AP Municipal & Corporation Elections 2021 Results: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డ్ సృష్టిస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్ దిశగా వైసీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ సత్తా చాటుతోంది. ఫ్యాన్ దూకుడుకు టీడీపీ, బీజేపీ, జనసేన పత్తా లేకుండా పోతున్నాయి. ఇప్పటివరకు 3 కార్పొరేషన్లు వైసీపీ కైవసం చేసుకుంది. చిత్తూరు, తిరుపతి, కడప కార్పొరేషన్లలో విజయం సాధించింది.
ఇదిలావుంటే… ఆంధ్రప్రదేశ్‌లోని 13జిల్లాల్లో జరిగిన పురపోరులో 11 కార్పొరేషన్లు…71మున్సిపాలిటీలకు 10న ఎన్నికలు జరిగాయి. అయితే ఇందులో పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌తో పాటు గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీ ఫలితాలను మాత్రం హైకోర్టు ప్రకటించవద్దని ఆదేశించింది.
దీంతో మిగిలిన 11 కార్పొరేషన్‌లు, 70మున్సిపాలిటీల ఫలితాలు వెలవడనున్నాయి. కార్పొరేషన్‌ల విషయానికి వచ్చేసరికే…గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, మచిలీపట్నం, ఒంగోలు, కర్నూలు, కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపురం , విజయనగరం కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఈ 11కార్పొరేషన్‌ల ఫలితాల్లో కూడా విజయవాడ, గుంటూరు రిజల్ట్స్ కీలకంగా మారాయి. రాజధాని మార్పుకి ప్రభుత్వం ఆమోదించడంతో…ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు విశాఖ కార్పొరేషన్ ఫలితంపై కూడా సందిగ్ధం నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంతో ఇక్కడి ఓటర్లు అధికార వైసీపీని గెలిపిస్తారా ? ప్రతిపక్ష పార్టీలను ప్రోత్సహిస్తారా ? అన్నది చూడాలి.
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 98వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ఒక్క స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు. 94చోట్ల టీడీపీ పోటీలో నిలబడితే …2 స్థానాలను సీపీఐ, సీపీఎంకి వదిలేసింది. మరో రెండు చోట్ల అభ్యర్ధులు చివరి నిమిషంలో డ్రాప్ అవడంతో ..స్వతంత్రులకు టీడీపీ మద్దతిచ్చింది. ఇక నర్సీపట్నం, యలమంచలి మున్సిపాలిటీలకు పోలింగ్ జరిగింది. నర్సీపట్నంలో 28వార్డులకు కౌంటింగ్ జరగనుంది. యలమంచలిలో 25వార్డులకు గాను 3వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవం అయ్యాయి. 22చోట్ల ఫలితాలు తేలాల్సి ఉంది. చైర్మన్ అభ్యర్ధిగా పోటీలో నిలిచిన పల్లా రమాకుమారి 5వ వార్డులో ఏకగ్రీవం అయ్యారు. అటు మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె డాక్టర్ ప్రియాంక 6వ వార్డు నుంచి పోటీ చేశారు. ఈమె GVMCలోనే డిప్యూటీ మేయర్ రేసులో ఉన్నారు. మేయర్ బీసీ జనరల్‌కి రిజర్వ్ కావడంతో డిప్యూటీ మేయర్ కూడా 5 సామాజికవర్గాలకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన బెజవాడలో బల్దియా పోరులో విజయం ఎవర్ని వరిస్తుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. కౌన్ బనేగా బెజవాడ మేయర్? ఈ ప్రశ్న రాజకీయ రాజధాని నలుమూలలా వినిపిస్తోంది. ఏ ఇద్దరు కలిసినా ఇవే చర్చలు నడుస్తున్నాయి. ఇంతకీ మేయర్ పీఠమెక్కే నాయకురాలు నాగమ్మ ఎవరు? ఈ ప్రశ్నలే ఇప్పుడు బెజవాడ ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్నాయి.
కృష్ణా జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలతో పాటు 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. విజయవాడ కార్పొరేషన్ లో మొత్తం 64 డివిజన్లు ఉన్నాయి. టిడిపి నుంచి మేయర్ అభ్యర్థిగా ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత బరిలో ఉన్నారు. మచిలీపట్నం కార్పొరేషన్‌లో మొత్తం 50 డిజివన్లు ఉన్నాయి. ఇందులో 1 వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవం అయింది. మిగిలిన 49 చోట్ల కౌంటింగ్ జరగనుంది.
గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల బరిలో తొలిసారి బరిలో నిలిచింది అధికార వైసిపి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడమే ఇందుకు కారణం. తొలి సారి పోటీతోనే మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది వైసిపి. మరోవైపు ఇక్కడ సత్తా చాటాలని భావిస్తోంది టీడీపీ. అటు జనసేన -బీజేపీ కూటమి కూడా తామే కీలకం అంటూ లెక్కలేసుకుంటున్నాయి.
ఏపీ వ్యాప్తంగా విశాఖ గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.. అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన-బీజేపీ కూటమి.. మూడు మేయర్ పీఠాన్ని టార్గెట్ చేశాయి. ముఖ్యంగా వైసీపీకి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. వైజాగ్ ను పరిపాలన రాజధానిగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించకపోతే ఎలా అన్న ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది? విపక్షాలు సైతం ప్రజామోదం లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విమర్శించే ప్రమాదం ఉంది. అందుకే విశాఖ మున్సిపల్ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్ లతో పాటు, 5 మున్సిపాలిటీలకు 4 చోట్లే ఎన్నికలు జరిగాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖలోని పుంగనూరు మున్సిపాలిటీలో 31వార్డులు వైసీపీకి ఏకగ్రీవం కావడంతో ఇక్కడ టీడీపీ ఎన్నికల్ని బహిష్కరించింది. చివరకు నామినేషన్లు వేసిన వాళ్లు కూడా ఉపసంహరించుకున్నారు.
