AP Weather Report: ఏపీలో 3 రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.. ఇవి వివరాలు

| Edited By: Ravi Kiran

Sep 16, 2021 | 2:36 PM

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. కాగా రాబోయే 3 రోజులు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

AP Weather Report: ఏపీలో 3 రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.. ఇవి వివరాలు
Ap Weather
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో పశ్చిమ/ నైరుతి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
—————————————————
ఈరోజు, రేపు , ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :
——————————
ఈరోజు, రేపు , ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:
———————-
ఈరోజు, రేపు , ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశములలో కురిసే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో గత వారం పది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్ని విషయం తెలిసిందే. రెండు, మూడు రోజుల నుంచి కొంత గ్యాప్ ఇచ్చినట్లు కనిపించినా రోజులో ఏదో ఒక సమయంలో వర్షం పడుతూనే ఉంది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు వేడిగా ఉండి.. ఆ తర్వాత సాయంత్రానికి వాతావరణం మారిపోతోంది. పలు చోట్ల సాయంత్రం లేదా రాత్రి సమయంలో వర్షాలు కురుస్తున్నాయి. ఇక రైతులు చాలా ప్రాంతాల్లో నాట్లు వేశారు. విత్తు పెట్టారు. కాగా అతివృష్టి కారణంగా ఈసారి ప్రమాదం ఎదుర్కొవాల్సి వస్తుందేమో అన్న భయంలో అన్నదాతలు ఉన్నారు.

Also Read:దొంగతనం చేసి పట్టుబడ్డ ఏఎస్‌ఐ గుండెపోటుతో మృతి

ప్రజంట్ టాలీవుడ్‌లో దూసుకుపోతున్న ఓ నటే.. ఈ ఫోటోలోని చిన్నారి.. ఎవరో గుర్తించగలరా…?