AP MPTC ZPTC Elections Counting: పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేని అధిక్యత.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..

| Edited By: Narender Vaitla

Sep 20, 2021 | 12:57 AM

AP MPTC ZPTC Elections Result Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో

AP MPTC ZPTC Elections Counting: పరిషత్ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేని అధిక్యత.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలంటే..
Andhra Pradesh Mptc Zptc Polls

AP MPTC ZPTC Elections Result Updates: ఆంధ్రప్రదేశ్ పరిషత్ తీర్పు ఏకపక్షం. ఊహించినట్లే వార్‌ వన్‌సైడ్‌ అయింది. ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే 3 జిల్లాల్లో క్లీన్‌ స్వీప్‌ చేసింది వైసీపీ. విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలో ఫ్యాన్‌ స్పీడ్‌కు ఎదురే లేకుండా పోయింది. మొత్తం అన్ని ZPTC స్థానాలు వైసీపీ ఖాతాలోకే వెళ్లాయి…  

ఓవరాల్‌గా ప్రాదేశిక ఫలితాల్లో వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఆ పార్టీకి 98 శాతం ఫలితాలు వచ్చాయి. ఫ్యాన్‌ గాలికి చంద్రబాబు అడ్డాలో సైతం టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. క్లీన్‌ స్వీప్‌ దిశగా దూసుకుపోతోంది వైసీపీ. నాలుగు మండలాల్లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది అధికార పార్టీ. మొత్తం 66 MPTC సీట్లు నియోజకవర్గంలో ఉంటే 63 వైసీపీకే వచ్చాయి. 3 మాత్రమే టీడీపీకి వచ్చాయి. నాలుగు జడ్పీటీసీ స్థానాల్లోనూ వైసీపీ విజయం సాధించింది.

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో కౌంటింగ్‌ కోసం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాగా.. కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశించారు. నిబంధనలు కఠినంగా అమలవుతాయని… ఫలితాల అనంతరం విజయోత్సవాలు, ర్యాలీలపై పూర్తిగా నిషేధం విధించినట్లు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.

ఎంపీటీసీః ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. నోటిఫికేషన్ జారీ సమయంలో.. 375 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. మొత్తం 9672 స్ధానాల్లో.. 2,371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. సుదీర్ఘ ప్రక్రియలో అభ్యర్ధుల మృతితో 81 స్థానాల్లో పోలింగ్ నిలిచిపోయింది. 7220 స్ధానాలకు ఎన్నికలు జరగగా.. 18,782 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.

జడ్పీటీసీః ఏపీలో మొత్తం జడ్‌పీటీసీ స్థానాలు 660 ఉండగా.. 8 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. 652 స్ధానాల్లో.. 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 515 స్ధానాలకు పోలింగ్ జరగగా.. 2058 అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక ఈ నెల 24న జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. జిల్లా పరిషత్‌  కో ఆఫ్షన్ మెంబర్స్, చైర్మన్ , వైఎస్ చైర్మన్ ఎన్నిక 25న జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఏపీ పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గిరిజా శంకర్ వెల్లడించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 20 Sep 2021 12:53 AM (IST)

    ఎన్ని జెడ్పీటీసీ స్థానాలు వచ్చాయంటే..

    రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం 660 జెడ్పీటీసీ స్థానాలకు 126 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 515 స్థానాలకు ఎన్నికలు జరగగా రాత్రి 11 గంటల వరకు వైకాపా 462 స్థానాల్లో విజయం సాధించింది. ఇక తేదేపా 6 స్థానాలు, జనసేన, సీపీఎం ఒక్క స్థానలో గెలిచాయి.

  • 20 Sep 2021 12:50 AM (IST)

    ఏ పార్టీకి ఎన్ని ఎంపీటీసీ స్థానాలు వచ్చాయంటే..

    ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు రాత్రి 11 గంటల వరకు జరిగింది. మొత్తం 10047 స్థానాలకు గానూ 2371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 7219 స్థానాలకు ఎన్నికలు జరగగా వీటిలో వైకాపా 5916 స్థానాల్లో, తేదేపా 809 స్థానాల్లో, 164 స్థానాల్లో జనసేన, 27 స్థానాల్లో భాజాపా, 3 చోట్ల కాంగ్రెస్‌, 15 చోట్ల సీపీఐ, 8 స్థానాల్లో సీపీఎం గెలిచాయి.


  • 19 Sep 2021 10:29 PM (IST)

    రేపు వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను: సీఎం వైయస్ జగన్

    రేపు ఉదయంలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీల పూర్తి ఫలితాలు వస్తాయి.. రేపు ఉదయం మరోసారి మీ అందరికీ వీడియో సందేశం ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటానని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

  • 19 Sep 2021 10:19 PM (IST)

    కిరణ్‌ కుమార్, చంద్రబాబు ఒక్కటై ఎన్నికలు జరిపించారు: పెద్దిరెడ్డి

    టీడీపీ భవిష్యత్‌ చెప్పడానికి కుప్పం ఫలితం ఒక్కటి చాలన్నారు రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2014 సాధారణ ఎన్నికలకు మూడు నెలల ముందు కిరణ్‌ కుమార్, చంద్రబాబు ఒక్కటే అయి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే గ్రామాల్లో గ్రూపులు ఏర్పడితే టీడీపీకి ఊపిరిపోస్తాయని ఎన్నికల ఆలోచన చేశారు. కిరణ్‌ కుమార్ ఆనాడు పార్టీ మీద, పార్టీ నాయకత్వం మీద ప్రేమ, అభిమానం ఏమీ లేదు. చంద్రబాబుకు బంట్రోతుగా గెలిపించాలని కిరణ్‌ కుమార్ ప్రయత్నించారంటూ పెద్దిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

  • 19 Sep 2021 09:07 PM (IST)

    టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఒక్క ఓటుతో గెలుపు

    పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజా టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఒక్క ఓటుతో గెలుపొందారు.

  • 19 Sep 2021 08:48 PM (IST)

    వైసిపి విజయం ముందే ఊహించాం: ఎపి విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి

    వైసిపి విజయం ముందే ఊహించామని ఎపి విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి అన్నారు. ప్రకాశంజిల్లాలో మొత్తం 55 జడ్‌పిటిసి స్థానాల్లో ఎన్నికలు జరిగితే, మొత్తం 55 స్థానాలు వైసిపి కైవసం చేసుకుని క్లీన్‌ స్వీప్‌ చేసిందన్నారు. ఎంపిటిసి స్థానాల్లో కూడా 95 శాతానికి పైగా ఎంపిటిసి స్థానాలు కైవసం చేసుకున్నామన్నారు.

  • 19 Sep 2021 08:42 PM (IST)

    ప్రకాశం జిల్లాలో ముగిసిన జడ్‌పిటిసి, ఎంపిటిసి కౌంటింగ్

    మొత్తం జడ్‌పిటిసి స్థానాలు… 56
    ఎన్నికలు నిలిచినవి … 1
    ఏకగ్రీవాలు… 14
    ఎన్నికలు జరిగిన స్థానాలు… 41
    వైసిపి … 55 (క్లీన్‌ స్వీప్‌)
    టిడిపి … 0

    ఎంపిటిసి స్థానాలు 784
    ఏకగ్రీవాలు 348
    ఎన్నికలు జరిగినవి 368
    ఎన్నికలు నిలిచినవి 73

    వైసిపి… 629
    టిడిపి… 64
    సిపిఐ… 1
    సిపియం… 1
    బిజెపి …. 1
    ఇండిపెండెంట్లు…15

  • 19 Sep 2021 07:36 PM (IST)

    పెదకొండూరు ఎంపీటీసీ ఫలితంపై ఉత్కంఠ

    గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు ఎంపీటీసీ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. తొలుత చేపట్టిన ఓట్ల లెక్కింపులో 63 ఓట్ల ఆధిక్యంతో జనసేన అభ్యర్థి కొల్లూరి జోజిబాబు విజయం సాధించారు. జోజిబాబు గెలుపుపై వైసీపీ నేతల రీ కౌంటింగ్‌కు కోరారు. రీకౌంటింగ్ లోనూ జనసేన అభ్యర్థే విజయం సాధించారు. ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు రెండోసారి కూడా రీకౌంటింగ్ కోరారు. అయితే, అధికారులు వైసీపీ నేతల డిమాండ్‌ చేశారు. దీంతో అధికారులు, వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కౌటింగ్ కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • 19 Sep 2021 07:16 PM (IST)

    కొనసాగుతున్న జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

    జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తంగా 660 స్థానాలకు గాను 126 స్థానాలు ఏకగ్రీవం కాగా.. 515 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టింది ఎస్ఈసీ. సాయంత్రం 6 గంటల వరకు మొత్తంగా 265 స్థానాల ఓట్ల లెక్కింపు ముగియగా.. వైసీపీ అత్యధికంగా 261 స్థానాలను కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ 3 స్థానాలు, సీపీఎం ఒక్క స్థానంలో గెలుపొందాయి.

    Ap Zptc 6pm

  • 19 Sep 2021 07:11 PM (IST)

    సాయంత్రం 6 గంటల వరకు ఎంపీటీసీ ఫలితాలు..

    రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు తుది దశకు చేరుకుంది. సాయంత్రం 6 గంటల వరకు వెల్లడించిన ఎంపీటీసీ ఫలితాల్లో అత్యధికంగా వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 5745 స్థానాల ఫలితాలు వెలువడగా, వైసీపీ – 4,887 స్థానాల్లో విజయం సాధించింది.  టీడీపీ – 627, జనసేన – 61, బీజేపీ – 19, సీపీఎం – 13, సీపీఐ – 07, కాంగ్రెస్ – 03, ఇతరులు – 128 స్థానాల్లో విజయం సాధించారు.

    Ap Mptc 6pm

     

  • 19 Sep 2021 06:59 PM (IST)

    ఎపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సొంత ఊర్లో వైసీపీకి షాక్

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సొంత ఊర్లో వైసీపీకి ఛేదు అనుభవం ఎదురైంది. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లో కోలుకోలేని దెబ్బతగిలింది. శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస మండలంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో స్పీకర్ సోదరుడు శ్యామలరావు భార్య భారతమ్మ టీడీపీ తరుఫున బరిలో నిలిచారు. ఆమెకు ప్రత్యర్థిగా వైసీపీ పార్టీకి చెందిన కోట గోవింద భార్య కోట క్రిష్ణ కుమారి బరిలో నిలిచారు. కలివరం ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసిన తమ్మినేని భారతమ్మ సుమారు ఆరు వందల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

  • 19 Sep 2021 06:35 PM (IST)

    ప్రతిపక్షాలకు దక్కని ఒక్క ఓటు

    కడప జిల్లా కమలాపూర్‌ మండలం దేవరాజుపల్లి ఎంపీటీసీని వైసీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ మొత్తం 191 ఓట్లు ఉండగా వైసీపీ అభ్యర్థికి ఏకంగా 186 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి 5 ఓట్లు పడ్డాయి. ఇక, ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న టీడీపీ, బీజేపీలకు కనీసం ఒక్క ఓటు కూడా రాకపోవడం విశేషం.

    Ycp Win

  • 19 Sep 2021 06:31 PM (IST)

    ఇప్పటివరకు వెలువడిన జేడ్పీటీసీ ఫలితాలు

    కృష్ణా జిల్లా: 46 జెడ్పీటీసీ స్థానాల్లో 23 వైఎస్సార్‌సీపీ సొంతం.
    గుంటూరు: 54 జెడ్పీటీసీ స్థానాల్లో 27 వైఎస్సార్‌సీపీ విజయం
    ప్రకాశం: 56 స్థానాల్లో 44 సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ
    నెల్లూరు: జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఉన్న 46 స్థానాలను వైఎస్సార్‌సీపీ సొంతం.
    విశాఖపట్నం: 39 స్థానాల్లో 30 వైఎస్సార్‌సీపీ గెలుపు
    విజయనగరం: 34 జెడ్పీటీసీ స్థానాల్లో 25 వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.
    శ్రీకాకుళం: 38 జెడ్పీటీసీ స్థానాల్లో 20 వైఎస్సార్‌సీపీ కైవసం
    అనంతపురం: 63 స్థానాల్లో 35 సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ
    చిత్తూరు: 65 జెడ్పీటీసీ స్థానాల్లో 43 వైఎస్సార్‌సీపీ విజయం
    కడప: 50 స్థానాల్లో 44 గెలిచిన వైఎస్సార్‌సీపీ
    కర్నూలు: జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉన్న 53లో 51 స్థానాలను వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది.
    తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇంకా ఓట్ల లెక్కింపు సాగుతోంది.

  • 19 Sep 2021 06:21 PM (IST)

    చిత్తూరు జిల్లాలో 65 మండలాలు వైసీపీ సొంతం

    చిత్తూరు జిల్లాలో 886 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ 822 సొంతం చేసుకుంది. కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో ఆ పార్టీకి కేవలం 25 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఈ విజయంతో వైసీపీ 65 మండల పరిషత్‌లను సొంతం చేసుకుంది.

  • 19 Sep 2021 06:11 PM (IST)

    ప్రజల తీర్పు.. వార్ వన్ సైడ్ః ఎమ్మెల్యే రోజా

    ప్రజల తీర్పు చూస్తే వార్ వన్ సైడ్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనకు ప్రజలు పట్టం కట్టారని నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఈరోజు ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో గణనాథుడిని నిమజ్జనం చేస్తుంటే, ఏపీలో మాత్రం చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలకు కసితో బుద్ధి చెప్పి, టీడీపీ జెండా ని పీకి పడేశారన్నారు. రాబోయే కాలంలో 23 సీట్లు కాదు, మూడు సీట్లు కూడా వస్తాయో లేదో డౌటు అన్నారు.

    Mla Roja

  • 19 Sep 2021 05:56 PM (IST)

    తిరుగులేని అధిక్యత దిశగా వైఎస్సార్‌సీపీ

    జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని అధిక్యత సంపాదించింది. రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌లలో 11 జెడ్పీలు కైవసం చేసుకుంది. నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌. ఆయా జిల్లాల్లోని ఉన్న జెడ్పీటీసీ స్థానాలన్నింటిని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకుంది.