ప్రకాశం జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు, 2 మున్సిపాలిటీలు, 4 నగర పందాయితీలకు కౌంటింగ్ జరగనుంది. ఒంగోలు కార్పొరేషన్ లో 50 డివిజన్లు ఉంటే 1వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవం అయింది. .
నెల్లూరు జిల్లాలో ఇవాళ 4 మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నెల్లూరు కార్పొరేషన్‌కి ఎన్నిక లేదు. అలాగే గూడురు, కావలి మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. కేవలం 4 చోట్ల మాత్రమే ఎన్నికలు జరిగాయి.
విజయనగరం జిల్లాలో ఒక కార్పొరేషన్‌తో పాటు….పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, నెల్లిమర్ల మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుంది. విజయనగరం కార్పొరేషన్‌లో 50డివిజన్లు ఉన్నాయి. ఇందులో 29వ డివిజన్ నుంచి వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి పోటీ చేశారు. పార్వతీపురం మున్సిపాలిటీలో 30వార్డులకు గాను 6వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవం అయ్యాయి.
24వార్డుల్లో ఎన్నికల ఫలితాలు నేడు వెలవడనున్నాయి. ఈ24చోట్ల టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. బొబ్బిలిలో 31వార్డుల్లో ఒకటి మాత్రం వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవం అయింది. మిగిలిన 30స్థానాల్లో ఓటింగ్ జరిగింది. సాలూరులో 29వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఏకగ్రీవాలు కాకపోవడంతో…అన్ని స్థానాల్లో పోలింగ్ జరిగింది. టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోరు నెలకొంది. నెల్లిమర్లలో 20వార్డుల్లో ఓటింగ్ జరిగింది. ఇక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్యే కీ ఫైట్ నెలకొంది.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగింది. మొత్తం 64 స్థానాలకు గానూ 33 వైసీపీ 33 డివిజన్లలో ఘన విజయం సాధించింది. టీడీపీ 9 డివిజన్లతో సరిపెట్టుకుంది.
మచిలీపట్నం కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 49 డివిజన్లకు గానూ ఇప్పటివరకు 25 డివిజన్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో వైసీపీ 20 డివిజన్లు గెలుచుకోగా, టీడీపీ 4 డివిజన్లలో విజయం సాధించింది. జనసేన ఒక డివిజన్‌కే పరిమితమైంది.
ఉయ్యూరు (20): వైఎస్‌ఆర్‌సీపీ -16, టీడీపీ -4
నందిగామ (20): వైఎస్‌ఆర్‌సీపీ -13, టీడీపీ -6, జనసేన -1
నూజివీడు (23): వైఎస్‌ఆర్‌సీపీ -21, టీడీపీ -1, బీజేపీ -1
తిరువూరు (20): వైఎస్‌ఆర్‌సీపీ -11, టీడీపీ -9,
విశాఖ కార్పొరేషన్ వైఎస్ఆర్‌సీపీ కైవసం
విశాఖ కార్పొరేషన్ (98): వైఎస్ఆర్సీపీ -58, టీడీపీ -30, జనసేన -3, బీజేపీ -1, సీపీఐ -1, సీపీఐ(M) -1, ఇతరులు -4
యలమంచిలి (25):వైఎస్‌ఆర్‌సీపీ -23, టీడీపీ -1, ఇతరులు -1
నర్సీపట్నం (28):వైఎస్‌ఆర్‌సీపీ -14, టీడీపీ -12, ఇతరులు -2
నాయుడుపేట (25): వైఎస్‌ఆర్‌సీపీ 23, టీడీపీ-1, బీజేపీ-1
సూళ్లూరుపేట (25): వైఎస్‌ఆర్‌సీపీ 24, టీడీపీ-1
వెంకటగిరి (25): వైఎస్ఆర్‌సీపీ 25
ఆత్మకూరు (ఎం) (23): వైఎస్ఆర్‌సీపీ19, టీడీపీ-2, ఇతరులు 2
కర్నూలు కార్పొరేషన్ (52): వైఎస్ఆర్సీపీ-44, టీడీపీ-6, ఇతరులు -2
గూడూరు (20): వైఎస్ఆర్‌సీపీ- 12, టీడీపీ-3, బీజేపీ -1, ఇతరులు – 4
డోన్ (32): వైఎస్ఆర్‌సీపీ- 31, ఇతరులు – 1
ఆత్మకూరు (24): వైఎస్ఆర్‌సీపీ- 21, టీడీపీ-1, ఇతరులు – 2
ఎమ్మిగనూరు (34): వైఎస్ఆర్‌సీపీ- 31, టీడీపీ-3
ఆదోని (42): వైఎస్ఆర్‌సీపీ- 41, టీడీపీ-1
నందికొట్కూరు (29): వైఎస్ఆర్‌సీపీ- 21, టీడీపీ-1, ఇతరులు -7
ఆళ్లగడ్డ (27): వైఎస్ఆర్‌సీపీ- 22, టీడీపీ-2, బీజేపీ – 2, ఇతరులు – 1
నంద్యాల (42): వైఎస్ఆర్‌సీపీ-37, టీడీపీ-4, ఇతరులు – 1
చిత్తూరు కార్పొరేషన్ (50): వైఎస్సార్‌సీపీ -46, టీడీపీ -3, ఇతరులు -1
తిరుపతి కార్పొరేషన్ (49):వైఎస్సార్‌సీపీ -48, టీడీపీ -1
మదనపల్లె (35): వైఎస్సార్‌సీపీ -33, టీడీపీ -2
