Road Accident: రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు స్టూడెంట్స్ మృతి!

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కర్నాటక సరిహద్దు ప్రాంతంలో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు చీకలబైలుకు చెందిన కుశాల్‌రెడ్డి, భువనేశ్వర్‌గా గుర్తించారు.

Road Accident: రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. స్పాట్‌లోనే ఇద్దరు స్టూడెంట్స్ మృతి!

Edited By:

Updated on: Mar 21, 2026 | 10:43 AM

ఆంధ్రప్రదేశ్‌లో వేర్వే ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించడంతో పాటు మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్‌లోని చీకబైలుకు చెందిన కుశాల్‌రెడ్డి, భువనేశ్వర్‌ అనే ఇద్దరు యువకులు కర్ణాటకలో ఉండి చదువుకుంటున్నారు. అయితే ఇటీవల స్కూల్‌కి వరుస సెలవులు కావడంతో కర్ణాటకలోని రాయల్పాడు నుంచి సొంతూరు చీకలబైలుకు బైక్‌పనై బయల్దేరారు. వారు అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం సమీపానికి రాగానే వేగంగా దూసుకొచ్చిన ఓ లారి వారి బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదాన్ని గమనించిన స్థానిక వాహనదారులకు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌లకు తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదిలా ఉండగా మార్కాపురం జిల్లాలోనూ మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యర్రగొండపాలెం మండలం అనకుంట దగ్గర రెండు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణిస్తున్న సుమారు నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.

ఇక ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద స్థలాన్ని గమనించిన క్రెయిన్ సహాయంతో రోడ్డు అండ్డంగా ఉన్న కార్లను పక్కకు తొలగించారు. ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us