AP Weather Alert: ఉత్తర -దక్షిణ ద్రోణి రాయలసీమ నుండి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు అంతర్భాగంగా సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించి ఉంది. ఉత్తర బంగాళాఖాతంలో 2022 ఆగస్టు 19 తేదీ నాటికి అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీలో రానున్న మూడు రోజులకు వాతావరణ సూచనలను చేశారు.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్- యానాం: ఈ రోజు, రేపు , ఎల్లుండి (ఆగష్టు 18వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ : ఈ రోజు, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఎల్లుండి (ఆగష్టు 18వ తేదీ) తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
రాయలసీమ: ఈ రోజు, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..