పుంగనూరు (31): వైఎస్సార్‌సీపీ -31, టీడీపీ -0
పలమనేరు (26): వైఎస్సార్‌సీపీ -24, టీడీపీ -2
నగరి (29):వైఎస్సార్‌సీపీ -24, టీడీపీ -4, ఇతరులు -1
పుత్తూరు (27): వైఎస్సార్‌సీపీ -22, టీడీపీ -5
కడప కార్పొరేషన్ (50): వైఎస్సార్‌సీపీ -48, టీడీపీ -1, ఇతరులు -1
ప్రొద్దుటూరు (41): వైఎస్సార్‌సీపీ -40, టీడీపీ -1
పులివెందుల (33): వైఎస్సార్‌సీపీ -33, టీడీపీ-0
జమ్మలమడుగు (20): వైఎస్సార్‌సీపీ -18, బీజేపీ -2
బద్వేల్ (35): వైఎస్సార్‌సీపీ -28, టీడీపీ -3, ఇతరులు -4
రాయచోటి (34): వైఎస్సార్‌సీపీ -34, టీడీపీ -0
ఎర్రగుంట్ల (20): వైఎస్సార్‌సీపీ -20, టీడీపీ -0
ఇచ్ఛాపురం (23): వైఎస్‌ఆర్‌సీపీ -15, టీడీపీ -6, ఇతరులు-2
పలాస (31): వైఎస్‌ఆర్‌సీపీ -23, టీడీపీ -8
పాలకొండ (20): వైఎస్‌ఆర్‌సీపీ -17, టీడీపీ -3
బొబ్బిలి (31): వైఎస్ఆర్‌సీపీ -19, టీడీపీ -11, ఇతరులు -1
పార్వతీపురం (30): వైఎస్ఆర్‌సీపీ -22, టీడీపీ-5, ఇతరులు -3
సాలూరు (29): వైఎస్ఆర్‌సీపీ-20, టీడీపీ-5, ఇతరులు -4
నెల్లిమర్ల (20): వైఎస్ఆర్‌సీపీ -11, టీడీపీ-7, ఇతరులు -2
ఒంగోలు కార్పొరేషన్ (50): వైఎఎస్సార్‌సీపీ-41, టీడీపీ-6, జనసేన -1, ఇతరులు -2.
గిద్దలూరు (20): వైఎఎస్సార్‌సీపీ-16, టీడీపీ-3, ఇతరులు -1
కనిగిరి (20): వైఎఎస్సార్‌సీపీ-20, టీడీపీ-0
చీమకుర్తి (20):వైఎఎస్సార్‌సీపీ-18, టీడీపీ-2
మార్కాపురం (35): వైఎఎస్సార్‌సీపీ-30, టీడీపీ-5
అద్దంకి (19): వైఎస్సార్‌సీపీ-13, టీడీపీ-6
చీరాల (33): వైఎస్సార్‌సీపీ-19, టీడీపీ-1, ఇతరులు 13
పెద్దాపురం (29): వైఎస్సార్‌సీపీ -21, టీడీపీ -2, జనసేన -1
అమలాపురం (30): వైఎస్సార్‌సీపీ-19, టీడీపీ-4, జనసేన -6, ఇతరులు -1
గొల్లప్రోలు (20): వైఎస్ఆర్‌సీపీ -18, టీడీపీ – 2
ముమ్మిడివరం (20): వైఎస్ఆర్‌సీపీ – 14, టీడీపీ-6
ఏలేశ్వరం (20):వైఎస్సార్‌సీపీ -16, టీడీపీ -4
మండపేట (30): వైఎస్సార్‌సీపీ -22, టీడీపీ -7, ఇతరులు -1
గుంటూరు (57): ఎస్ఆర్‌సీపీ-45, టీడీపీ-8, బీజేపీ+ 4, ఇతరులు 2
తెనాలి (40): వైఎస్ఆర్‌సీపీ-32, టీడీపీ-8
చిలకలూరిపేట (38): వైఎస్ఆర్‌సీపీ-30, టీడీపీ-8
రేపల్లె (28): వైఎస్ఆర్‌సీపీ-26, టీడీపీ-2
సత్తెనపల్లి (31): వైఎస్ఆర్‌సీపీ-24, టీడీపీ-4, బీజేపీ-1, ఇతరులు -2
వినుకొండ (32): వైఎస్ఆర్‌సీపీ-28, టీడీపీ-4
మాచర్ల (31): వైఎస్ఆర్‌సీపీ-31, టీడీపీ-0
పిడుగురాళ్ల (33): వైఎస్ఆర్‌సీపీ -33, టీడీపీ-0
అనంతపురం కార్పొరేషన్ (50): వైఎస్‌ఆర్‌సీపీ -48, ఇతరులు -2
రాయదుర్గం (32): వైఎస్‌ఆర్‌సీపీ -30, టీడీపీ -2
మడకశిర (20): వైఎస్‌ఆర్‌సీపీ -15, టీడీపీ -5
కల్యాణదుర్గం (24): వైఎస్‌ఆర్‌సీపీ -20, టీడీపీ -4
గుత్తి (25): వైఎస్‌ఆర్‌సీపీ -24, టీడీపీ-1
పుట్టపర్తి (20): వైఎస్‌ఆర్‌సీపీ -14, టీడీపీ -6
ధర్మవరం (40): వైఎస్‌ఆర్‌సీపీ -40, టీడీపీ -0
హిందూపురం (38): వైఎస్‌ఆర్‌సీపీ -29, టీడీపీ -6, బీజేపీ -1, ఎంఐఎం -1, ఇతరులు -1
కదిరి (36): వైఎస్‌ఆర్‌సీపీ -30, టీడీపీ -5, ఇతరులు -1
గుంతకల్లు (37): వైఎస్‌ఆర్‌సీపీ -28, టీడీపీ -7, సీపీఐ -1, ఇతరులు -1
తాడిపత్రి: వైఎస్‌ఆర్‌సీపీ -16, టీడీపీ 18, సీపీఐ 1, ఇతరులు 1
విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌ను వైసీపీ కైవసం చేసుకుంది. విశాఖలో మొత్తం 98 డివిజన్లకు గానూ వైసీపీ 58 డివిజన్లలో విజయ ఢంకా మోగించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 30 డివిజన్లలో గెలుపొందారు. ఇక, జనసేన 3 డివిజన్లలో ఖాతా తెరిస్తే, బీజేపీ, సీపీఎం, సీపీఐ ఒక్కొక్క డివిజన్‌లో విజయం సాధించాయి. ఇక ఇతరులు 4 డివిజన్లలో గెలుపొందారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీని కూడా వైసీపీ దక్కించుకుంది. మొత్తం 41 వార్డుల ఫలితాలను వెల్లడించారు. ఇందులో వైసీపీ 40 వార్డుల్లో గెలిచి ఘన విజయం నమోదు చేసింది. తెలుగు దేశం పార్టీ ఒక వార్డుతోనే సరిపెట్టుకుంది.
కడప మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 50 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. ఏకపక్షంగా వచ్చిన ఫలితాల్లో వైసీపీ 48 డివిజన్లలో గెలుపొందింది. టీడీపీ మాత్రం ఒక్కస్థానానికే పరిమితమైంది. ఇతరులు ఒక డివిజన్‌లో విజయం సాధించారు.
గుంటూరు కార్పొరేషషన్‌లో వైసీపీ విజయ ఢంకా మోగించింది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో మొత్తం 57 డివిజన్లకు గానూ వైసీపీ 44 డివజన్లలో ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ 9 డివిజన్లకే పరిమితమైంది. కాగా, జనసేన 2, స్వతంత్రులు 2 డివిజన్లలో విజయం సాధించారు.
విజయనగరం జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ హవా కొనసాగింది. బొబ్బిలి మున్సిపాలిటీలో నువ్వా, నేనా అన్నట్లు సాగిన ఉత్కంఠలో చివరికి వైసీపీ విజయం సాధించింది. మొత్తం 31 వార్డులకు గానూ వైసీపీ 18, టీడీపీ 11 వార్డుల్లో గెలుపొందింది. ఇతరులు ఒ స్థానంలో విజయం సాధించారు.
వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ వైసీపీ జోరు కొనసాగింది. మొత్తం 98 డివిజన్లకు గానూ ఇప్పటికే 55 స్థానాల్లో వైసీపీ అధిక్యంలో ఉంది. తెలుగుదేశం పార్టీ 29, జనసేన 4 డివిజన్లలో అధిక్యంలో కొనసాగుతుంది. బీజేపీ 1, సీపీఎం 1, సీపీఐ 1, ఇతరులు 3 డివిజన్లలో గెలుపొందారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా వైసీపీ హవా కొనసాగుతోంది. మొత్తం 64 డివిజన్లలో వైసీపీ 18, టీడీపీ ఐదు చోట్ల గెలిచింది.
ప్రకాశం జిల్లా కనిగిరిలో వైసీపీ విజయం సాధించింది. మొత్తం 20 వార్డుల్లో 18 చోట్ల వైసీపీ గెలుపొందగా, టీడీపీ 2 చోట్ల విజయం సాధించింది.
విశాఖ కార్పొరేషన్‌లోనూ వైసీపీ ఆధిక్యం కొనసాగుతుంది. ఇప్పటి వరకు 80 డివిజన్ల కౌటింగ్ కొనసాగుతుంది. వైకాపా 55, టీడీపీ 17, జనసేన 2, బీజేపీ 2, స్వతంత్రులు 2, సీపీఎం 1, సీపీఐ 1 డివిజన్లలో అధిక్యంలో కొనసాగుతున్నారు.
విజయనగరం కార్పొరేషన్‌లో వైసీపీ ముందంజలో ఉంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో వైసీపీ 25, టీడీపీ ఒకచోట మాత్రమే గెలుపొందింది.
మచిలీపట్నం కార్పొరేషన్ ఫలితాల్లోనూ వైసీపీ సత్తా చాటింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో వైసీపీ 14, టీడీపీ 2, జనసేన ఒకచోట విజయం సాధించాయి.
రాష్ట్రంలో మున్సిపల్ ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. బెదిరింపులతోనే వైసీపీ ఎక్కువ స్థానాల్లో గెలిచిందని ఆరోపించారు. పవన్ ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించారని ఆయన మండిపడ్డారు. రేషన్‌కార్డులు, పింఛన్లు, విద్యా పథకాలు ఆపేస్తామని బెదిరించి ఓట్లు వేయించుకున్నారని ఆయన విరుచుకుపడ్డారు.
ఉయ్యూరు నగర పంచాయతీ వైసీపీ కైవసం చేసుకుంది. ఉయ్యూరులో మొత్తం 20 వార్డులకు గానూ వైసీపీ 16 వార్డుల్లో విజయం సాధించింది. టీడీపీ 4 వార్డులతో సరిపెట్టుకుంది.
తూర్పు గోదావరి జిల్లాలో మండపేట, పిఠాపురం, ముమ్మడివరం మున్సిపాల్టీలకు సంబంధించి ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా, నేనా అన్నట్లుగా పోరు కొనసాగుతోంది. మండపేట మున్సిపాల్టీలో 10 వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. అందులో 6 టీడీపీ కైవసం చేసుకోగా 4 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు.
