B pharmacy students surgery at lodge: ఏదైనా ట్రీట్‌మెంట్ తీసుకోవాలంటే హాస్పిటల్‌కు వెళ్తారు. కానీ, ఆ డాక్టర్ మాత్రం లాడ్జ్‌కు రమ్మంటున్నాడు. అదేంటీ, ట్రీట్‌మెంట్ కోసం లాడ్జ్‌కు ఎందుకు అనుకుంటున్నారా..? అయితే.. ఇది చదవాల్సిందే.. తక్కువ ఖర్చు ఆఫర్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. అవయవాల మార్పిడి అతన్ని బలితీసుకుంది. ఎలాంటి ప్రాక్టిస్ లేని ఓ వ్యక్తి చేసిన సర్జరీ నెల్లూరు (Nellore) జిల్లాలో సంచలనంగా మారింది. ఒంగోలు చెందిన ఒక వ్యక్తి అవయవ (surgery) మార్పిడి చేసుకోవాలనుకున్నాడు. తక్కువ ఖర్చుతో చికిత్స చేస్తామని కొందరు ఆఫర్ ఇవ్వడంతో అత్యాశకు పోయి సరేఅన్నాడు. అప్పటికే.. సర్జరీ చేస్తాన్న వ్యక్తి ముందే ప్రణాళిక రచించాడు.
ఆ తర్వాత నెల్లూరులోని ఓ లాడ్జిలో రూం బుక్‌చేసి, మత్తు మందు ఇచ్చి అర్ధరాత్రి సర్జరీ చేసిన ప్రాణాలు తీసేశారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు స్థానికులు. అయితే, అసలు లాడ్జిలో ఏం జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతుంటే లాడ్జి యాజమాన్యం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు స్థానికులు. లాడ్జిలో జరిగిన దారుణ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. లాడ్జ్‌లో చికిత్స చేయడం ఓ తప్పయితే.. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా సర్జరీ చేయడం మరో నేరమని పోలీసులు పేర్కొంటున్నారు. కేసు విచారణ చేపట్టి త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తామనని అధికారులు చెబుతున్నారు.
ఈ ఘటనపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీ ఫార్మసీ స్టూడెంట్స్ ఈ సర్జరీ చేసినట్టు తెలుస్తోంది. వారు ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు? ఎవరైనా వారితో ఈ పని చేయించారా? లేక వారే డబ్బు కోసం ఇలా చేశారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: