AP Corona Updates: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే?

|

Jan 06, 2022 | 8:54 PM

AP Covid-19 Updates: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఒక్కసారిగా పెరుగుతున్న కేసులతో అన్ని రాష్ట్రాల్లో ఆందోళన మొదలైంది. వీటితోపాటు

AP Corona Updates: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే?
Ap Corona
Follow us on

AP Covid-19 Updates: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఒక్కసారిగా పెరుగుతున్న కేసులతో అన్ని రాష్ట్రాల్లో ఆందోళన మొదలైంది. వీటితోపాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో కేంద్రం ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా మహమ్మారి కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 33,339 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 547 కేసులు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,78,923కి చేరింది. కాగా.. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారితో విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 14,500కి పెరిగింది. ఈ మేరకు ఏపీ వైద్యఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

కాగా.. 24 గంటల వ్యవధిలో ఈ మహమ్మారి నుంచి 128 మంది కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 20,62,157కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,266 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా.. ఈ రోజు నమోదైన కేసుల్లో ఎక్కువగా చిత్తూరు జిల్లాలో 96 కేసులు నమోదు కాగా.. విశాఖపట్నం జిల్లాలో 89 కేసులు, కృష్ణా జిల్లాలో 66, గుంటూరులో 49, నెల్లూరులో 42 కేసులు నమోదయ్యాయి.

Also Read: Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు కు కరోనా పాజిటివ్

Telangana Covid19: తెలంగాణలో మళ్లీ కరోనా కల్లోలం.. నిన్న వెయ్యి దాటిన కేసులు, ఇవాళ రెండు వేలకు చేరువగా నమోదు!