నరసాపురం మున్సిపాలిటీలో వైసీపీ పాగా వేసింది. మొత్తం 31 వార్డులకు గానూ వైసీపీ 24, జనసేన 4, తెలుగుదేశం పార్టీ 1, స్వతంత్రులు 2 వార్డుల్లో విజయం సాధించారు.
మైదుకూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ ఒక్క స్థానంతో ముందంజలో ఉంది. వైసీపీ కంటే ఒక వార్డు ఎక్కువ గెలుచుకున్న టీడీపీ పైచేయి గా నిలిచింది. టీడీపీ అభ్యర్థులు 12 వార్డుల్లో విజయం సాధిస్తే, వైసీపీకి చెందిన అభ్యర్థులు 11 వార్డుల్లో గెలుపొందారు. కాగా ఒకవార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. 28 వార్డుల ఫలితాలకు గాను 16 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. 12 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. వైఎస్సార్‌సీపీ మొత్తం వార్డులను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 40 వార్డుల్లో పది వార్డులు ఏకగ్రీవం కాగా, 30 వార్డుల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపొందారు.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత విజయం సాధించారు. 24 ఏళ్ల శ్వేత 11వ డిజిన్ నుంచి తమ సమీప వైసీపీ అభ్యర్థిపై గెలుపొందారు.
విశాఖ కార్పొరేషన్‌లోనూ వైఎస్పార్‌సీపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెలువడిన 23 డివిజన్ల ఫలితాలకు గానూ వైసీపీ 11, టీడీపీ 9, జనసేన 1, స్వతంత్రులు 1, సీపీఎం 1 డివిజన్లను గెలుచుకున్నారు.
కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం పార్టీ అధిక్యంలో కొనసాగుతుంది. ఇప్పటివరకు 19 వార్డులకు సంబంధించి ఫలితాలు వెలువడగా, 10 వార్డుల్లో టీడీపీ, 8 వార్డుల్లో వైసీపీ, ఒక వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు.
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో వైజాగ్ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ ప్రభావం కనిపించినట్లుంది. ఉద్యమంలో ముందుండి నడిపిన పార్టీకి ఓటర్లు అవకాశమిచ్చారు. స్టీల్ ఫ్లాంట్ ఏరియాలోని 78వ వార్డులో సీపీఎం అభ్యర్థి గంగారావు విజయం సాధించారు.
హిందూపురం మున్సిపాలిటీ అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. ఎంఐఎం పార్టీకి చెందిన అభ్యర్తి ఒకచోట విజయం సాధించాుు. కాగా, హిందూపురంలో మొత్తం 38 వార్డులకు గానూ ఇప్పటివరకు అందిన ఫలితాల ప్రకారం వైసీపీ 7, టీడీపీ 3, ఎంఐఎం ఒక్క వార్డులో విజయం సాధించాయి.
కృష్ణా జిల్లా నందిగామ నగర పంచాయతీ తొలి రౌండ్ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవేసింది. 20 వార్డులకు గాను తొలి రౌండ్‌లో ఆరు వార్డును కైవసం చేసుకుంది.
కృష్ణా జిల్లా మచిలీపట్నం కార్పొరేషన్‌లో 17 డివిజన్లకు తొలి రౌండ్ కౌంటింగ్ కొనసాగుతుంది. ఇక, ఇప్పటివరకు 15 డివిజన్లలో వైసీపీ ముందంజలో ఉంది.
పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఫ్యాన్ గాలి బలంగా వీచింది. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ మరోసారి హవా కొనసాగించింది. జిల్లాలో కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, నరసాపురం మున్సిపాలిటీలు వైసీపీ కైవసం చేసుకుంది.
నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. వెంకటగిరి మున్సిపాలిటీని కూడా వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 25 వార్డుల్లో 25 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపు సాధించారు.
తాడిపత్రి మున్సిపల్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 34 వార్డులకు పోలింగ్ జరగ్గ ఇవాళ కౌటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతంది. ఇక, ఇప్పటివరకు 15 చోట్ల ఫలితాలు వెల్లడి అయ్యాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన 8 మంది గెలుపొందగా, వైసీపీ 6 వార్డుల్లో విజయం సాధించింది. ఇక, ఇతరులు ఒకచోట విజయం సాధించారు.
గుంటూరు జిల్లాలోనూ ఫ్యాన్ హవా కొనసాగుతుంది. చీరాల మున్సిపాలిటీని వైసీపీ వశం చేసుకుంది. చీరాలలో మొత్తం 30 వార్డులకు గానూ వైసీపీ 16, టీడీపీ 1, ఇతరులు 13 మంది గెలుపొందారు. అయితే, ఇక్కడ గెలిచిన 13 మంది స్వతంత్రుల్లో 10 మంది ఆమంచి వర్గీయులు కావడం విశేషం.
రేపల్లె మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. రేపల్లెలో మొత్తం 28 వార్డులకు వైసీపీ 25, టీడీపీ 2, ఇతరులు 1 వార్డులో గెలుపొందారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు కార్పొరేషన్‌లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 50 డివిజన్లకు పోలింగ్ జరగ్గా, 41 డివిజన్లలో వైసీపీ ఘన విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులు 6 చోట్ల, జనసేన అభ్యర్థి ఒక చోట, ఇతరులు 2 చోట్ల గెలుపొందారు.
ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ విజయ ఢంకా మోగించింది. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. దీంతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్రకార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ వేడుకల్లో వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్లమెంట్ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు.
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో వైసీపీ విజయం సాధించింది. పలాస-కాశీబుగ్గలో మొత్తం 31 వార్డుల్లో వైసీపీ 23 వార్డులు గెలుచుకోగా, టీడీపీ 8 వార్డులకు పరిమితమైంది.
