Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సిద్ధం.. 11 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి

|

Jun 09, 2024 | 6:37 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సిద్ధమవుతోంది. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. 11 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు జెట్‌ స్పీడ్‌తో జరుగుతున్నాయి.

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సిద్ధం.. 11 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి
Babu Oath Ceremony Arrangements
Follow us on

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సిద్ధమవుతోంది. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. 11 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు జెట్‌ స్పీడ్‌తో జరుగుతున్నాయి. ఐదుగరు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఘనంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదిక, సీటింగ్, భద్రత, పార్కింగ్ పై అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు వీఐపీల కోసం గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రత్యేక హెలికాప్టర్లను రెడీ చేస్తున్నారు. అతిథులకు వసతి కల్పనలో ఎలాంటి లోటూ లేకుండా అరెంజ్మెంట్స్ చేస్తున్నారు. ప్రమాణ స్వీకార మెయిన్ స్టేజీ పనులు కొనసాగుతున్నాయి. ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్యలు లేకుండా మ్యాపింగ్‌ చేస్తున్నారు. పార్కింగ్ స్థలాల నుంచి మెయిన్ స్టేజీకి ఈజీగా చేరుకునేందుకు వీలుగా అప్రోచ్ రహదారులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖులతోపాటుగా దాదాపు లక్ష మందికిపైగా ప్రజలు వస్తారని అంచనా వేస్తున్నారు. 80 వేల మందికి సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందే యాక్షన్‌ షురూ చేశారు. ఈసారి పాల‌న‌లో త‌న‌దైన మార్క్ చూపించలనుకుంటున్న చంద్రబాబు, కీల‌క అధికారుల విష‌యంలో ప్రక్షాళ‌న చేపట్టారు. ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆఫీసుల నుంచి డాక్యుమెంట్లు మాయం కాకుండా చర్యలు చేపట్టారు. అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి. అంతే కాకుండా ప్రమాణస్వీకారం తరువాత జరిగే రివ్యూలకు పలు కీలక శాఖల అధికారులు రెడీ అవుతున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో నివేదికలు సిద్ధ చేస్తున్నారు. విద్యుత్ శాఖలో ట్రాన్స్ కో, జెన్ కో లో పరిస్థితిపై చంద్రబాబు సమాచారం తెప్పించుకున్నారు.

అలాగే గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు చంద్రబాబు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు అస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయవాడలో తాగునీటి సరఫరాపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై కూడా సమాచారం తెప్పించుకొని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..