సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన దిశ ఫాదర్..!

మహిళలు, బాలికలకు రక్షణ కల్పించే దిశగా మరో అడుగు ముందుకేసింది ఏపీ ప్రభుత్వం. ‘దిశ’ చట్టం పకడ్బందీ అమలుకు ప్రత్యేకంగా పోలీస్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 18 దిశ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో మొదటిది రాజమండ్రిలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగనే దీన్ని స్వయంగా ప్రారంభించారు. ఒక్కో దిశ స్టేషన్‌లో డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు ఉంటారు. మొత్తం 52 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. దిశ చట్టం అమలుకు ప్రత్యేకంగా […]

సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పిన దిశ ఫాదర్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 08, 2020 | 9:42 PM

మహిళలు, బాలికలకు రక్షణ కల్పించే దిశగా మరో అడుగు ముందుకేసింది ఏపీ ప్రభుత్వం. ‘దిశ’ చట్టం పకడ్బందీ అమలుకు ప్రత్యేకంగా పోలీస్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో మొత్తం 18 దిశ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అందులో మొదటిది రాజమండ్రిలో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి జగనే దీన్ని స్వయంగా ప్రారంభించారు.

ఒక్కో దిశ స్టేషన్‌లో డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు ఉంటారు. మొత్తం 52 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. దిశ చట్టం అమలుకు ప్రత్యేకంగా ఐఏఎస్‌ అధికారి కృతికా శుక్లాను, ఐపీఎస్‌ అధికారి దీపికను నియమించింది ఏపీ ప్రభుత్వం.

ఈ సందర్భంగా.. దిశ తండ్రి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఏపీ ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్‌లు ఏర్పాటు చేయడం ఆనందగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో ‘దిశ పోలీస్ స్టేషన్, దిశ యాప్’ ప్రారంభించడం మహిళల్లో ధైర్యం నింపిందన్నారు. 13 జిల్లాల్లో స్పెషల్ ప్రాసిక్యూషన్స్ అందుబాటులోకి తెస్తామనడం చాలా మందికి సహాయపడుతుందని, దిశ ఘటన నేపథ్యంలో తెలంగాణలో కూడా ఇలాంటి ఆలోచనలు చేయాలన్నారు.