Anantapur: అదే పనిగా సెలవులు పెట్టి సొంతూరు వస్తున్న ఆర్మీ కానిస్టేబుల్.. ఆరా తీయగా మైండ్ బ్లాంక్

అతనో ఆర్మీ కానిస్టేబుల్. అసోంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. కానీ ట్రాక్ తప్పాడు. బాగా మద్యానికి బానిసయ్యాడు. దానికి తోడు పేకాట. దీంతో జీతం సరిపోవట్లేదు. ఈ క్రమంలో ఫ్రెండ్ తప్పుడు సలహాతో.. తప్పుడు పనులు చేయడం షురూ చేశాడు.. కానీ..

Anantapur: అదే పనిగా సెలవులు పెట్టి సొంతూరు వస్తున్న ఆర్మీ కానిస్టేబుల్.. ఆరా తీయగా మైండ్ బ్లాంక్
Police Station
Follow us
Ram Naramaneni

|

Updated on: May 19, 2023 | 2:55 PM

అతడు ఆర్మీలో కానిస్టేబుల్. మంచి జీతం. సొసైటీలో గౌరవం. కానీ వ్యసనాల బారిన పడ్డాడు. వచ్చే డబ్బు సరిపోవడం లేదు. దీంతో మిత్రుడి మాట విని తప్పుడు బాట పట్టాడు. కానీ ఏదో ఒక రోజు పాపం పండక తప్పదు. తాజాగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అనంతపురం జిల్లాలో వాహనాలు తస్కరిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా స్టన్ అయ్యే విషయాలు వెలుగు చూశాయి. అనంతపురం సిటీ ప్రియాంక నగర్‌కు చెందిన గులాం సద్దాం హుస్సేన్ టెన్త్ వరకు చదివాడు. అతడికి 2011లో ఆర్మీ సహస్రాసీమబల్‌‌లో కానిస్టేబుల్‌గా జాబ్ వచ్చింది. ప్రజంట్ అసోంలో డ్యూటీ చేస్తున్నాడు. హుస్సేన్ కొంతకాలంలో వ్యవసనాలకు బానిసయ్యాడు.  పీకలదాకా మద్యం సేవించడం.. పేకాట ఆడటం వంటివి చేసేవాడు.  వచ్చే శాలరీ మొత్తాన్ని ఇలా దుబారాగా ఖర్చు చేసేవాడు. అవి చాలవన్నట్లు అప్పులు కూడా చేశాడు.

దీంతో మనీ బాగా టైట్ అయ్యింది. తన ఇబ్బందులను గార్లదిన్నె మండలం పెనకచెర్లకు చెందిన స్నేహితుడు రాజశేఖర్‌కు చెప్పుకున్నాడు సద్దాం. అప్పుడు రాజశేఖర్.. జీవితాన్ని నాశనం చేసే మరో సలహా ఇచ్చాడు. తాను బైక్‌లు దొంగిలించి అమ్మి.. సొమ్ము చేసుకుంటానని.. ఆ రూట్‌లో ఈజీగా డబ్బు సంపాదించవచ్చని ఉచిత సలహా ఇచ్చాడు. ఈ ఐడియా సద్దాం హుస్సేన్‌కు బాగా నచ్చింది. అస్సాం నుంచి సెలవు పెట్టి వచ్చి స్థానికంగా బైక్‌లు కొట్టేయడం షురూ చేశాడు.

అలా కొట్టేసిన పలు బైక్‌లను అనంతపురం శివారులో ఉన్న నేషనల్‌ పార్క్‌ సమీపంలో ఓ పాడుబడిన షెడ్డులో దాచారు. బైక్ చోరీలు గురించి పదే, పదే కంప్లైంట్స్ రావడంతో.. పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో గుత్తిరోడ్డులోని మార్కెట్‌యార్డ్‌ దగ్గర ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈజీ మనీ కోసం చోరీలు చేసిన ఆర్మీ కానిస్టేబుల్ పోలీసులకు దొరికిపోయాడు. నిందితుల వద్ద నుంచి 17బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి..