Andhra: ఏపీలోని ఆలయాల్లో ఇకపై అవి నిషేధం .. మర్చిపోయి వెళ్లారో ఫైన్ తప్పదు

ఆంధ్రప్రదేశ్‌లోని ఆలయాల్లో ఇకపై సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం నిషేధం. దేవదాయశాఖ ఆదేశాల మేరకు పూజా సామాగ్రి, ప్రసాదం కోసం ప్లాస్టిక్ కవర్లకు బదులుగా అరటి ఆకు కప్పులు, స్టీల్ గ్లాసులు ఉపయోగించనున్నారు. ఆలయ ప్రాంగణంలోకి ప్లాస్టిక్ తీసుకెళ్లినా, విక్రయించినా జరిమానా విధించనున్నారు.

Andhra: ఏపీలోని ఆలయాల్లో ఇకపై అవి  నిషేధం .. మర్చిపోయి వెళ్లారో ఫైన్ తప్పదు
Temple

Edited By: Ram Naramaneni

Updated on: Aug 11, 2025 | 6:08 PM

ప్రసాదం తీసుకోవాలన్నా, పూజా సామాగ్రి తీసుకెళ్లాలన్నా… పళ్లు, పూలు సమర్పించాలన్నా ఇలా ఆలయంలోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి.. బయటకు వచ్చే వరకూ ప్రతి పనిలోని ప్లాస్టిక్ బ్యాగ్‌ల వినియోగం ఎక్కువుగా ఉంటుంది. అయితే ఇక ముందు ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్స్ తీసుకెళ్తే.. కచ్చితంగా జరిమానా విధించనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఆదేశాలను దేవదాయశాఖ జారీ చేసింది.

ఆలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధిస్తూ ఏపి దేవదాయశాఖ కమీషనర్ రామచంద్రమోహన్ ఈ నెల 8వ తేదిన జివో జారీ చేశారు. కమీషనర్ ఆదేశాలను అమలు చేసేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో అధికారులు సిద్దమయ్యారు. పూజా సామాగ్రి తీసుకురావడం దగ్గర నుంచి ప్రసాదం అందించేంత వరకూ ఇక ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదని సిబ్బందికి సూచిస్తున్నారు. దేవదాయ శాఖ అందించే ప్రసాదాన్ని ఒక అరటి ఆకులుతో చేసిన కప్పులుు వినయోగించాలని చెబుతున్నారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లు ఎట్టి పరిస్థితుల్లో ఆలయ దుకాణ సముదాయాల్లోకి రాకుంచా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ కవర్లు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.

ఆలయంలో అందించే త్రాగునీటిని కూడా స్టీల్ గ్లాసుల్లోనే అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోని తాగునీటి బాటిల్స్ విషయంలో కూడా కఠినంగా వ్యవహరించనున్నారు. పొన్నూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదం అందించేందుకు ప్రత్యేక కవర్లు వినియోగిస్తన్నట్లు ఈవో అమర్ నాధ్ తెలిపారు. ఇకముందు ఆలయ ప్రాంగణంలోకి ప్లాస్టిక్ తీసుకురాకుండా భక్తుల్లోనూ అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. దుకాణాల వద్ద ప్లాస్టిక్ కవర్లు విక్రయించవద్దంటూ బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న రోజుల్లో ఆలయాలు పర్యావరణ హితంగా మారనున్నట్లు అమర్ నాధ్ తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.