    కృష్ణా జిల్లా: 46 జెడ్పీటీసీ స్థానాల్లో 23 వైఎస్సార్‌సీపీ సొంతం.
    గుంటూరు: 54 జెడ్పీటీసీ స్థానాల్లో 27 వైఎస్సార్‌సీపీ విజయం
    ప్రకాశం: 56 స్థానాల్లో 44 సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ
    నెల్లూరు: జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఉన్న 46 స్థానాలను వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.
    విశాఖపట్టణం: 39 స్థానాల్లో 30 వైఎస్సార్‌సీపీ గెలుపు
    విజయనగరం: 34 జెడ్పీటీసీ స్థానాల్లో 25 వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.
    శ్రీకాకుళం: 38 జెడ్పీటీసీ స్థానాల్లో 20 వైఎస్సార్‌సీపీ కైవసం
    అనంతపురం: 63 స్థానాల్లో 35 సొంతం చేసుకున్న వైఎస్సార్‌సీపీ
    చిత్తూరు: 65 జెడ్పీటీసీ స్థానాల్లో 43 వైఎస్సార్‌సీపీ విజయం
    వైఎస్సార్‌ కడప: 50 స్థానాల్లో 44 గెలిచిన వైఎస్సార్‌సీపీ
    కర్నూలు: జెడ్పీటీసీ ఎన్నికల్లో ఉన్న 53లో 51 స్థానాలను వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది.
    తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇంకా ఓట్ల లెక్కింపు సాగుతోంది.

  • 19 Sep 2021 05:53 PM (IST)

    బ్యాలెట్ పేపర్ లో మద్యంబాబుల కన్నీటి చీటీలు!

    అనంతపురం నల్లచెర్వు మండలం కడవవాండ్లపల్లి ఎంపీటీసీ బ్యాలెట్ బాక్సులో ఓటుతో పాటు ఓ చీటీని అధికారులు గుర్తించారు. మంచి మద్యం బ్రాండ్లను అందుబాటులో పెట్టండి బీర్ బాటిళ్లు కూలింగ్ ఉండేలా చూడండి అంటూ అనంతపురం జిల్లా నల్లచెరువు పోలింగ్ బూత్ లో నల్లచెరువు యూత్ అంటూ ఓటు తోపాటు ఓ పేపర్‌లో రాసి ఓ యువకుడు తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. వివిధ రకాల బ్రాండ్లు తాగలేక విసిగిపోయామని మంచి బ్రాండ్లను సరఫరా చేయాలని సదరు ముందుబాబు అధికారులకు విజ్ఞప్తి చేశారు. తన ఓటు తో పాటు బ్యాలెట్ బాక్స్ లో చీటీలు రాసి వేశారు. నల్లచెరువు మందుబాబుల యూత్ అధ్యక్షుడు అని రాసి ఉండటం కొసమెరుపు.

  • 19 Sep 2021 05:48 PM (IST)

    చిత్తూరు జిల్లాలో పూర్తయిన పరిషత్ ఎన్నికల కౌంటింగ్

    చిత్తూరు జిల్లాలో 65 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, ఇవాళ వెలువడిన ఫలితాల్లో 63 స్థానాలను అధికార వైఎస్‌ఆర్‌సీపీ దక్కించుకుంది. బంగారుపాలెం, కలకడ మండలాల్లో పోటీలో ఉన్న జెడ్పీటీసీ అభ్యర్థుల మరణించడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక, చిత్తూరు జిల్లాలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు.. 886 కాగా.. వైసీపీ ..848, టీడీపీ..33, సిపిఐ:1, ఇతరులు 19 స్థానాల్లో విజయం సాధించారు.

     

  • 19 Sep 2021 05:44 PM (IST)

    నెల్లూరు జిల్లా ఎంపీటీసీ ఫలితాలు ఇవే…

    నెల్లూరు జిల్లాలో మొత్తం 362 ఎంపీటీసీ స్థానాలకు గానూ 312 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయఢంకా మోగించింది. తెలుగు దేశం పార్టీ 31 స్థానాలు, బీజేపీ 02 స్థానాలు, సీపీఐ 03, జనసేన 01, ఇతరులు 13 స్థానాల్లో గెలుపొందాయి.

    Zptc Table

     

  • 19 Sep 2021 05:34 PM (IST)

    పశ్చిమ గోదావరి జిల్లాలోనూ అదే తీరు

    తెలుగు దేశం పార్టీకి కంచుకోటల్లా ఉన్న ప్రాంతాల్లోనూ అధికార వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా 80 శాతానికి పైగా ఎంపీటీసీ స్థానాల్లో విజయదుందుభి మోగించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 780 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, 347 ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో వైసీపీ 272 స్థానాల్లో విజయకేతనం ఎగువవేయగా, తెలుగుదేశం పార్టీ 44, జనసేన 21, బీజేపీ 02, ఇతరులు 08 స్థానాల్లో గెలుపొందారు. అలాగే, జిల్లాలో మొత్తం 48 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహించారు. ఇప్పటివరకు 3 చోట్ల ఫలితాలు వెల్లవడ్డాయి. మూడింటిని వైసీపీ తన ఖాతాలో వేసుకుంది.

  • 19 Sep 2021 05:25 PM (IST)

    11 జిల్లా పరిషత్‌ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం

    ఏపీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ విజయపరంపర కొనసాగుతోంది. రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌లలో 11 జిల్లా పరిషత్‌లను వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 144 జెడ్పీటీసీ స్థానాల్లో 142 వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది.

  • 19 Sep 2021 05:05 PM (IST)

    ఏపీ ఎంపీటీసీ ఎన్నికల వివరాలు

    Mptc Details

  • 19 Sep 2021 05:01 PM (IST)

    ఏపీ జెడ్పీటీసీ ఎన్నికల వివరాలు

    Zptc Details

  • 19 Sep 2021 04:55 PM (IST)

    ప్రకాశం జిల్లాలో పరువు నిలుపుకున్న టీడీపీ

    ప్రకాశం జిల్లాలో పలు చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. బల్లికురవ మండలం గుంటుపల్లిలో 149 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలుపొందారు. మల్లయపాలెంలో 50 ఓట్లతో టీడీపీ మద్దతుదారు విజయం సాధించారు. కొమ్మినేనివారిపాలెంలో 7 ఓట్లతో టీడీపీ మద్దతుదారు విజయకేతనం ఎగురవేశారు.

  • 19 Sep 2021 04:52 PM (IST)

    జెడ్పీటీసీ ఫలితాల్లో వైసీపీదే జోరు

    ఏపీ పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 4గంటల వరకు వెలువడిన ఫలితాలను బట్టి 142 స్థానాల్లో వైసీపీ, రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. విశాఖపట్నం, కడప జిల్లాల్లో ఒక్కో స్థానంలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. విజయనగరం జిల్లాలో 1, విశాఖ జిల్లాలో 9, తూర్పుగోదావరిలో 1, కృష్ణాలో 1, గుంటూరులో 3, ప్రకాశంలో 17, నెల్లూరు జిల్లాలో 22, చిత్తూరులో 31, కడపలో 1, కర్నూలులో 35, అనంతపురం జిల్లాలో 21 జడ్పీటీసీ స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది.

    వైఎస్సార్‌సీపీ – 142

    తెలుగుదేశం – 02

    Ap Zptc

     

  • 19 Sep 2021 04:38 PM (IST)

    పరిషత్ ఎన్నికల్లోనూ తిరుగులేని వైసీపీ

    ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటివరకు 3,923 ఎంపీటీసీ ఫలితాల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయఢంకా మోగించింది.

