AP 10th Class Results: విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. పదో తరగతి పరీక్షా ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి..

|

May 06, 2023 | 12:06 PM

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. శనివారం ఉదయం 11గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. 

AP 10th Class Results: విద్యార్థులకు బిగ్ అలెర్ట్.. పదో తరగతి పరీక్షా ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి..
Ap Ssc Results
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. శనివారం ఉదయం 11గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. పదోతరగతి పరీక్షలు ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు జరిగిన విషయం తెలిసిందే. 18 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈఏపీ) ఫలితాలను విడుదల చేయడం విశేషం.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6,05,052 మంది పరీక్షలకు హాజరు కాగా.. బాలురు 3,09,245, బాలికలు 2,95,807 మంది హాజరైన వారిలో ఉన్నారు.

విజయవాడలో ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ వ్యక్తిగత ఫలితాలను అధికారిక వెబ్ సైట్లు bse.ap.gov.in , www.results.bse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు..  దీంతోపాటు టీవీ9 వెబ్ సైట్‌ లో కూడా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

AP SSC ఫలితాలు 2023 ఎలా తనిఖీ చేయాలి..

విద్యార్థులు ఈ దశలను అనుసరించడం ద్వారా ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

  • bse.ap.gov.inలో BSEAP అధికారిక సైట్‌ని సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న AP 10వ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి.
  • లాగిన్ వివరాలను నమోదు చేసి, ఎంటర్ క్లిక్ చేయండి.
  • పూర్తయిన తర్వాత మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • ఆ తర్వాత దానిని డౌన్‌లోడ్ చేసుకోండి..

మరిన్ని ఏపీ వార్తల కోసం..