Weather Forecast: ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు.. తెలంగాణలో నేడు ఈ ప్రాంతాలలో భారీ వర్షం

|

Aug 25, 2021 | 1:37 PM

ఇప్పటికే కొన్ని రోజులుగా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. కాగా మరో 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రము వెల్లడించింది. ఇక తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.

Weather Forecast: ఏపీలో మరో 3 రోజుల పాటు వర్షాలు.. తెలంగాణలో నేడు ఈ ప్రాంతాలలో భారీ వర్షం
Rains In AP
Follow us on

ఇప్పటికే కొన్ని రోజులుగా ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. కాగా మరో 3 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రము వెల్లడించింది. ప్రధానంగా తక్కువ ఎత్తులో నైరుతి గాలులు, పశ్చిమ గాలులు వీస్తుండటం వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన :

ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం :
—————————————————
ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర :
——————————
ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ:
———————-
ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

 

తెలంగాణలో కూడా…

తెలంగాణలో నేడు (ఆగస్టు 25) పలు ప్రాంతాలలో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాలలో కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. కొన్ని జిల్లాల్లో ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, కొమురం భీం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Also Read:మోహన్ బాబు వస్తున్నారని తెలిసి.. రెస్టారెంట్ బ్యాక్ డోర్ నుంచి పారిపోయిన విష్ణు.. లవ్ స్టోరీలో ఎన్నో ట్విస్టులు

 ఏకంగా మంత్రినే టార్గెట్ చేసిన దుండగులు.. నకిలీ ఈడీ నోటీసులో బెదిరింపులు