    వైఎస్సార్‌సీపీ – 3,398

    తెలుగుదేశం – 395

    బీజేపీ – 14

    జనసేన – 17

    సీపీఐ – 09

    సీపీఎం – 07

    కాంగ్రెస్ – 03

    ఇతరులు – 80

    Ap Mptc

  • 19 Sep 2021 04:27 PM (IST)

    పుట్టపర్తి నియోజకవర్గం వైసీపీ సొంతం

    అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ దూసుకుపోతుంది. బుక్కపట్నం, ఆమడగూరు , ఓబులదేవచెరువు, కొత్తచెరువు, నల్లమాడ జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

  • 19 Sep 2021 04:22 PM (IST)

    కర్నూలు జిల్లాలో క్లీన్ స్విప్ దిశగా వైసీపీ

    కర్నూలు జిల్లాలో ఎంపీటీసీతో పాటు జెడ్పీటీసీ ఫలితాల్లోనూ అధికార పార్టీ వైసీపీ సత్తా చాటుతోంది. ఇప్పడి వరకు వెలువడిన ఫలితాల్లో అత్యధిక స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. క్లీన్ స్విప్ దిశగా పరుగులు పెడుతోంది. జిల్లాలో మొత్తం 52 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా, ఇప్పటికే వైసీపీ 51 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. మరో స్థానంలోనూ అధిక్యంలో కొనసాగుతోంది వైసీపీ.

  • 19 Sep 2021 04:14 PM (IST)

    వైసీపీ – టీడీపీ నేతల మధ్య తోపులాట.. విడపనకల్ మండలంలో నిలిచిపోయిన ఫలితం

    అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఎన్నిక ఫలితాన్ని నిలిపివేశారు అధికారులు. విడపనకల్ మండలం పోలికి పంచాయతీలో ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి తిమ్మక్క 43 ఓట్లతో గెలుపొందారు. అయితే, మరోసారి రీకౌంటింగ్ చేయాలంటూ వైసీపీ అభ్యర్థి.. అధికారులతో గొడవకు దిగారు. దీంతో కౌంటింగ్ కేంద్రంలో కొద్దిసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. వైసీపీ – టీడీపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తాము గెలిచినట్టు డిక్లరేషన్ ఇవ్వాలని పట్టుబట్టారు టీడీపీ నాయకులు. ఇరు పార్టీ నేతల ఉద్రిక్తతల నడుమ ఫలితం ప్రకటించకుండా నిలిపివేశారు అధికారులు…

    Tdp Ycp Fight

  • 19 Sep 2021 04:02 PM (IST)

    మడకశిర మండలంలో నిలిచిపోయిన ఓట్ల లెక్కింపు

    అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడనహళ్లి గ్రామంలో జరగాల్సిన ఎంపీటీసీ కౌటింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టినట్లు గుర్తించిన ఎన్నికల అధికారులు ఓట్ల లెక్కింపును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గౌడనహళ్లి ఎంపీటీసీ పరిధిలో మొత్తం 2360 మంది ఓటర్లు ఉండగా.. 1886 ఓట్లు పోలయ్యాయి. ఇందులో భాగంగా 10వ నెంబర్ బ్యాలెట్ బాక్సులోని 593 బ్యాలెట్ పేపర్లు చెదలు పట్టినట్లు అధికారులు తెలిపారు.

  • 19 Sep 2021 03:53 PM (IST)

    మాచర్లలోనూ ఫ్యాన్‌దే గాలి

    గుంటూరు జిల్లాలోనూ వైసీపీదే హవా కొనసాగుతోంది. మాచర్ల నియెజకవర్గంలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఐదు జీడ్పీటీసీ స్థానాలకు ఐదూ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 71 ఎంపీటీసీ స్థానాలకు 71 వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది.

  • 19 Sep 2021 03:49 PM (IST)

    చంద్రబాబు, అచ్చన్నాయుడు రాజీనామా చేసి రండి…. తేల్చుకుందాంః అంబటి రాంబాబు

    చంద్రబాబు తాను అధికారంలో ఉన్న సమయంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా పారిపోయారని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. MPTC, ZPTC ఎన్నికలlli అడ్డుకోవడానికి చంద్రబాబు ఎన్నో ప్రయత్నాలు చేసారని ఆరోపించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు అనుకూలంగా లేకపోవడంతో ఎన్నికలను బహిష్కరించామని, కుంటిసాకులు చెబుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కుప్పకూలిపోయిందన్నారు. ఈ ఎన్నికల ఫలితాల తరువాత టీడీపీని మూసివేయడమే అంటూ అంబటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ నేతలు మొత్తం రాజీనామా చేసి వస్తే ఎవరు గెలుస్తారో తెలుస్తుందన్నారు.

    Ambati Rambabu

  • 19 Sep 2021 03:47 PM (IST)

    పెనుగొండలోనూ టీడీపీకి ఎదురుగాలి

    ఏపీలో అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ హవా కొనసాగుతోంది. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ జడ్పీటీసీ స్థానాన్ని వైసీపీ అభ్యర్థి కైవసం చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థిపై వైసీపీకి చెందిన శ్రీరాములు 8,856 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అటు, సోమందేవపల్లి జడ్పీటీసీ వైసీపీ కైవసం చేసుకుంది. 4,348 ఓట్ల మెజార్టీతో డీసీ అశోక్‌ గెలుపు పొందారు.

  • 19 Sep 2021 03:28 PM (IST)

    పెదబయలు జడ్పీటీసీ వైసీపీ కైవసం

    విశాఖపట్నం జల్లా అరకు నియోజకవర్గం పెదబయలు జడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీకి చెందిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. తన సమీప టీడీపీ అభ్యర్థిపై 500 ఓట్ల మెజార్టీతో బొంజుబాబు గెలుపొందారు.

  • 19 Sep 2021 03:27 PM (IST)

    కొనసాగుతున్న అధికార పార్టీ ప్రభంజనం

    ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఇప్పటివరకు 3129 ఎంపీటీసీ ఫలితాల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయఢంకా మోగించింది.

    వైఎస్సార్‌సీపీ – 2773

    తెలుగుదేశం – 267

    బీజేపీ – 12

    సీపీఐ – 07

    సీపీఎం – 04

    కాంగ్రెస్ – 02

    ఇతరులు – 57

  • 19 Sep 2021 03:06 PM (IST)

    నోటా ఓట్లను కూడా లెక్కించాలంటూ వైసీపీ అభ్యర్థి డిమాండ్

    గుంటూరు జిల్లా గణపవరంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎంపీటీసీ నోటా ఓట్ల విషయంలో వైసీపీ నేతలు ఎన్నికల అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో లెక్కింపు కేంద్రం వద్ద గందరగోళం నెలకొంది. టీడీపీ అభ్యర్థ రామారావు 190 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో నోటా ఓట్లను కూడా కలిపి లెక్కించాలంటూ వైసీపీ అభ్యర్థి పట్టుబట్టారు. ఇందుకు అధికారులు నిరాకరించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

  • 19 Sep 2021 03:04 PM (IST)

    మొత్తం 13 జిల్లాల్లో జడ్పీటీసీ ఫలితాల సరళి ఇదీ..

    Zptc Results

  • 19 Sep 2021 03:03 PM (IST)

    మొత్తంగా 13 జిల్లాల్లో ఎంపీటీసీ ఫలితాల సరళి ఇలా ఉంది:

    MPTC Results

  • 19 Sep 2021 02:54 PM (IST)

    విశాఖపట్నం @ 2.40pm

    ఎంపీటీసీ స్థానాలు మొత్తం : 652
    ప్రకటించినవి: 403/652
    UN         WON      Total

    YSRCP – 36 + 286= 322

    TDP – 00 +64= 64

    BJP – 00+03= 03

    Janasena – 00+ 0= 00

    Congres = 00+ 01 = 01

    CPM – 00+ 01 = 01

    Others – 1 + 11= 12

    మొత్తం జడ్పీటీసీ ల సంఖ్య : 39

    ఎన్నికలు జరిగినవి : 37

    ప్రకటించినవి : 01+03 = 04

    వైసీపీ : 01+ 03 = 04

    టీడీపీ : 00+ 01 = 05

  • 19 Sep 2021 02:48 PM (IST)

    పశ్చిమ గోదావరి జిల్లా లేటెస్ట్ ట్రెండ్స్

    పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జోరుగా కొనసాగుతుండగా, ఇప్పటి వరకు వెలువడ్డ ఫలితాల్లో ఇప్పటి వరకు 89 ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. అధికార వైసీపీ 76, టీడీపీ 8, జనసేన 4, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట విజయం సాధించారు.

  • 19 Sep 2021 02:40 PM (IST)

    టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ స్వగ్రామంలో వైఎస్సార్‌సీపీ జయకేతనం

    కృష్ణా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు ఎంపీటీసీ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. చరిత్రలో తొలిసారి పామర్రు ఎంపీపీని వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తన తాతగారి ఊరైన నిమ్మకూరును దత్తత తీసుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి విజయం సిద్ధించకపోవడం విశేషం.

  • 19 Sep 2021 02:11 PM (IST)

    నారావారిపల్లిలో చంద్రబాబుకు షాక్‌

    పరిషత్‌ ఎన్నికల్లో నారావారిపల్లిలో చంద్రబాబుకు షాక్‌ తగిలింది. నారావారిపల్లి ఎంపీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం పరాజయం పొందారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రాజయ్య 1,347 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీడీపీకి అభ్యర్థికి కేవలం 307 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.

  • 19 Sep 2021 02:10 PM (IST)

    జెడ్పీ ఛైర్మన్, ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్

    జిల్లా పరిషత్ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్‌తో పాటు మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 24న ఎంపీపీ, 25న జడ్‌పీ ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్, కో ఆఫ్షన్ మెంబర్ ఎన్నిక నిర్వహించాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసిది.

    Zp Chairman, Mpp Notification

  • 19 Sep 2021 02:03 PM (IST)

    చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం

    Chandrababu Naidu

    చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. కుప్పం నియోజకవర్గంలో 85శాతానికిపైగా పంచాయతీల్లోనూ వైయస్సార్‌సీపీ ప్రభంజనం కొససాగింది. మొత్తం నాలుగు మండలాల్లోనూ వైయస్సార్‌సీపీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. నాలుగు మండలాల్లో 89 పంచాయతీల్లో 75 చోట్ల వైయస్సార్‌సీపీ, 14 చోట్ల టీడీపీ గెలుపొందింది.
    కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైయస్సార్‌సీపీకి 17, టీడీపీకి 2 స్థానాలను గెలుచుకుంది.
    గుడిపల్లె మండలంలో 12 ఎంపీటీసీల్లో అన్ని చోట్లా వైయస్సార్‌సీపీ గెలుపు.
    రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీలకు గానూ అన్నిచోట్లా గెలిచిన వైయస్సార్‌సీపీ.
    శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 11 చోట్ల వైయస్సార్‌సీపీ, 1 చోట టీడీపీ గెలుపు. మరో 6 చోట్ల ఫలితాలు రావల్సివుంది.

    ఇదే బాటలో జడ్పీటీసీల ఫలితాలు
    చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఎంపీటీసీలోనూ టీడీపీ దారుణ ఓటమిని చవిచూసింది.
    వైయస్సార్‌సీపీ అభ్యర్థి రాజయ్య వేయి ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపు

  • 19 Sep 2021 01:54 PM (IST)

    కమలాపురంలో టీడీపీ-పోలీసుల మధ్య వాగ్వివాదం

    కమలాపురం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాథ్ శర్మ పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అధికార పార్టీ సంబరాలకు అనుమతి ఇచ్చి, టీడీపీ అభ్యర్థి గెలిస్తే ఎలాంటి సంబరాలు చేసుకోకూడదా అని కాశీభట్ల ప్రశ్నించారు. దీంతో టీడీపీ – పోలీసుల ఘర్షణ వాతావరణం జరిగింది. కాగా, ఈ సందర్భంగా గొడవపడిన సీఐపై, డీఎస్పీకి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి రెడ్డి ఫిర్యాదు చేశారు.

     

  • 19 Sep 2021 01:51 PM (IST)

    1,399 స్థానాల్లో వైసీపీ విజయం

    రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 1,562 ఎంపీటీసీ ఫలితాలు వెలువడ్డాయి.

    వైఎస్సార్‌సీపీ – 1,399

    తెలుగుదేశం పార్టీ – 120

    బీజేపీ – 7

    ఇతరులు – 15

  • 19 Sep 2021 01:47 PM (IST)

    ఈ నెల 24న ఎంపీపీ, 25న జెడ్పీ ఛైర్మన్ ఎన్నికః పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్

    రాష్ట్రంలో 515 జెడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం 8 గంటలకు మొదలయిందని పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పటివరకు 1,562 ఎంపీటీసీ, 8 జెడ్పీటీసీ ఫలితాలు వచ్చాయి. కొన్ని చోట్ల వర్షపు నీరు వల్ల, మరికొన్ని చోట్ల చెదలు వల్ల బ్యాలెట్ పత్రాలు దెబ్బతిన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపీపీ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక ఈ నెల 24న జరుగుతుందని తెలిపారు. జిల్లా పరిషత్లో కో ఆఫ్షన్ మెంబర్స్, చైర్మన్ , వైఎస్ చైర్మన్ ఎన్నిక 25న జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయని గిరిజా శంకర్ వెల్లడించారు.

    Girija Shankar

  • 19 Sep 2021 01:39 PM (IST)

    చివరకు ధర్మమే గెలిచిందిః మంత్రి అవంతి శ్రీనివాస్

    ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక ఎన్నికల ఫలితాలపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. ముందుగా ఊహించినట్లుగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నకల ఫలితాలు వెల్లడయ్యాయన్నారు. 13 జిల్లాల్లోనూ వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తామన్నారు. అన్ని జిల్లా పరిషత్‌లను కైవసం చేసుకుంటామని తెలిపారు. ఎన్నికలు జరిగాక బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టటం, వాటర్ చేరటం వంటి పరిస్థితి రావటం దురదృష్టమన్న ఆయన.. ఆరు నెలల పాటు కౌంటింగ్ డిలే అవ్వటం దారుణమన్నారు. ఎన్నికలను రద్దు చేయాలని టీడీపీ రకరకాలుగా ప్రయత్నించి విఫలమైందన్నారు. చివరకు ధర్మమే గెలిచిందన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్.

  • 19 Sep 2021 01:30 PM (IST)

    కోడుమూరుః 2 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గెలుపు

    కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ఎంపీటీసీ స్ధానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. నాలుగు ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి సుజాత వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. దీంతో వైసీపీ అభ్యర్థి రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. ఎన్నికల అధికారులు రీకౌంటింగ్ నిర్వహించగా, టీడీపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. రెండు ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిపై సుజాత విజయం సాధించారని అధికారులు వెల్లడించారు.

  • 19 Sep 2021 01:25 PM (IST)

    కుప్పంలో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభం

    తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభం తప్పలేదు. కుప్పం మండలంలో 17 ఎంపీటీసీల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయం సాధించగా, 2 ఎంపీటీసీలకు మాత్రమే టీడీపీ పరిమితం అయ్యింది.

  • 19 Sep 2021 01:23 PM (IST)

    నెల్లూరు జిల్లాలో వైసీపీ జోరు

    నెల్లూరు జిల్లాలో మొత్తం ఎంపీటీసీ స్థానాలు – 554

    వైఎస్‌ఆర్‌సీపీ 188 (ఏకగ్రీవం) + 142 = 330

    తెలుగుదేశం పార్టీ – 16

    బీజేపీ – 02
    సీపీఎం – 01
    ఇతరులు – 04

  • 19 Sep 2021 01:21 PM (IST)

    కృష్ణా జిల్లాలో దూసుకుపోతున్న వైసీపీ

    కృష్ణా జిల్లా మొత్తం ఎంపీటీసీ స్థానాలు – 648

    వైఎస్‌ఆర్‌సీపీ – 67 (ఏకగ్రీవం) + 90 =157

    తెలుగు దేశం పార్టీ – 2 (ఏకగ్రీవం) + 03 = 05

    జనసేన : 01 స్థానం

    ఇతరులు : 01 స్థానం

    కృష్ణా జిల్లాలో మొత్తం జడ్పీటీసీ స్థానాలు : 41

    వైసీపీ : 02 ఏకగ్రీవం + 02 = 04

  • 19 Sep 2021 01:18 PM (IST)

    విశాఖ జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధిక్యం

    విశాఖపట్నం జిల్లా మొత్తం ఎంపీటీసీ స్థానాలు : 652

    వైఎస్‌ఆర్‌సీపీ – 36 (ఏకగ్రీవం) + 81= 117

    తెలుగుదేశం పార్టీ = 10

    బీజేపీ = 01

    కాంగ్రెస్ = 01

    సీపీఎం = 01

    ఇతరులు – 1 (ఏకగ్రీవం) + 02 = 03

  • 19 Sep 2021 01:15 PM (IST)

    విజయనగరం జిల్లాలో ఫ్యాన్ జోరు

    విజయనగరం జిల్లాలో ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు:

    ఎంపీటీసీ స్థానాలు మొత్తం – 549

    ఫలితాలు వెలువడి స్థానాలు – 148

    వైఎస్‌ఆర్‌సీపీ – 53 (ఏకగ్రీవం) + 90 = 143

    తెలుగుదేశం పార్టీ = 03

    ఇతరులు – 02 (ఏకగ్రీవం)

  • 19 Sep 2021 01:12 PM (IST)

    20,849 ఓట్ల మెజార్టీతో నందలూరు జడ్పీటీసీ వైసీపీ కైవసం

    పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాల్లో ఫ్యాన్‌ దూసుకుపోతోంది. అనేక చోట్ల సింగిల్‌ డిజిట్‌కే టీడీపీ పరిమితమైంది. వైఎస్సార్‌ కడప జిల్లా నందలూరు జడ్పీటీసీ వైఎస్సార్‌‌సీపీ కైవసం చేసుకుంది. 20,849 ఓట్ల మెజార్టీతో గడికోట ఉషారాణి విజయఢంకా మోగించారు.

  • 19 Sep 2021 01:09 PM (IST)

    కర్నూలు జిల్లాలోనూ ఫ్యాన్‌దే హవా

    కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 202 ఎంపీటీసీ ఫలితాలు వెల్లడయ్యాయి. మిగిలిన 282 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌ కొనసాగుతోంది.

    వైఎస్సార్‌సీపీ-184
    తెలుగుదేశం పార్టీ – 15
    బీజేపీ – 1
    ఇతరులు – 2

     

  • 19 Sep 2021 01:08 PM (IST)

    మార్కాపురం జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థికి 15,315 మెజార్టీ

    ప్రకాశం జిల్లా మార్కాపురం జడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 15,315 మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాపన్నరెడ్డి విజయం సాధించారు. అత్యధిక మెజార్టీతో బాపన్నరెడ్డి రికార్డు సృష్టించారు.

  • 19 Sep 2021 01:06 PM (IST)

    దేవినేని ఇలాకాలో వైసీపీదే క్లీన్ స్విప్

    తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా సొంత మండలం గొల్లపూడిలో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగింది. గొల్లపూడిలో మొత్తం 10 ఎంపీటీసీలకు గానూ 10 వైఎస్సార్‌సీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ పూర్తి చతికిలాపడింది.

  • 19 Sep 2021 01:02 PM (IST)

    కడప జిల్లాలో వైసీపీ జోరు

    కడప జిల్లాలో మొత్తం జడ్పీటీసీ స్థానాలు – 50

    వైఎస్సార్ సీపీ – 38 స్థానాల్లో గెలుపు

    మొత్తం ఎంపీటీసీ స్థానాలు – 858

    వైఎస్ఆర్‌సీపీ – 431

    తెలుగుదేశం పార్టీ – 9

    బీజేపీ – 2

    ఇతరులు – 2

     

  • 19 Sep 2021 12:59 PM (IST)

    కరసువలస ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి విజయం

    విజయనగరం జిల్లా సాలూరు మండలం కరసువలస ఎంపీటీసీగా టీడీపీ అభ్యర్థి అప్పీకొండ రమాదేవి తన సమీప వైసీపీ అభ్యర్థిపై 110 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు.

  • 19 Sep 2021 12:58 PM (IST)

    చిత్తూరు జిల్లాలోనూ వైసీపీ గాలి జోరు

    చిత్తూరు జిల్లా ఫలితాల్లో వైఎస్ఆర్‌సీపీ దూసుకుపోతుంది. జిల్లా వ్యాప్తంగా 65 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా 30 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు బావుటా ఎగుర వేసింది. 841 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో సగానికి పైగా సీట్లలో ఫ్యానునే విజయం వరించింది. ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో 464 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపొందగా టీడీపీ కేవలం 14 స్థానాల్లోనే గెలవగలిగింది. ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ ఖాతా తెరవలేదు.

  • 19 Sep 2021 12:55 PM (IST)

    ప్రకాశం జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్

    ప్రకాశం జిల్లాలో మొత్తం జెడ్‌పీటీసీ స్థానాలు – 55

    వైఎస్ఆర్‌సీపీ – 14 (ఏకగ్రీవం) + 16 = 20

    తెలుగుదేశం పార్టీ = ఖాతా తెరవలేదు.

     

    ఎంపీటీసీ స్థానాలు మొత్తం : 742

    వైఎస్‌ఆర్‌సీపీ 348 (ఏకగ్రీవం)+ 52 = 400

    తెలుగుదేశం పార్టీ = 25 (ఏకగ్రీవం)

    ఇతరులు = 5 (ఏకగ్రీవం)

     

     

     

  • 19 Sep 2021 12:49 PM (IST)

    అనంతపురం జిల్లాలోనూ ఫ్యాన్ జోరు

    అనంతపురం జిల్లాలో మొత్తం 841 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలు ఇలా ఉన్నాయి..

    వైఎస్సార్‌సీపీ – 49 (ఏకగ్రీవం)+190= 239

    తెలుగుదేశం పార్టీ 01(ఏకగ్రీవం) + 08 = 09

    ఇతరులు = 02 (ఏకగ్రీవం)

  • 19 Sep 2021 12:46 PM (IST)

    కృష్ణా జిల్లాలో 30 ఎంపీటీసీ స్థానాలు వైసీపీ వశం

    కృష్ణా జిల్లాలో వైసీపీ హవా కొసగుతోంది. మధ్యాహ్నం 12 గంటల వరకు వెలువడిన ఫలితాల్లో వైసీపీ 30 స్థానాల్లో విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి ఒక్క స్థానానికే పరిమితమైంది.

  • 19 Sep 2021 12:43 PM (IST)

    నెల్లూరు జిల్లాలో అధికార వైసీపీదే హవా

    నెల్లూరు జిల్లాలో అధికార వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. ఇవాళ వెల్లడవుతున్న ఫలితాల్లో ఏకపక్షంగా సాగుతున్నాయి. ఇప్పటివరరకు వెలువడిన ఫలితాల్లో వైసీపీ 241 స్థానాల్లో విజయకేతనం ఎగువర వేసింది.

    ఎంపీటీసీ స్థానాలు మొత్తం : 554

    వైఎస్సార్‌సీపీ – 188 (ఏకగ్రీవం) + 53 = 241

    తెలుగుదేశం పార్టీ = 05

    భారతీయ జనతా పార్టీ = 02

    ఇతరులు = 03

  • 19 Sep 2021 12:32 PM (IST)

    ఎంపీటీసీ ఎన్నికల్లో బోణి కొట్టిన బీజేపీ

    ఆంధ్రప్రదేశ్ ఎంపీటీసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బోణి కొట్టింది. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తుమ్మపాల-5 ఎంపీటీసీ స్థానంలో బీజేపీ అభ్యర్థి చదరం నాగేశ్వరరావు గెలుపొందారు. 312 ఓట్ల అధిక్యంతో ఆయన గెలుపొందారు.

  • 19 Sep 2021 12:27 PM (IST)

    కమలాపురం మండలం దేవరాజుపల్లె ఎంపీటీసీ వైసీపీ కైవసం

    వైయస్సార్ జిల్లా కమలాపురం మండలం దేవరాజుపల్లె ఎంపిటిసి 221 ఓట్లు పోలయ్యాయి. వాటిలో ఇన్ వాలిడ్ 17, టిడిపి – 5, వైసిపి – 191 కి వచ్చాయి. 186 ఓట్లమెజారిటీ తో వైసిపి అభ్యర్థి చెన్నకేశవ రెడ్డి గెలుపొందారు.

  • 19 Sep 2021 12:19 PM (IST)

    ఉపాధ్యాయుల నిరసన..

    కందుకూరు కౌంటింగ్ కేంద్రంలో డ్యూటీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల ఆందోళన.. వసతులు కల్పించలేదని ఉపాధ్యాయుల నిరసన…
    కోవిడ్ నిబందనలు పాటించకుండా ఒకే రూములో 40 మందితో కౌంటింగ్ ఏర్పాటు చేశారని ఆందోళన.

  • 19 Sep 2021 12:15 PM (IST)

    ఫలితాలపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు..

    ఇది ప్రజాభిప్రాయం కాదని పరిషత్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, తెదేపా శాసనసభ పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇవి బోగస్ పరిషత్ ఎన్నికల ఫలితాలంటూ తెలిపారు. తెలుగుదేశం ఈ ఎన్నికలను బహిష్కరించిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ర్టంలో అడుగడుగునా చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ దిక్కరణ జరుగుతోందన్నారు. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏవిధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందో దేశం మొత్తం చూసిందని అచ్చెన్నాయుడు తెలిపారు.

  • 19 Sep 2021 12:00 PM (IST)

    పశ్చిమ గోదావరిలో వైసీపీ జోరు..

    పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నం వేస్ట్ స్థానంలో వైసీపీ అభ్యర్థి కౌరు సీతామహాలక్ష్మి 50 ఓట్లు మెజార్టీతో విజయం
    పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పాతపాడు స్థానంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మల్లాడి శాంత రత్నం 540 ఓట్ల మెజార్టీతో విజయం
    భీమవరం మండలం నరసింహపురంలో 613 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలుపు.
    భీమవరం మండలం దొంగపిండి వైసీపీ అభ్యర్థి గెలుపు

  • 19 Sep 2021 11:57 AM (IST)

    కుప్పంలో వైసీపీ జోరు..

    కుప్పంలో వైసీపీ జోరు.. నియోజకవర్గంలో మొత్తం 66 స్థానాలు ఉండగా.. 65 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి.
    ఇప్పటి వరకు.. వైసీపీ..18 గెలుపొందగా.. టీడీపీ..03 విజయం సాధించింది.

  • 19 Sep 2021 11:47 AM (IST)

    అత్తా కోడళ్ల మధ్య హోరాహోరీ

    అత్తపై ఎంపీటీసీగా గెలిచిన కోడలు
    కడప జిల్లా పెద్దముడియం మండలం భీమగుండం ఎంపీటీసీ స్థానంలో అత్త, కోడళ్ల మధ్య పోటీ నెలకొంది.
    అత్త బీజేపీ తరపున పోటీ చేయగా, కోడలు వైసీపీ నుంచి పోటీ
    అత్తపై 216 ఓట్లతో గెలుపొందిన వైసీపీ అభ్యర్థి సుజాత

  • 19 Sep 2021 11:46 AM (IST)

    ఏ. పోలవరం ఎంపీటీసీ స్థానంలో

    పశ్చిమ గోదావరి  జిల్లా జంగారెడ్డిగూడెం మండలం ఏ. పోలవరం ఎంపీటీసీ స్థానంలో వైస్సార్సీపీ  అభ్యర్థి  పసుపులేటి వరలక్ష్మి 901 మెజారిటీతో గెలుపొందారు.

  • 19 Sep 2021 11:33 AM (IST)

    చిత్తూరులో వైసీపీ హవా..

    చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు 25 ఎంపీటీసీ స్థానాల ఫలితాలు విడుదలయ్యాయి.
    వైసిపి 25.
    టీడీపీ 01.
    వైసీపీ రెబల్స్ 02

  • 19 Sep 2021 11:26 AM (IST)

    తుది నిర్ణయం ఎస్ఈసీదే..

    ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటారని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది తెలిపారు. బ్యాలెట్ పేపర్ల వాలిడేషన్ పై స్థానిక కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

  • 19 Sep 2021 11:22 AM (IST)

    ఆరు చోట్ల అంతరాయం..

    ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో 6 చోట్ల బ్యాలెట్ పేపర్లు దెబ్బతిన్నట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది పేర్కొన్నారు. 2 చోట్ల బ్యాలెట్ పేపర్లకు చెదలు పట్టాయని.. 4 చోట్ల తడిచాయన్నారు.

  • 19 Sep 2021 11:20 AM (IST)

    ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ.. సాయంత్రం కల్లా ఫలితాలు

    రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది పేర్కొన్నారు. 515 జడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాల్లో కౌంటింగ్ జరుగుతోందన్నారు.

