐడి లతో ఓట్లు వేయడానికి కొంతమంది మహిళలు వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుల తనిఖీలలో సరైన ఐడి కార్డులు లేవని గుర్తించి.. ఆ మహిళలను పోలింగ్ కేంద్రం నుంచి వెనక్కి పంపించారు. మండలంలో ఎస్ వెంకటాపురం లో బయట నుంచి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తులను గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తనికీలు చేసి కొంత మంది మహిళలకు సరైన గుర్తింపు కార్డులు లేకపోవని గుర్తించి వారిని వెనక్కి పంపించారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడికి ప్రయత్నం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదర గొట్టారు.
ఇక ఉపఎన్నికల పోలింగ్ లో ఓటర్లు భారీగా పాల్గొంటున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి మహిళా ఓటర్లు బారులు తీరారు. మరోవైపు గోపవరం మండలం బేతాయపల్లి లోని 261 పోలింగ్ కేంద్రంలో గర్భవతి ఓటు వేసేందుకు వచ్చింది. క్యూ లో నిల్చుని చంద్రకళ అనే గర్భవతి సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే స్పందించిన ఎన్నికల సిబ్బంది ప్రాధమిక చికిత్స నందించారు.
Also Read: ఇంట్లో ఎలకలు ఇబ్బంది పెడుతున్నాయా.. సహజమైన సింపుల్ చిట్కాలతో చెక్ చెప్పండి..