చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఆ ఇద్దరు వైసీపీ నేతలు.. ఏపీ రాజకీయల్లో ఇప్పుడిదే హాట్ గురూ..!

|

Apr 20, 2023 | 3:12 PM

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీతో పాటు కొందరు వైసీపీ నేతలు కూడా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ తెలియజేయడం ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఆ ఇద్దరు వైసీపీ నేతలు.. ఏపీ రాజకీయల్లో ఇప్పుడిదే హాట్ గురూ..!
Chandrababu Naidu
Follow us on

తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడికి పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీతో పాటు కొందరు వైసీపీ నేతలు కూడా సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ తెలియజేయడం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు నాయుడికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బర్త్ డే విషెస్ తెలియజేయడంపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇంతలోనే ఆ పార్టీకి చెందిన మరో నేత, సినీ నిర్మాత పొట్టూరి వరప్రసాద్ (PVP) చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ‘సమాజానికి సేవ చేసే ప్రతి నాయకుడు కలకాలం వర్ధిల్లాలి! తెలుగు జాతికి మంచి పనులు చేయడానికి మరింత శక్తిని, ఉత్సాహన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ’ అంటూ చంద్రబాబుకు పీవీపీ బర్త్ డే విషెస్ తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి విజయవాడ ఎంపీ సీటును ఆశిస్తున్న పీవీపీ.. ఈ రకమైన ట్వీట్ చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

విజయసాయి రెడ్డి, పీవీపీ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఏపీ రాజకీయా వర్గాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. గతంలో వారిద్దరూ సోషల్ మీడియా వేదికగా పలు సందర్భాల్లో చంద్రబాబుపై కాస్త తీవ్రమైన పదజాలంతోనే విమర్శలు చేశారు. తిట్ల దండకం వినిపించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ఇప్పుడు వారు చేసిన సోషల్ మీడియా పోస్టింగ్స్‌లో టోన్ గతానికి పూర్తి భిన్నంగా ఉండటం విశేషం. రాజకీయ ప్రత్యర్థులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం హుందాగా ఉంటుందని, వీరు చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలియజేయడాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదన్నది కొందరి అభిప్రాయం. అయితే రాజకీయ నాయకులు చేసే ప్రతి పని వెనుక ఏదో లెక్క ఉంటుందని.. విజయసాయి, పీవీపీ చేసిన బర్త్ డే విషెస్ ట్వీట్స్‌ను తేలిగ్గా తీసుకోవడానికి లేదన్నది మరో వాదన. మరీ ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. దీని వెనుక తప్పక రాజకీయ అంశాలు ముడిపడి ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ పీవీపీ చేసిన ట్వీట్..

వైసీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని పీవీపీ ఉవ్విళ్లూరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఎంపీ సీటును ఆయనకు జగన్ నిరాకరించినందునే.. కొంత సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబుపై పీవీపీ ప్రేమ చూపిస్తున్నారంటూ కొందరు వైసీపీ సానుభూతిపరులు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందిస్తున్నారు. ఉన్నట్టుండి చంద్రబాబు మీద పీవీపీకి అంత ప్రేమ ఎందుకు పుట్టికొచ్చిందన్నది మరో నెటిజన్ ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో టీడీపీ సీటు కోసమే పీవీపీ చంద్రబాబుకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ఓ నెటిజన్ అనుమానం వ్యక్తంచేశారు. పీవీపీ ట్వీట్‌తో విజయవాడ ఎంపీ సీటు రేసులో పీవీపీ లేరని తేలిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఈ బర్త్ డే విషెస్ ట్వీట్స్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..