ఇచ్ఛాపురం మున్సిపాలిటీని వైసీపీ సొంతం చేసుకుంది. మొత్తం 23 వార్డులకు ఎన్నికలు జరగ్గా, వైసీపీ 15 వార్డులు, టీడీపీ 6 వార్డులు, ఇతరులు 2 వార్డుల్లో విజయం సాధించారు.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 57 డివిజన్లకు గానూ వైసీపీ 19, టీడీపీ 4 చోట్ల విజయం సాధించాయి. అలాగే స్వతంత్రులు 1, జనసేన ఒకచోట గెలుపొందారు. కాగా గతంలోనే వైసీపీ 1 డివిజన్‌లో ఏకగ్రీవం అయ్యింది.
తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు నగర పంచాయతీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 12చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపొందింది.
ఆళ్లగడ్డ మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. ఆళ్లగడ్డలో మొత్తం 27 వార్డుల్లో ఎన్నికలు జరగ్గా, వైసీపీ 22, టీడీపీ 2, బీజేపీ 2, స్వతంత్రులు 1 స్థానంలో విజయం సాధించారు.
మార్కాపురం పురపాలక సంఘంలో వైసీపీ కైసవం చేసుకుంది. మార్కాపురం మొత్తం 30 వార్డుల్లో ఎన్నికలు జరగ్గా, వైసీపీ 25, టీడీపీ అభ్యర్థులు 5 వార్డుల్లో విజయం సాధించారు.
తాడిపత్రి మున్సిపాలిటీలోని 24వ వార్డులో టీడీపీ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు.
రాయదుర్గం మున్సిపాలిటీలో వైసీసీ విజయం సాధించింది. రాయదుర్గంలో మొత్తం 32 వార్డులకు గానూ వైసీపీ 30, టీడీపీ 2 వార్డుల్లో గెలుపొంది.
గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 40 వార్డులకు ఎన్నికల జరగ్గా,, వైసీపీ 32 వార్డుల్లో విజయ ఢంకా మోగించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన 8 మంది విజయం సాధించారు.
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 8 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపాలిటీ వైసీపీ కైవసం చేసుకుంది. 31 వార్డులకు ఇప్పటి వరకు 16 చోట్ల వైసీపీ గెలుపొందింది.
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 9వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి చెన్నుపాటి క్రాంతి శ్రీ, 45వ డివిజన్లో టీడీపీకి చెందిన మైలవరపు లావణ్య విజయం సాధించారు.
పలమనేరు మున్సిపాలిటీలోనూ వైసీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 26 వార్డులకు గానూ వైసీపీ 24 వార్డుల్లో గెలుపొంది.. ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. తెదేపా 2 వార్డులకే పరిమితమైంది.
వినుకొండ మున్సిపాలిటీ వైసీపీ ఘన విజయం సాధించింది. వినుకొండలో మొత్తం 32 వార్డుల్లో వైసీపీ 28, టీడీపీ 4 వార్డుల్లో గెలుపొందాయి.
కడప జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీని వైసీపీ సొంతం చేసుకుంది. ఎర్రగుంట్లలో మొత్తం 20 వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.
చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 26 వార్డుల్లో వైసీపీ 24 గెలుపొందగా, తెలుగుదేశం పార్టీ 2 వార్డుల్లో విజయం సాధించింది.
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ కొనసాగుతున్న వైసీపీ హవా. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 14 వార్డుల్లో వైసీపీ, టీడీపీ 9, ఇతరులు ఒకచోట విజయం సాధించారు.
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ 34 డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.
చిత్తూరు జిల్లా మదనపల్లె మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. 35 వార్డులకు గాను ఇప్పటివరకు 19 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపొందింది.
నెల్లూరు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, వెంకటగిరిలో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు.
కర్నూలు జిల్లా గూడూరు నగర పంచాయతీని వైసీపీ కైవసం చేసుకుంది. గూడూరులో మొత్తం 20 వార్డులకు గానూ వైసీపీ 12 వార్డులను దక్కించుకుంది. ఇక టీడీపీ 3, బీజేపీ 1, ఇతరులు 4 వార్డుల్లో గెలుపొందారు.
మడకశిర నగర పంచాయతీలోనూ వైసీపీ హవా కొనసాగింది. మడకశిరలో మొత్తం 20 వార్డుల్లో వైసీపీ 15 వార్డుల్లో గెలిస్తే, తెలుగుదేశం పార్టీ 5 వార్డుల్లో విజయం సాధించింది.
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. ఎమ్మిగనూరులో మొత్తం 34 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు 31 మంది గెలుపొందారు. ఇక మిగిలిన మూడు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది.
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీలో ఇప్పటివరకు 10 వార్డుల్లో వైసీపీ విజయం. 1, 8, 10, 11, 12, 13, 14, 16, 17, 25 వార్డుల్లో ఫ్యాన్ హవా కొనసాగింది.
తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపాలిటీలో వైసీపీ విజయ ఢంకా మోగించింది. మొత్తం 30 వార్డులకు గాను ఇప్పటివరకు 18 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు.
అనంతపురం కదిరి మున్సిపాలిటీలో గందరగోళం ఏర్పడింది. 29వ వార్డులో వైసీపీకి చెందిన అభ్యర్థి గెలిచినట్లు అధికారుల ప్రకటించారు. 5 ఓట్ల తేడాతో గెలుపు ప్రకటించడాన్ని టీడీపీ అభ్యర్థి వ్యతిరేకించారు. దీంతో కదిరిలో మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టారు ఎన్నికల అధికారులు.
