Andhra: అబ్బబ్బ.! చల్లటి వార్త చెప్పారండీ.. ఏపీకి భారీ రెయిన్ అలెర్ట్.. ఈ జిల్లాలకు

రాజస్థాన్ పరిసర ప్రాంతాలలో వాయుగుండం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఇవాళ ఏపీలో కోస్తా, ఉత్తరాంధ్రలో కంటిన్యూగా వాన కురుస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి మరి.

Andhra: అబ్బబ్బ.! చల్లటి వార్త చెప్పారండీ.. ఏపీకి భారీ రెయిన్ అలెర్ట్.. ఈ జిల్లాలకు
Andhra Weather Report

Updated on: Jul 17, 2025 | 8:30 PM

రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు. రానున్న మూడు రోజులు వాతావరణం క్రింది విధంగా ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు.

శుక్రవారం(18-07-2025):

• ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

శనివారం(19-07-2025):

• ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

• శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఆదివారం(20-07-2025):

• కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

గురువారం సాయంత్రం 7 గంటల నాటికి ఎన్టీఆర్ జిల్లా ఉటుకూరులో 69.2మిమీ, గుంటూరు జిల్లా బేతపూడిలో51.5మిమీ, బాపట్ల జిల్లా పర్చూర్ లో 50.25మిమీ, ఎన్టీఆర్ జిల్లా చీమలపాడులో 44.7మిమీ, కోనసీమ జిల్లా నగరంలో 43మిమీ, కృష్ణా జిల్లా బోడగుంటలో 42.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..