AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. ఈ జిల్లాలకు విస్తారంగా వర్షాలే వర్షాలు

|

Oct 16, 2024 | 8:00 AM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. వాయువ్య దిశగా గంటకు 10కిమీ వేగంతో కదులుతున్న వాయుగుండం.. చెన్నైకి 440 కి.మీ., పుదుచ్చేరికి 460 కి.మీ, నెల్లూరుకి 530 కి.మీ దూరంలో ఉంది.

AP Rains: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా.. ఈ జిల్లాలకు విస్తారంగా వర్షాలే వర్షాలు
Andhra Weather
Follow us on

వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతున్నాడు. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారింది. దీంతో ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. లేటెస్ట్‌గా వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలు బెంబేలెత్తిస్తున్నాయి.

ఇది చదవండి: హిట్‌మ్యాన్ వారసుడొచ్చాడన్నారు.. కట్ చేస్తే.. 3 డకౌట్‌లతో టీమిండియాకు ఎగనామం పెట్టాడు.. ఎవరంటే?

వివరాల్లోకి వెళ్తే.. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు కదలుతూ తీవ్ర తుపానుగా మారి, చెన్నైకి దక్షిణంగా తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కుండపోత తప్పదని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఇక ఇప్పటికే ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. విశాఖపట్నం, కడప, తిరుపతి, చిత్తూరు, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక అల్పపీడనం వాయుగుండంగా మారడంతో మోస్తరు వర్షాలు కాస్తా.. కుండపోతగా మారుతాయని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఈ అమ్మకూచి ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గోడకు కొట్టిన బంతిలా..

ఇటు తమిళనాడులోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టుతోపాటు మొత్తం 10 జిల్లాలకు ఆరెంజ్​అలెర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. మరో వారం రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలతో పాటు కోయంబత్తూరు, తిరుప్పూర్ జిల్లాల్లోని ఘాట్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు.. క‌ర్ణాట‌కలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింది. దాంతో.. పలు ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇప్పటికే.. బెంగ‌ళూరు వ్యాప్తంగా వాన‌లు దంచికొడుతుండగా.. మరో రెండు రోజులపాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బెంగ‌ళూరులోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠ‌శాల‌ల‌కు కర్నాటక ప్రభుత్వం సెలవులు ప్రక‌టించింది. అలాగే.. ఉద్యోగులు వీలైనంత వ‌ర‌కు వ‌ర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని సూచించింది. మొత్తంగా.. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతుండగా.. అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో కుంభవృష్టి ఖాయమన్న సంకేతాలిస్తోంది వాతావరణశాఖ. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.

ఇది చదవండి: సముద్రపుటొడ్డున వింత ఆకారం.. ద్రవంలా ఉందని పట్టుకుంటే గుండె గుభేల్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..