AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: పొంచి ఉన్న వాయుగుండం.. నేటి నుంచి రాబోయే 3 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

అర్నబ్ తుఫాన్ నుంచి తేరుకోక ముందే ఏపీ వాసులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మరోసారి భారీ వర్షాల హెచ్చరికలను జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని .. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురసే ఛాన్స్ ఉందని తెలిపింది. కాబట్టి ఏ జిల్లాలో వర్షాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

Rain Alert: పొంచి ఉన్న వాయుగుండం.. నేటి నుంచి రాబోయే 3 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Latest Weather Report For Andhra Pradesh
Anand T
|

Updated on: Oct 31, 2026 | 6:39 AM

Share

అండమాన్ సముద్రం, ఆనుకుని ఉన్న నికోబార్ దీవులపై కేంద్రీకృతమైన అల్పపీడనం నేడు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఆతదుపరి 2 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు కదిలే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతాల్లోకి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

శనివారం(31-10-2026) : మన్యం, అల్లూరి, పోలవరం, కోనసీమ, పశ్చిమగోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ; మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఆదివారం(01-11-2026): కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ; మిగతా జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

సోమవారం(02-11-2026) : తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు ; మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఇక శుక్రవారం సాయంత్రం 6 గంటల నాటికి కోనసీమ జిల్లా నగరంలో 91.5మిమీ, పశ్చిమగోదావరి తణుకులో 81.2మిమీ, అనకాపల్లి జిల్లా చోడవరంలో 80.2మిమీ, కాకినాడ జిల్లా వేలంగిలో 76.9మిమీ, కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 76.7మిమీ, కోనసీమ జిల్లా మామిడికుదురులో 54.2మిమీ, అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 52.5 మిమీ చొప్పన వర్షపాతం నమోదైందన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us