AP Weather Report: ఏపీని వీడని వరుణుడు.. రేపు, ఎల్లుండి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు..

|

Dec 02, 2021 | 9:16 AM

రుణుడు తెలుగు రాష్ట్రాలను వీడడం లేదు. ముఖ్యంగా భారీ వర్షాలు, వరదలతో నష్టపోయి ఇప్పుడిప్పుడే

AP Weather Report:  ఏపీని వీడని వరుణుడు.. రేపు, ఎల్లుండి ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు..
Follow us on

ఆంధ్రప్రదేశ్ ను వరుణుడు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్రతో పాటు  ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక ఈ అల్పపీడనం రేపటికి తుఫానుగా బలపడి ఆతర్వాత వాయువ్యదిశగా కదిలి డిసెంబరు 4న ఉదయం ఉత్తరాంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో 3, 4 తేదీల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా పశ్చిమగోదావరి జిల్లాలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అధికారుల అప్రమత్తం..
తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని తెలిపింది అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో.. 5వ తేదీ వరకు మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని కోరుతున్నారు. ఇక రైతులు పంటలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

Also read:

Anantapuram Rains:అనంతపురం జిల్లాను వీడని వరద కష్టాలు.. ప్రాణాలకు తెగించి నది దాటి మృతదేహనికి అంత్యక్రియలు

Andhra Pradesh: రోడ్డుపై గుంతలతో వాహన దారుల ఇబ్బందులు.. స్వయంగా మరమ్మతులు చేసిన ఎమ్మెల్యే ముస్తఫా..

Andhra Pradesh: వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న సీఎం జగన్.. షెడ్యూల్ వివరాలివే..