AP News: విజయవాడ టూ శ్రీశైలం.. ఇకపై 30 నిమిషాలే.. ఏపీలో మరో అద్భుతం..
"మరోసారి అదిరిందయ్యా చంద్రం.." అనిపించారు ఏపీ ముఖ్యమంత్రి. ఇంతవరకూ విదేశాలకే పరిమితమైన సీప్లేన్ సర్వీస్‌ను..దేశంలో తొలిసారి పర్యాటకపరంగా అందుబాటులోకి తెచ్చారు. దీంతో విజయవాడ నుండి శ్రీశైలం..కేవలం అరగంటలోనే చేరుకునే అవకాశం లభించింది.
ఏపీలో మరో అద్భుతం ఆవిష్కృతమయింది. పర్యాటకరంగంలో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకున్న చంద్రబాబు ప్రభుత్వం..రాష్ట్రంలో సరికొత్తగా సీప్లేన్ సర్వీసులకు శ్రీకారం చుట్టింది. విజయవాడ పున్నమిఘాట్ నుంచి శ్రీశైలంలోని పాతాళగంగ వరకు ఫస్ట్ సర్వీస్ నడించింది. సీఎం చంద్రబాబుతో పాటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులు, కేంద్ర, రాష్ట్రప్రభుత్వ అధికారులు తొలి సర్వీస్‌లో జర్నీ చేశారు. సీ ప్లేన్‌తో టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు..ముఖ్యమంత్రి. రౌడీలు ఉంటే రాష్ట్రానికి ఎవరూ రారని..పెట్టుబడులు కూడా పెట్టరని చెప్పారు. ప్రశాంతమైన వాతావరణం ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్నారు.
ఇది చదవండి: సినిమాల్లో అలా.. బయటేమో ఇలా.. విజయ్‌తో ప్రైవేట్ ఆల్బమ్ చేస్తోన్న ఈ అమ్మాయి ఎవరో తెల్సా.?
సీ ప్లేన్‌లో విజయవాడ నుంచి బయలుదేరిన చంద్రబాబు..కేవలం 40 నిమిషాల్లో శ్రీశైలం చేరుకున్నారు. పాతాళగంగ నుంచి రోప్‌వే ద్వారా ముఖ్యమంత్రి కొండపైకి చేరుకున్నారు. అనంతరం శ్రీశైలం శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు చంద్రబాబు. అనంతరం అదే సీప్లైన్‌లో తిరిగి విజయవాడ చేరుకున్నారు. ఈ సీ ప్లేన్ సర్వీస్‌తో విజయవాడలోని కనకదుర్గ దర్శనం, శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయ సందర్శనం మరింత సులభతరం అయింది. వాస్తవానికి విజయవాడ-శ్రీశైలం మధ్య 270 కిలోమీటర్లు దూరం ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా కనీసం నాలుగు గంటలకు పైగా సమయం పడుతుంది. అయితే సీ ప్లేన్‌లో కేవలం అరగంటలోనే విజయవాడ నుండి శ్రీశైలంకు చేరుకోవచ్చు. డీ హవిల్లాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ రూపొందించిన ఈ సీప్లేన్‌లో మొత్తం 14 సీట్లు ఉంటాయి. ఫ్లైట్ టేకాఫ్, ల్యాండింగ్ కోసం 10 నిమిషాలు పోనూ..ఆకాశంలో 30నిమిషాల జర్నీ ఉంటుంది. పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించేలా 1,500 అడుగుల ఎత్తులోనే సీప్లేన్ ప్రయాణస్తుంది. టేకాఫ్, ల్యాండింగ్ రెండూ నీటిలోనే ఉండడం సీ ప్లేన్ స్పెషాలిటీ. సాధారణ విమానాల్లా వీటికి రన్‌వే అవసరం లేదు. నీటిలో తేలియాడే జెట్టీ ఉంటే సరిపోతుంది.
ఇది చదవండి: ముంచుకొస్తున్న మరో గండం.! అయ్యబాబోయ్.. ఏపీలో ఈ ప్రాంతాలకు భారీ వర్ష సూచన
పౌర విమానయాన మంత్రిత్వశాఖతో కలిసి రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఈ సీప్లేన్ సర్వీసులను నిర్వహించనుంది.ఈ సర్వీస్‌లు సక్సెస్ అయితే మరిన్ని సీప్లేన్‌లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది ప్రభుత్వం. అందుకు విశాఖ తీరం, నాగార్జునసాగర్, గోదావరి ప్రాంతాలను పరిశీలిస్తోంది. ఇటీవలే అంతర్జాతీయ డ్రోన్ సదస్సుతో వరల్డ్ వైడ్‌గా అటెన్షన్ అందుకున్న ఏపీ..ఇప్పుడు సీ ప్లైన్ సర్వీస్‌తో మరోసారి దేశం దృష్టిని ఆకర్షించిందని చెప్పాలి.
ఇది చదవండి: మంచు కొండల్లో తవ్వకాలు.. దొరికిన మట్టి కుండ.. తెరిచి చూడగా కళ్లు జిగేల్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..