Watch Video: లారీ ఎత్తుకెళ్లిన దొంగలు.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు! వీడియో వైరల్

రాజానగరం మండలంలో లారీ దొంగతనం కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. లారీ రికవరీ చేసిన పోలీసులు, నలుగురు అంతరాష్ట్ర నిందితులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు అంతర్ రాష్ట్రాల లారీల దొంగల ముఠా గుట్టురట్టు చేసిన రాజానగరం పోలీసులు. రాజస్థాన్, మహారాష్ట్ర ప్రాంతాల నుండి ఏపీకి వచ్చిన..

Watch Video: లారీ ఎత్తుకెళ్లిన దొంగలు.. చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు! వీడియో వైరల్
Rajanagaram Lorry Theft Case

Updated on: Oct 17, 2025 | 7:12 PM

రాజానగరం, అక్టోబర్ 17: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో లారీ దొంగతనం కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. లారీ రికవరీ చేసిన పోలీసులు, నలుగురు అంతరాష్ట్ర నిందితులు అరెస్ట్ చేశారు. మేరకు అంతర్ రాష్ట్రాల లారీల దొంగల ముఠా గుట్టురట్టు చేసిన రాజానగరం పోలీసులు. రాజస్థాన్, మహారాష్ట్ర ప్రాంతాల నుండి ఏపీకి వచ్చిన రాజస్థాన్ దొంగల ముఠా.. రాజమండ్రి, రాజానగరం ప్రాంతాలను దొంగతనాలకు హబ్ గా మార్చుకున్నారు. క్రమంలో తెల్లవారుజామున రాజమండ్రి గామాన్ బ్రిడ్జ్ సమీపంలోని ఏఎన్ఆర్ కాటాలో మాటువేసి టిప్పర్ లారీని దుండగులు ఎత్తుకెళ్లిపోయారు. బాధితుడు మన్యం గణేశ్వర ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసిన పోలీసులు అక్కడి సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ ఫుటేజ్ ఆధారంగా లారీను దట్టమైన పొదల్లో దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే రాజానగరం పోలీసులు లారీను రికవరీ చేసుకున్నారు.

చోరీకి పాల్పడిన నిందితులను రాజస్థాన్, మహారాష్ట్ర ప్రాంతాల్లో పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితులు నలుగురు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన శోకత్, జమాల్ ఖాన్, సోహిల్, మహమ్మద్ రసుద్దీన్ ఖాన్ గా గుర్తించినట్లు డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్వార్తల కోసం క్లిక్చేయండి.