AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఆ మున్సిపాలిటీ ఎన్నికల రద్దు.. ఈసీ సంచలన నిర్ణయం.. ఎందుకంటే?

స్థానిక సంస్థలకు సర్వం సిద్ధమైన వేళ ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామం వెలుగు చూసింది. కడప జిల్లా మైదుకూరు పురపాలక సంఘం ఎన్నికల వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మున్సిపల్ స్థానానికి ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఈ మేరకు ఈసీ స్పష్టం చేసింది.

Andhra News: ఆ మున్సిపాలిటీ ఎన్నికల రద్దు.. ఈసీ సంచలన నిర్ణయం.. ఎందుకంటే?
Mydukur Municipality Elections
Anand T
|

Updated on: Oct 19, 2026 | 3:02 PM

Share

స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైన వేళ ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కడప జిల్లా మైదుకూరు పురపాలక సంఘం ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మున్సిపాలిటీ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. నామినేషన్ల స్వీకరణ జరుగుతున్న సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నామినేషన్ కేంద్రంలోకి చొరబడి కొన్ని నామినేషన్ పత్రాలను ధ్వంసం చేయడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపిన కడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అథారిటీ ఈసీకి ఒక నివేదికను సమర్పించారు. ఆ నివేదికను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఈ మున్సిపాలిటీ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

అసలేం జరిగింది?

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈసీ నామినేషన్లను స్వీకరించింది. అయితే అక్టోబర్ 17వ తేదీన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో మైదుకూరు మున్సిపాలిటీలోని నామినేషన్ కేంద్రంలోకి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా చొరబడ్డారు. వారు అక్కడ ఉన్న దాదాపు 19 నామినేషన్ పత్రాలను లాక్కొని పూర్తిగా చించివేసినట్లు తెలిసింది. ఈ ఘటన జరిగిన సమయంలో కేంద్రం వద్ద భారీగా పోలీసులను మోహరించినప్పటికీ ఇలా జరగడం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు, పత్రాలు ధ్వంసమైన అభ్యర్థులు మళ్లీ నామినేషన్ దాఖలు చేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. ఈ మేరకు ఆయా అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. చిరిగిపోయిన పత్రాల స్థానంలో కొత్త వాటిని దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అలాగే అభ్యర్థుల నామినేషన్ పత్రాల రక్షణ కోసం పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని సీఈవో తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us