APSRTC: పండక్కి ఊరెళ్లేవారికి ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. రానూ పోనూ టికెట్ బుక్ చేస్తే..

|

Dec 19, 2022 | 8:21 PM

సంక్రాంతి సందర్భంగా జనవరి 6 నుంచి 18 వరకు స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అయితే స్పెషల్ బస్సుల్లోనూ నార్మల్ చార్జీలే ఉండనున్నాయి.

APSRTC: పండక్కి ఊరెళ్లేవారికి ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్.. రానూ పోనూ టికెట్ బుక్ చేస్తే..
APSRTC
Follow us on

సంక్రాంతికి పండక్కి ఊరెళ్తున్నారా..? అయితే  ఏపీఎస్‌ఆర్టీసీ ఇస్తున్న ఈ ఆఫర్‌పై ఓ లుక్కేయండి. అప్ అండ్ డౌన్ ఒకేసారి టికెట్లు బుక్‌ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్ ఇవ్వబోతున్నట్లు ఆంధ్రా ఆర్టీసీ ప్రకటించింది. అంతేకాదు పండగ రద్దీ నిమిత్తం 6,400 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు తెలిపింది. జనవరి 6 నుంచి 18 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే.. స్పెషల్ బస్సుల్లోనూ నార్మల్ ఛార్జీలే ఉంటాయి. ముందుగా రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఈ మేరకు వివరాలు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలియజేశారు.

62 స్టార్‌లైనర్‌ నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులు ప్రవేశపెట్టినట్లు ఆర్టీసీ ఎండీ వివరించారు. వచ్చే మార్చి నాటికి కార్గో ద్వారా రూ.165 కోట్ల ఇన్‌కమ్ టార్గెట్‌గా ముందుకెళ్తున్నట్లుగా వివరించారు. అన్ని బస్సుల్లో ఈ మంత్ ఎండింగ్ టిమ్‌ మిషన్స్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఉద్దేశం లేదన్నారు. ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్‌ను తొలిగించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

సంస్థ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని.. ఎక్కడైన అలాంటి జరిగితే వెంటనే చర్యలు తీసకుంటామన్నారు. ఎంప్లాయిస్‌కు అలవెన్సులు, ఓటీలు ఇచ్చే ప్రాసెస్ కూడా స్టార్ చేసినట్లు తెలిపారు. అలవెన్సుల గురించి ఉద్యోగులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. ఆర్టీసీకి వచ్చే ఆదాయాన్ని ప్రతిరోజూ గవర్నమెంట్‌కు చెల్లించే ప్రతిపాదన ఏమీ రాలేదన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం