AP MPTC And ZPTC Elections 2021 Highlights: ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే ఛాన్స్..

| Edited By: Anil kumar poka

Nov 16, 2021 | 7:03 PM

AP MPTC ZPTC Polls: వివిధ కారణాలతో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది.

AP MPTC And ZPTC Elections 2021 Highlights: ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే ఛాన్స్..
Elections

AP MPTC ZPTC Elections Highlights: వివిధ కారణాలతో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 10 జెడ్పీటీసీ స్థానాలకు, 123 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరుగుతునున్నాయి. కోర్టు కేసులతో సహా వివిధ కారణాలతో నిలిచిపోయిన, ఆయా స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవికాకుండా గతంలో ఓట్ల లెక్కింపు సమయంలో తడిసిన ఓట్ల కారణంగా లెక్కింపు ఆగిపోయిన వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు జెడ్పీటీసీ స్థానంలో రెండు బూత్‌లతోపాటు మరో ఆరు ఎంపీటీసీ స్థానాల్లోనూ పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నిలక సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 14 జెడ్పీటీసీ స్థానాలు, 176 ఎంపీటీసీ స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీచేసింది ఎస్ఈసీ.

వీటిలో నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 50 ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. మూడు ఎంపీటీసీ స్థానాల్లో ఎవరూ నామినేషన్ల దాఖలు చేయకపోవడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలినచోట్ల 954 పోలింగ్‌ కేంద్రాల్లో మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. జెడ్పీటీసీ స్థానాల్లో 40 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 8,07,640 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఓట్లను ఈనెల 18న లెక్కిస్తారు.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Nov 2021 06:25 PM (IST)

    ఏపీలో పలు చోట్ల జరిగిన లోకల్‌ బాడీ ఎన్నికలు ప్రశాంతం..

    ఏపీలో పలు చోట్ల జరిగిన లోకల్‌ బాడీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్‌ సజావుగా సాగింది. గతంలో జరుగని MPTC, ZPTC స్థానాలకు అధికారులు ఎన్నికలు నిర్వహించారు.

  • 16 Nov 2021 06:01 PM (IST)

    కుప్పం నగర పంచాయతీ కౌంటింగ్‌ రేపు..

    ఏపీలో పొలిటికల్‌ టెన్షన్‌ను క్రియేట్‌ చేసిన కుప్పం నగర పంచాయతీ కౌంటింగ్‌ రేపు జరగబోతోంది. అక్కడ గెలుపు ఎవరదనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం 25 వార్డుల్లో ఒకటి ఏకగ్రీవమైంది.

  • 16 Nov 2021 05:08 PM (IST)

    ఏపీలో ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్..

    ఏపీలో ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్.. క్యూలైన్లో ఉన్నవారికి ఓటేసే ఛాన్స్ ఇచ్చారు ఎన్నికల అధికారులు. 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 14 జడ్పీటీసీ స్థానాలకుగాను నాలుగు ఏకగ్రీవం అయ్యాయి. 176 ఎంపీటీసీ స్థానలకు గాను 50 ఏకగ్రీవం.

  • 16 Nov 2021 05:00 PM (IST)

    చంద్రబాబుపై మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో ఫైర్..

    ఇదే సమయంలో చంద్రబాబుపై మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కుప్పంలో మార్పు మొదలైందని, అందుకే చంద్రబాబు కట్టు కథలు అల్లుతున్నారని విమర్శించారు. దొంగ ఓట్లు వేశారని పిచ్చి ప్రచారం చేస్తున్నారని తోసిపుచ్చారు. పోలింగ్ కేంద్రాల్లో విపక్ష పార్టీల ఏజెంట్లు ఉండగా.. దొంగ ఓట్లు ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు. కుప్పంలో వైసపీ క్లీన్ స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పారు మంత్రి కన్నబాబు. అది గమనించిన చంద్రబాబు.. ఇప్పటి నుంచే కారణాలు వెతుక్కుంటున్నారని అన్నారు.

  • 16 Nov 2021 04:35 PM (IST)

    విశాఖ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్.. ఇప్పటివరకు 51 శాతం..

    విశాఖ జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఆనందపురం మండలం వెల్లంకి, వేములవలస జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ మల్లికార్జున పరిశీలించారు. జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఇప్పటివరకు 51 శాతం పోలింగ్ నమోదైంది.

  • 16 Nov 2021 12:52 PM (IST)

    పోలీసుల కాళ్లు మొక్కిన సీపీఎం కార్యకర్తలు

    కర్నూలు జిల్లా ఆదోని మండలం, హనవాలు గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికల్లో ఘర్షణ చోటుచేసుకుంది. అధికార పార్టీకి పోలీసులు మద్దతు పలుకుతున్నారంటూ సీపీఎం నాయకులు ఆందోళనకు దిగారు. పోలింగ్ కేంద్రంలోకి గుంపులుగా వెళ్తున్న వైసీపీ నేతలను ఆడ్డుకోవడంలేదని మండిపడ్డారు. వైసీపీ నాయకులను ఇక్కడి నుంచి పంపించివేయాలంటూ పోలీసుల కాళ్లు మొక్కారు.

    Cpm

  • 16 Nov 2021 11:29 AM (IST)

    పోలింగ్ కేంద్రంలో వైసీసీ అభ్యర్థి హల్‌చల్

    ప్రకాశం జిల్లా పీసీ పల్లి మండలం మురుగుమ్మి ఎంపీటీసీ ఎన్నికలు రెండు పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్నాయి. మురుగుమ్మి, మారేళ్ళలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా, మరేళ్ల పోలింగ్ కేంద్రంలో అధికార పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి హల్ చల్ చేశారు. దీంతో ఇతర పార్టీల ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వైసీపీ అభ్యర్థిని పోలింగ్ కేంద్రం నుంచి బయటకు పంపడంతో గొడవ సర్ధుమణిగింది.

