కరోనా భయం.. ఆయుర్వేదంతో మటాష్?
Corona-Virus Effect: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు.. వ్యాక్సిన్ ఉందా? ఆయుర్వేదం, హోమియోపతి, హాలోపతి మందులతో కరోనా వ్యాధి నివారించవచ్చా? సైంటిస్టులకే సవాలుగా మారింది ఈ కరోనా వ్యాక్సిన్. కానీ.. ఆయుర్వేదంతో మాత్రం చిటికిలో తగ్గిపోతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు. ప్రపంచంలోని దేశాలన్నింటినీ ప్రస్తుతం కరోనా వైరస్ వణికిస్తోన్న విషయం తెలిసిందే. కరోనా బారిన పడితే బ్రతుకుతామో లేదో అనే పరిస్థితి నెలకొంది. వ్యాక్సిన్ లేని ఈ కరోనా వైరస్‌కు దేశాలన్ని భయపడుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఈ వ్యాధి […]
Corona-Virus Effect: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు.. వ్యాక్సిన్ ఉందా? ఆయుర్వేదం, హోమియోపతి, హాలోపతి మందులతో కరోనా వ్యాధి నివారించవచ్చా? సైంటిస్టులకే సవాలుగా మారింది ఈ కరోనా వ్యాక్సిన్. కానీ.. ఆయుర్వేదంతో మాత్రం చిటికిలో తగ్గిపోతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
ప్రపంచంలోని దేశాలన్నింటినీ ప్రస్తుతం కరోనా వైరస్ వణికిస్తోన్న విషయం తెలిసిందే. కరోనా బారిన పడితే బ్రతుకుతామో లేదో అనే పరిస్థితి నెలకొంది. వ్యాక్సిన్ లేని ఈ కరోనా వైరస్‌కు దేశాలన్ని భయపడుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో ఈ వ్యాధి లక్షణాలు కనబడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వైరస్ పేరు చెబితేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయుర్వేదం, హాలోపతి వైద్యులు ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. కరోనాకు ఎటువంటి వ్యాక్సిన్ లేదంటూ ప్రపంచ దేశాలు చెబుతున్నా.. ఆయుర్వేద, హోమియో వైద్యులు మాత్రం తమ దగ్గర కరోనాకి మెడిసన్ ఉందంటున్నారు. ఈ మెడిసిన్‌తో వ్యాధి చిటికెలో తగ్గిపోతుందంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కి.. నిర్దిష్టమైన టీకా గానీ, దీనిని నయం చేసేందుకు చికిత్స గానీ లేదు. వ్యాక్సిన్ లేని ఈ వైరస్‌కు విరుగుడు కనుక్కోడానికి పలు దేశాల్లోని వైద్యులు విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. చైన్నైలో ఓ ఆయుర్వేద వైద్యుడు మాత్రం ఏకంగా కరోనాకి ఔషదాన్ని కనిపెట్టేశాడు. డేంజరస్ కరోనాకు తన దగ్గర ఔషదముందని, అది తీసుకుంటే కేవలం 24 నుంచి 48 గంటల్లోనే వ్యాధి క్యూర్ అవుతుందని భరోసా ఇస్తున్నాడు. కరోనాకి నివారణ లేదంటు ప్రపంచ అర్యోగ సంస్ధ సైతం చెబుతోంది. వ్యాధి తీవ్రతను తగ్గించడానికి ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయి.
మరో వైపు హోమియోపతిలో కరోనాకు మెడిసన్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా వైరస్ భయంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రామంతపూర్ ప్రభుత్వ హోమియోపతి ఆసుప్రతిలో మందుల కోసం బారులు తీరారు ప్రజలు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో వ్యాధి లక్షణాలు ఉన్నవారికి డాక్టర్లు మందు పంపిణీ చేస్తున్నారు.