East Godavari: ఓవైపు కరోనా , సీజనల్ వ్యాధులతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతుంటే.. మరోవైపు నకిలీ వైద్యులు ప్రజలు ప్రజల ప్రాణలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ ఆయుర్వేద వైద్యం గుట్టు రట్టు అయింది. ఆయుష్ రీజనల్ డైరెక్టర్ వెంకట రామకృష్ణ ఆధ్వర్యంలో ఆయుర్వేద నిలయంపై దాడులు చేశారు.. వివరాల్లోకి వెళ్తే..
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వెల్ల గ్రామంలో సంతోష ఆయుర్వేద నిలయంపై అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో సంతోష ఆయుర్వేద నిలయంపై ఆయుష్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అర్హతలు, అనుమతులు లేకుండా వైద్య నిలయం నడుపుతున్నట్లు ఆయుష్ అధికారులు గుర్తించారు. గత కొంతకాలంగా వెల్లలో కొంతమంది వ్యక్తులు సంతోష్ ఆయుర్వేద నిలయం పేరిట నిర్వహితున్నట్లు గుర్తించారు.
వివిధ దీర్ఘకాలిక రోగాలకు ఆయుర్వేద మందులు ఇస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమారుతున్నారని అధికారులు తెలిపారు. ఓ బాధితుడు పిర్యాదు నేపధ్యంలో సంతోష ఆయుర్వేద నిలయంపై ఆయుష్ అధికారులు దాడులు చేసి.. వనమూలికలు, ఆయుర్వేద మందుల శాంపిల్స్ సేకరించారు. ఆ శాంపిల్స్ ను పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపించారు.
ఇక్కడ ఇచ్చే ఆయుర్వేద మూలికలు రోగాలను నయం చేయవని ఆయుష్ రీజనల్ డైరెక్టర్ వెంకట రామకృష్ణ స్పష్టం చేశారు. సంతోష్ ఆయుర్వేద నిలయంపై ఉన్నతాధికారులకు పిర్యాదు చేసి .. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఆయుష్ అధికారులుస్పష్టం చేశారు. ఇటువంటి నకిలీ వైద్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.