  • 16 Nov 2021 09:58 AM (IST)

    నంద్యాలలో భారీ బందోబస్తు మధ్య పోలింగ్

    కర్నూలు జిల్లాలోని నంద్యాల మండలంలో జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మోత్తం 17 గ్రామాలు ఉన్న జెడ్పీటీసీ పరిధిలో 47 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 43,843 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఎర్పాటు చేశారు.

  • 16 Nov 2021 09:55 AM (IST)

    వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియ పరిశీలన

    తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఖాళీగా వున్న 23 ఎంపీటీసీ స్థానాలకు రెండు ఏకగ్రీవం కాగా మిగిలిన 21 చోట్ల జరుగుతున్న ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 59,156 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 69 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 275 మంది సిబ్బంది విధులకు హాజరవుతున్నారు. జిల్లాలో 33 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు గర్తించిన అధికారులు, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో మధ్నాహ్నం రెండు గంటల వరకు, మిగిలిన చోట్ల సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఎన్నికలను ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

  • 16 Nov 2021 09:50 AM (IST)

    చిత్తూరు జిల్లాలో పరిషత్ పోలింగ్ ప్రశాంతం

    చిత్తూరు జిల్లాలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొసాగుతోంది. బంగారుపాలెం జెడ్పీటీసీ తో పాటు ఎనిమిది ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం మొత్తం 93 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బంగారుపాలెం జెడ్పీటీసీ బరిలో వైసీపీతో పాటు బిజెపి, బిఎస్పి అభ్యర్థులు బరిలో నిలిచారు.

  • 16 Nov 2021 09:47 AM (IST)

    తాడిపత్రి నియోజకవర్గంలో కొనసాగుతున్న పోలింగ్

    పెద్ద వడుగూరు మండలం గుత్తి అనంతపురం ఎంపిటిసి ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు.
    చిలకల చిన్న గోవిందు(టిడిపి)
    వెంకట స్వామి రెడ్డి(వైయస్సార్ సిపి)
    గ్రామాలు : గుత్తి అనంతపురం, కొత్తపల్లి, కాశేపల్లి
    మొత్తం ఓట్లు : 2342
    పురుషులు: 1210
    మహిళలు : 1132…

  • 16 Nov 2021 09:44 AM (IST)

    జుటూరు ఎంపీటీసీ స్థానంపై ఉత్కంఠ

    అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. ఎంపీటీసీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన అభ్యర్థులు మృతి చెందడంతో వాయిదా పడ్డ ఎన్నికలు ఇవాళ నిర్వహిస్తున్నారు అధికారులు. ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులుగా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి వర్గాల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. జేసీ సోదరుల సొంత గ్రామం జుటూరు కావడంతో రెండు పార్టీలు ప్రిస్టేజిగా తీసుకున్నారు. రెండుపార్టీ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.జుటూరు ఎంపీటీసీ స్థానం పరిధిలో 5 గ్రామాలు ఉన్నాయి.

    జూటూరు, తిమ్మన చెరువు, చిన్న పప్పూరు, ధర్మాపురం, చింతలపల్లి
    మొత్తం ఓట్లు: 2,957
    పురుషులు:1,519.
    మహిళలు:1,438

  • 16 Nov 2021 09:20 AM (IST)

    భారీ బందోబస్తు నడుమ పోలింగ్

    ప్రకాశం జిల్లాలోని నాగులుప్పలపాడు మండలం చదలవాడ, పెద్దారవీడు మండలం తంగిరాళ్లపల్లి, యద్దనపూడి మండలం పోలూరు, కారంచేడు మండలం కారంచేడు-3, పర్చూరు మండలం చెరుకూరు వెస్ట్‌, పీసీ పల్లి పరిధిలో మురుగమ్మి, బల్లికురవ మండలంలో ఉప్పుమాగులూరు ఎంపీటీసీ స్థానాలకు ప్రస్తుతం పోలింగ్ జరుగుతోంది. దీంతో పోలీసులు ముందస్తుగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

     

  • 16 Nov 2021 09:17 AM (IST)

    7 ఎంపీటీసీ స్థానాల నుంచి 19 మంది అభ్యర్థులు

    ప్రకాశం జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న ఏడు ఎంపీటీసీ స్థానాల నుంచి 19 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అన్నిచోట్లా వైసీపీ పోటీలో ఉండగా, టీడీపీ అభ్యర్థులు ఆరుచోట్ల బరిలో నిలిచారు. జనసేన ఒకచోట, స్వతంత్రులు నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్‌ అభ్యర్థి ఒకచోట రంగంలో ఉన్నారు.

  • 16 Nov 2021 09:16 AM (IST)

    ప్రకాశం జిల్లాలో ఏడు ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌

    ప్రకాశంజిల్లాలోని ఏడు ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. పోలింగ్ సజావుగా సాగేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. 21,970 మంది ఓటర్లు హక్కు వినియోగించుకోనుండగా 31 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి సాయత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ జరుగుతుంది. 200 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

  • 16 Nov 2021 09:15 AM (IST)

    వృద్దులు, వికలాంగులుకు ప్రత్యేక ఏర్పాట్లు

    ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. వృద్దులు, వికలాంగులుకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రల వద్ద ఎన్నికల అధికారులు వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్‌ పోలీసులు అమలు చేస్తున్నారు.

  • 16 Nov 2021 07:34 AM (IST)

    954 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

    ఇవాళ జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌లో 8,07640 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 954 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

  • 16 Nov 2021 07:31 AM (IST)

    10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్

    రాష్ట్రంలోని 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఆయా స్థానాల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది.

Follow us on