కర్నూలు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీని వైసీపీ హస్తగతం చేసుకుంది. మొత్తం 24 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు 21 వార్డులను సొంతం చేసుకున్నారు. టీడీపీ 1 స్థానంతోనే సరిపెట్టుకుంది. కాగా ఇతరులు రెండు వార్డుల్లో విజయం సాధించారు.
హిందూపురం మున్సిపాలిటీలోని ఏడో వార్డులో ఓట్ల లెక్కింపును అధికారులు నిలిపివేశారు. పోలైన ఓట్ల కంటే 9 ఓట్లు అధికంగా రావడంతో అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మున్సిపాలిటీలో వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి మహాలక్ష్మి ఓటమిపాలయ్యారు.
ఒంగోలు మున్నిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధించారు. ఒంగోలు కార్పొరేషన్‌లో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో వైసీపీ 8 డివిజన్లు, టీడీపీ 3 డివిజన్లలో విజయం సాధించాయి.
కర్నూలు జిల్లాలోనూ కొనసాగుతున్న వైఎస్సార్‌సీపీ హవా.. డోన్ మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. డోన్‌లో మొత్తం 32 వార్డుల్లో 31 వార్డుల్లో వైసీపీ, ఇక్క స్థానంలో సీపీఐ విజయం సాధించింది.
ప్రకాశం జిల్లా చీమకుర్తి నగర పంచాయతీని వైసీపీ సొంతం చేసుకుంది. చీమకుర్తిలో మొత్తం 20 వార్డుల్లో 18 వైసీపీ అభ్యర్థులు విజయం సాధించగా, ఇద్దరు టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీని అధికార పార్టీ వైసీపీ కైవసం చేసుకుంది. కొవ్వూరు మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డుల్లో 15 వైసీపీ అభ్యర్థులు గెలుపొందగా, టీడీపీ 7, బీజేపీ 1 స్థానంలో విజయం సాధించింది.
తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరంలో 9, 13, 17 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థు ఘన విజయం సాధించారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో 23వార్డులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు.
నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల్లో 2 వార్డుల్లో వైసీపీ విజయం సాధించింది. మొత్తంగా.. 25 వార్డులు ఉన్న నాయుడుపేట పురపాలక సంఘంలో.. ఇప్పటికే 23 ఏకగ్రీవం అయ్యాయి. వైసీపీ 21, టీడీపీ 1, బీజేపీ 1 స్థానం సొంతం చేసుకున్నాయి. ఓట్ల లెక్కింపు అనంతరం.. వైసీపీ మొత్తంగా 23 స్థానాలను దక్కించుకుని.. మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ వైసీపీ కైవసం చేసుకుంది. గిద్దలూరు పురపాలక సంఘంలో మొత్తం 20 వార్డులకు గానూ ఇప్పటికే 7 వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 13 వార్డులకు ఇవాళ ఓట్ల లెక్కింపు చేపట్టారు. వైసీపీ 5 వార్డుల్లో గెలుపొందింది. 2, 3, 7 వార్డుల్లో మాత్రం టీడీపీ గెలుపొందగా, 17వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో 27, 11, 12వ వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. 33వ వార్డులో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధించారు.
ప్రకాశం: అద్దంకిలో 19, 20 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీలో 5, 6, 7 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని 13జిల్లాల్లో జరిగిన పురపోరులో 11 కార్పొరేషన్లు…71మున్సిపాలిటీలకు 10న ఎన్నికలు జరిగాయి. అయితే ఇందులో పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు కార్పొరేషన్‌తో పాటు గుంటూరు జిల్లా చిలకలూరిపేట మున్సిపాలిటీ ఫలితాలను మాత్రం హైకోర్టు ప్రకటించవద్దని ఆదేశించింది.
కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నికల కౌటింగ్ సెయింట్ జోసఫ్ స్కూల్ లో ప్రారంభమైంది. 24 వార్డులకు సంబంధించి రౌండ్ల వారిగా ఓట్ల లెక్కింపు చేపట్టారు. కౌటింగ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌటింగ్ కు రెండు పార్టీ అభ్యర్ధులు సిద్దమయ్యారు.
విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. విజయవాడలోని లయోలా కాలేజి లో రెండు హాల్స్ లో లెక్కింపు మొదలైంది. ఒక హాల్ లో 15 వార్డులకు… మరోక హాల్‌లో 8 వార్డులకు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. ముందుగా పోస్టల్ ఓట్లు లెక్కింపు చేపట్టిన అనంతరం.. ఇందుకోసం 806 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు.
విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందారు. మరికాసేపట్లో ఎన్నికల కౌటింగ్ మొదలు కానుండగా, 11వ వార్డు జనసేన అభ్యర్థి బోను భారతి(55) గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఎలమంచిలి మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్సుల్లో బ్యాలెట్ పత్రాలతో పాటు ఓటర్లు మరో పత్రం వేశారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని రాసిన పత్రాలను వేసినట్లు ఎన్నికల కౌటింగ్ అధికారులు గుర్తించారు.
కనిగిరి మున్సిపాలిటీలో అధిక వార్డుల్లో గెలిపొందిన వైసీపీ చైర్మన్ పీఠాన్ని సొంతం చేసుకుంది. దీంతో వైసీపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు.
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో 29 వార్డులున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.కొవ్వూరులో మొత్తం 23వార్డులు ఉన్నాయి. ఇందులో టీడీపీ, వైసీపీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవడంతో 9వైసీపీ ఏకగ్రీవం అయితే..టీడీవీ4 ఏకగ్రీవం చేసుకున్నాయి. మిగిలిన 10 స్థానాల్లో మాత్రమే ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. 2014లో కొవ్వూరు మున్సిపాలిటీలో టీడీపీ 22, ఒకటి ఇండిపెండెంట్ గెలుసుకున్నాయి.
