AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీకే నిత్యావసర సరుకులు!

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పడూ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో త్వరలో రేషన్ మార్ట్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొంది. తొలుత కొన్ని జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్‌గా వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తోంది. అవి సక్సెక్ అయితే రాష్ట్రవ్యాప్తంగా తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీకే నిత్యావసర సరుకులు!
Ap Ration Marts
Anand T
|

Updated on: Apr 11, 2026 | 9:02 AM

Share

రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. రేషన్ మార్ట్‌ల ద్వారా ప్రజలకు సబ్సిడీలో నిత్యావసర సరుకులు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రేషన్‌ మార్టు ఏర్పాటు చేయాలని చూస్తుంది. ఇందులో భాగంగానే త్వరలో ​విజయవాడలోని మూడు సర్కిళ్లలో పైలట్ ప్రాజెక్టుగా ఈ మార్టులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.

​ఈ రేషన్ మార్ట్‌లో బియ్యంతో పాటు పప్పు దినుసులు, రవ్వలు, కాస్మటిక్స్ విక్రయించాలని భావిస్తోంది. రేషన్ షాపుల్లో కేవలం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యం, కందిపప్పు మాత్రమే కాకుండా.. నాణ్యమైన నూనెలు, గోధుమ పిండి, పంచదార, ఉప్పు వంటి ఇతర నిత్యావసరాలను కూడా ఈ మార్ట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ప్రముఖ కంపెనీల వస్తువులను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే ఈ మార్టుల ద్వారా ప్రజలకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అలాగే ​రేషన్ డీలర్ల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వస్తువుల అమ్మకాల ద్వారా వచ్చే కమిషన్‌తో రేషన్ డీలర్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కూడా ఈ పథకం ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.అయితే ప్రస్తుతం విజయవాడలో ఏర్పాటు చేయబోతున్న ఈ రేషన్‌ మార్ట్‌లకు ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలా వద్దా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రేషన్ కార్డు ఉన్న వారికి సూపర్ గుడ్‌న్యూస్.. ఆ మార్ట్‌లలో సబ్సిడీ
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
రాగి పాత్రలో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే అది విషమే!
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
త్వరలోనే ఆ టైం వస్తుంది.. ఇంతకీ మ్యాచ్ తర్వాత వైభవ్ ఏం చెప్పాడు
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..