Cyclone Montha: ‘మొంథా’ ఆన్‌ డ్యూటీ.. భారీ ఎత్తున ఎగసిపడుతున్న అలలు! వచ్చే 24 గంటల్లో కల్లోలమే

Kakinada Cyclone Montha: మొంథా తుఫాన్ కాకినాడకు సమీపంలో తీరం దాటుతుందని ఐఏండీ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాకినాడ సముద్ర తీరంలో భారీ ఎత్తున సముద్ర కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఒక్కొక్కటి దాదాపు మీటరు ఎత్తున ఎగసి..

Cyclone Montha: మొంథా ఆన్‌ డ్యూటీ.. భారీ ఎత్తున ఎగసిపడుతున్న అలలు! వచ్చే 24 గంటల్లో కల్లోలమే
Impact Of Cyclone Montha In Kakinada

Updated on: Oct 27, 2025 | 8:38 PM

అమరావతి, అక్టోబర్ 27: మొంథా తుపాను మెరుపు వేగంతో తీరం దిశగా దూసుకువస్తోంది. మొంథా తుఫాన్ కాకినాడకు సమీపంలో తీరం దాటుతుందని ఐఏండీ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాకినాడ సముద్ర తీరంలో భారీ ఎత్తున సముద్ర కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఒక్కొక్కటి దాదాపు మీటరు ఎత్తున ఎగసి పడుతున్నాయి. మరోవైపు తుపాన్‌ ప్రమాదానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాన్ తీరం దాటిన తర్వాత, దాటే సమయంలో భారీ ఈదురు గాలులు వర్షాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. దానికి అనుగుణంగా కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి నారాయణ ప్రజా ప్రతినిధులు, అధికారులతో కాకినాడ కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు.

ఎటువంటి పరిస్థితులను ఎదురుకోవడానికైనా సిద్ధంగా ఉండాలని సూచించారు. అందరూ క్షేత్రస్థాయిలో ఉండి పనిచేసి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో తుపాన్ తీరం దాడుతుందని, డెలివరీకి సిద్ధం గా ఉన్న 142 మంది గర్భిణీ స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు షిఫ్ట్ చేశామన్నారు. ఏడూ రోజులు కి సరిపడా మెడిసన్ అందుబాటులో ఉన్నాయని, విద్యుత్ అంతరాయం ఏర్పడితే వెంటనే పరిష్కారం చేయడానికి రాయలసీమ ప్రాంతం నుంచి 1000 మంది సిబ్బందిని ఇక్కడికి తీసుకువచ్చామని అధికారులు తెలిపారు. నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉంచుతున్నామని, 2189 పాడైపోయిన ఇళ్లలో ఉన్న వాళ్ళని ఖాళీ చేయిస్తున్నామని మంత్రికి తెలిపారు.

మరోవైపు వచ్చే 24 గంటల్లో 8 జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. దీంతో ఆయా జిల్లాలకు చెందిన కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.