నర్సాపురం మున్సిపాలిటీలో 31వార్డులు ఉన్నాయి. ఇందులో 3వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఇక్కడ టీడీపీ- జనసేన అనాధికారికంగా కలిసి పోటీ చేయడంతో చెరో కొన్ని స్థానాలు గెలిచే అవకాశముంది. నిడదవోలు మున్సిపాలిటీలో 28వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. కాసేపట్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. 2014లో కొవ్వూరు, నిడదవోలు, నరసాపురం, జంగారెడ్డిగూడెంలో టీడీపీనే విజయం సాధించింది.
పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు 4 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి.. ఏలూరు కార్పొరేషన్ మినహా మున్సిపాలిటీల ఫలితాలు వెలువడనున్నాయి.
రూరల్‌లో ఉన్న 7గ్రామాల్ని కార్పొరేషన్‌లో విలీన అంశం కోర్టు పరిధిలో ఉండటంతో ఫలితాలు వెల్లడించవద్దని న్యాయస్థానం ఆదేశించింది.
హిందూపురంలో 38 వార్డులు..ఇక్కడ మాత్రమే ఏకగ్రీవాలు కాలేదు. అటు ధర్మవరం మొత్తం 40 వార్డులు ఉంటే 10వార్డులు వైసిపికి అనుకూలంగా ఏకగ్రీవం అయ్యాయి. మడకశిర మున్సిపాలిటీలోనూ 20 వార్డుల్లో పోలింగ్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగిస్తున్నామన్నారు. గుంతకల్లు మొత్తం 32 వార్డుల్లో వైసీపీకి అనుకూలంగా 3 ఏకగ్రీవం అయ్యాయి. టోటల్‌గా అనంతపురం జిల్లాలో హీరో బాలకృష్ణ హిందుపూరంలో ఏకగ్రీవాలు కాకపోవడానికి కారణమనే చెప్పాలి. ఇక తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు. పెద్దారెడ్డి కొడుకు హర్ష వర్ధన్ రెడ్డి ఇప్పటికే ఏకగ్రీవం చేసుకున్నారు. చూడాలి జిల్లాలో ఏ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయో… అయితే కౌంటింగ్ మొదలైంది.
కళ్యాణదుర్గంలో మొత్తం 24వార్డులు ఉంటే ఒక్క వార్డు ఏకగ్రీవం కాకపోవడంతో అన్ని స్థానాల్లో పోలింగ్ నిర్వహించారు. పుట్టపర్తి మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. అన్ని చోట్ల పోలింగ్ జరిగింది. కదిరిలో 36 వార్డులకు ఏ ఒక్కటి యునానిమస్ కాలేదు. దీంతో అన్ని చోట్ల పోలింగ్ నిర్వహించారు. లెక్కింపు మొదలైంది..
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉంటే 2వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 34 చోట్ల ఎన్నికలు జరిగాయి. రాయదుర్గంలోనూ 32 వార్డులు ఉన్నాయి. అన్ని చోట్ల పోలింగ్ జరిగింది.
అనంతపురం జిల్లాలో ఒక కార్పొరేషన్‌తో పాటు, 10 మున్సిపాల్టిలకు ఎన్నికలు జరిగాయి. వాటికి ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. అనంతపురం కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. అన్ని డివిజన్లలో పోలింగ్ నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుంది.
విజయనగరం జిల్లాలో ఒక కార్పొరేషన్‌తో పాటు….పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, నెల్లిమర్ల మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరగనుంది. విజయనగరం కార్పొరేషన్‌లో 50డివిజన్లు ఉన్నాయి. ఇందులో 29వ డివిజన్ నుంచి వైసీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె శ్రావణి పోటీ చేశారు. పార్వతీపురం మున్సిపాలిటీలో 30వార్డులకు గాను 6వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవం అయ్యాయి.
24వార్డుల్లో ఎన్నికల ఫలితాలు నేడు వెలవడనున్నాయి. ఈ24చోట్ల టీడీపీ, వైసీపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. బొబ్బిలిలో 31వార్డుల్లో ఒకటి మాత్రం వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవం అయింది. మిగిలిన 30స్థానాల్లో ఓటింగ్ జరిగింది. సాలూరులో 29వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఏకగ్రీవాలు కాకపోవడంతో…అన్ని స్థానాల్లో పోలింగ్ జరిగింది. టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోరు నెలకొంది. నెల్లిమర్లలో 20వార్డుల్లో ఓటింగ్ జరిగింది. ఇక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్యే కీ ఫైట్ నెలకొంది.
విశాఖ మున్సిపాలిటీల పరంగా చూస్తే నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు భార్య, కొడుకు ఇద్దరూ ఎన్నికల బరిలోకి దిగారు. ఈ ఎన్నికల ఫలితాలు అయ్యన్నపాత్రుడికి కీలకంగా మారాయి. 2007లోనే ఎన్నిక జరిగింది. అప్పుడు కాంగ్రెస్ హవా నడిచింది. ఆ తర్వాత ఇక్కడ ఎన్నికలు జరగకపోవడంతో ఈసారి ఫలితాలు వైసీపీ, టీడీపీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటనతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోరుగా ప్రచారం చేస్తే….విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చంద్రబాబు, లోకేష్ సుడిగాలి ప్రచారం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో 4టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికి…వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరారు. ఎన్నికల ముందు వరకు తటస్థంగా ఉన్న గంటా శ్రీనివాస్‌రావు చివరి నిమిషంలో టీడీపీకే అనుకూలంగా వ్యవహరించారు. విశాఖ ఓటర్లు ఎవర్ని గెలిపిస్తారో ఇవాళ్టి ఫలితాల్లో తేలిపోతుంది.