మేడారం జాతరలో ముగిసిన కీలక ఘట్టం!
మేడారం జాతరలో కీలకఘట్టం ముగిసింది. సమ్మక్క, సారలమ్మ వనప్రవేశం చేశారు. నాలుగు రోజులుగా భక్తుల పూజలు, నిలువెత్తు బంగారాన్ని మొక్కుల రూపంలో స్వీకరించి.. కోట్లాది భక్తులను ఆశీర్వదించిన ఇద్దరు దేవతలు మళ్లీ వనప్రవేశం చేయడంతో మహా జాతర ముగిసినట్లుగా గిరిజన పూజారులు ప్రకటించారు. అమ్మవార్ల వనప్రవేశానికి ముందు ఆదివాసి పూజారులు సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనప్రవేశానికి శుభ సూచకంగా మేడారంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెల దగ్గర కొద్దిసేపు వర్షం కురవడంతో భక్తులు వానజల్లులో తడుస్తూనే […]
మేడారం జాతరలో కీలకఘట్టం ముగిసింది. సమ్మక్క, సారలమ్మ వనప్రవేశం చేశారు. నాలుగు రోజులుగా భక్తుల పూజలు, నిలువెత్తు బంగారాన్ని మొక్కుల రూపంలో స్వీకరించి.. కోట్లాది భక్తులను ఆశీర్వదించిన ఇద్దరు దేవతలు మళ్లీ వనప్రవేశం చేయడంతో మహా జాతర ముగిసినట్లుగా గిరిజన పూజారులు ప్రకటించారు.
అమ్మవార్ల వనప్రవేశానికి ముందు ఆదివాసి పూజారులు సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనప్రవేశానికి శుభ సూచకంగా మేడారంలోని సమ్మక్క, సారలమ్మ గద్దెల దగ్గర కొద్దిసేపు వర్షం కురవడంతో భక్తులు వానజల్లులో తడుస్తూనే అమ్మవార్లకి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ కుంభమేళాగా రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహాజాతరను చూసేందుకు కోట్లాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ సారి జాతరకు సుమారు కోటిన్నర మందికిపైగా భక్తులు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేశారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఉత్సవంగా పిలవబడే మేడారం జాతరకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పటిష్ట భద్రతతో పాటు భక్తులకు ఏర్పాటు చేసినట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా 21 శాఖల సమన్వయంతో జాతర విజయవంతమైందన్నారు.
మహాజాతర దిగ్విజయంగా ముగియడంపై అధికారులు, ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. మేడారం జాతరను జాతీయ పండుగగా కేంద్రం గుర్తించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తి చేశారు. జాతరలో శాశ్వత వసతి కోసం 100 ఎకరాలు సేకరిస్తామన్నారు.