Vasireddy Padma: మహిళలను కించపరిస్తే ఊరుకునేది లేదు.. రాజకీయ నేతలను గట్టిగా హెచ్చరించిన మహిళా కమిషన్

|

Oct 29, 2022 | 1:53 PM

ఇటీవల ప్రముఖ టాలీవుడ్‌ కమెడియన్‌ అభినవ్ గోమటం నటి కల్పికను ఉద్దేశించి ఐటమ్‌ అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. దీనిపై కల్పిక పోలీసులను కూడా ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది.

Vasireddy Padma: మహిళలను కించపరిస్తే ఊరుకునేది లేదు.. రాజకీయ నేతలను గట్టిగా హెచ్చరించిన మహిళా కమిషన్
Vasireddy Padma
Follow us on

మహిళలను కించపరుస్తూ ఇటీవల కొందరు రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ముఖ్యంగా ప్రముఖ సినీనటి ఖుష్బూపై డీఎంకే నేత ‘ఐటమ్‌’ అంటూ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారాన్నే లేపాయి. సాదిక్‌ జుగుప్పాకర వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై సాక్షాత్తూ డీఎంకే సీనియర్‌ నాయకురాలు కనిమొళి ఖుష్బూకు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ప్రముఖ టాలీవుడ్‌ కమెడియన్‌ అభినవ్ గోమటం నటి కల్పికను ఉద్దేశించి ఐటమ్‌ అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. దీనిపై కల్పిక పోలీసులను కూడా ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలో ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ట్విట్టర్‌ వేదికగా కొన్ని పోస్టులు షేర్‌ చేశారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే పరిస్థతి లేదని అన్ని పార్టీల నాయకులను హెచ్చరించారు.

‘ఐటమ్’ వంటి పదాలకు జైలు శిక్షలు పడుతున్న రోజులివి. అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది’ అని మొదటి పోస్టులో రాసుకొచ్చిన మహిళా చైర్‌పర్సన్‌.. రెండో పోస్టులో సోషల్ మీడియాలో మహిళల గురించి నీచాతినీచంగా పోస్టులు పెట్టే వారిపై డీజీపీ కఠిన చర్యలు తీసుకోవాలి. స్పెషల్ టీమ్ లతో సోషల్ మీడియా పోకడలను కట్టడి చేయాలి’ అని తెలిపారు. ఈ పోస్టులకు అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు డీజీపీలను ట్యాగ్‌ చేసింది. కాగా సోషల్‌ మీడియాలో మహిళల భద్రతకు సంబంధించి ఆమె డీజీపీకి లేఖ రాశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..