  • 19 Sep 2021 11:10 AM (IST)

    వైఎస్సార్సీపీ అభ్యర్థి విజయం..

    యల్లనూరు మండలం నెంబర్ 1 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి సావిత్రి 687 ఓట్లతో గెలుపు

  • 19 Sep 2021 11:10 AM (IST)

    బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు

    కాకినాడ రూరల్ అరట్లకట్ట లో జేడ్పిటిసి బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు

  • 19 Sep 2021 10:56 AM (IST)

    అనంతపురంలో వైసీపీ జోరు

    యల్లనూరు మండలం నెంబర్ 1 ఎంపీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి సావిత్రి 687 ఓట్లతో గెలుపు

  • 19 Sep 2021 10:48 AM (IST)

    కర్నూలు జిల్లాలో వైసీపీ హవా..

    కర్నూలు జిల్లాలో వెల్లడైన 21 ఎంపీటీసీ ఫలితాలు
    వైసిపి 17
    టిడిపి 3
    స్వతంత్రులు 1

  • 19 Sep 2021 10:45 AM (IST)

    కడప జిల్లాలో ఖాతా తెరిచిన తొలి వైసీపీయేతర అభ్యర్థి..

    కడప జిల్లాలో తొలి వైసీపీయేతర అభ్యర్థి ఖాతా తెరిచాడు. కమలాపురం మండలం పెద్దచెప్పలి ఎంపిటిసి స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి నాగరాజా ఆచారి విజయం. 650 ఓట్ల మెజార్టీతో వైసిపి అభ్యర్థి అయ్యవార అయ్యపై విజయం సాధించారు.

  • 19 Sep 2021 10:41 AM (IST)

    కడప జిల్లా

    కడప జిల్లా రైల్వే కోడూరు టౌన్ 2వ ఎంపిటిసి స్థానంలో వైసీపీ విజయం

  • 19 Sep 2021 10:38 AM (IST)

    కృష్ణాజిల్లా

    కృష్ణాజిల్లాలోని జి.కొండూరు మండలం గంగినేనిపాలెం వైసీపీ అభ్యర్థి పిల్లి ప్రసాద్ 1687 ఓట్ల మెజారిటీతో గెలుపు.

  • 19 Sep 2021 10:38 AM (IST)

    కడప జిల్లా

    కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు-2 ఎంపీటీసీ వైఎస్సార్ సీపీ అభ్యర్థి నాగ చంద్రశేఖర్ రెడ్డి 418 మెజార్టీతో గెలుపు.

  • 19 Sep 2021 10:36 AM (IST)

    చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ బోణి

    చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ బోణి కొట్టింది. కుప్పం మండలం మల్లానూరు ఎంపిటిసి స్థానంలో వైసీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్లతో గెలుపొందారు.

  • 19 Sep 2021 10:32 AM (IST)

    స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలు మిస్..

    నెల్లూరు జిల్లా కావలిలో స్ట్రాంగ్‌ రూమ్‌ తాళాలను మిస్‌ చేశారు అధికారులు. దాంతో ఏం చేయాలో తెలియక స్ట్రాంగ్‌ రూమ్‌ తలుపులను బద్దలుకొట్టారు. దీంతో అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాళాలు పోగొట్టడం ఏంటని ప్రశ్నించారు. తాళాలు లేకపోవడంతో కావలి విశ్వోదయ ఇంజనీరింగ్‌ కాలేజీలో కౌంటింగ్‌ చాలా ఆలస్యంగా మొదలైంది.

  • 19 Sep 2021 10:25 AM (IST)

    బ్యాలెట్లు ఆరబెట్టెందుకు అనుమతి..

    విశాఖపట్నం జిల్లా తూటిపాల, పాపయ్యపాలెంలో బ్యాలెట్ బాక్సుల్లో నీరు చేరడంతో కౌంటింగ్‌ నిలిపివేశారు. అయితే.. బ్యాలెట్లను ఆరపెట్టి కౌంటింగ్ నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో బ్యాలెట్లను ఆరబెడుతున్నట్లు కౌంటింగ్ సిబ్బంది తెలిపారు.

  • 19 Sep 2021 10:20 AM (IST)

    ఇబ్రహీంపట్నంలో ఆసక్తికర పరిణామం..

    కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో ఆసక్తికర పరిణామం.. పోస్టల్ బ్యాలెట్లో ఆరు ఓట్లు పోలయ్యాయి. అయితే.. ఆ ఆరు ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించారు.

  • 19 Sep 2021 10:18 AM (IST)

    తడిచిన బ్యాలెట్ బాక్సులు..

    తెనాలి ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కౌంటింగ్ కేంద్రంలో బ్యాలెట్ బాక్సులు తడిచాయి. కొల్లూరు మండలం ఈపూరు గ్రామానికి చెందిన బ్యాలెట్ బాక్సులు తడిసినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై కౌంటింగ్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాయి.

  • 19 Sep 2021 10:16 AM (IST)

    మోపూరులో వైసీపీ గెలుపు..

    ఏపీలో రెండో ఎంపీటీసీ ఫలితం కూడా వచ్చింది. నెల్లూరు రూరల్ మండలంలోని దక్షిణ మోపూరు గ్రామంలో వైసీపీకి చెందిన అభ్యర్థి గెలుపొందారు. వైసీపీ అభ్యర్థికి 1016 మెజారిటీ వచ్చింది.

  • 19 Sep 2021 10:11 AM (IST)

    తాగునీటి కోసం వాగ్వాదం..

    కడప జిల్లాలోని బద్వేలు ఓట్ల లెక్కింపు కేంద్రంలో తాగునీరు ఏర్పాటు చేయాలని అధికారులతో ఏజెంట్లు వాగ్వివాదానికి దిగారు. కౌంటింగ్ కేంద్రం బయట తాగునీరు ఏర్పాటు చేయడంతో.. లోపల చేయాలంటూ ఏజెంట్లు గొడవకు దిగారు.

  • 19 Sep 2021 10:08 AM (IST)

    తడిసిన బ్యాలెట్ పేపర్లు..

    కడప జిల్లాలోని ముద్దనూరు, కొండాపురం మండలాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల్లో నీరు చేరింది. దీంతో అధికారులు బ్యాలెట్ పేపర్లను పరిశీలిస్తున్నారు.

  • 19 Sep 2021 09:41 AM (IST)

    ఏజెంట్ల మధ్య వాగ్వాదం..

    పామూరు మండలం 5వ ప్రాదేశిక ఎంపిటిసి ఎలక్షన్ కౌంటింగ్ విషయంలో వైసిపి, సిపిఎం ఏజెంట్ల మధ్య వాగ్వివాదం జరిగింది. బ్యాలెట్ బాక్స్ టేబుల్ పైన పెట్టి తర్వాత కింద పెట్టడంపై సిపియం ఏజెంట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. బాక్స్‌ను తిరిగి టేబుల్ పై పెట్టాలంటూ సిపిఎం ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు.

  • 19 Sep 2021 09:41 AM (IST)

    బ్యాలెట్ బ్యాక్స్‌లకు చెదలు

    శ్రీకాకుళం జిల్లా బ్యాలెట్ బ్యాక్స్‌లకు చెదలు పట్టాయి. సరుబుజ్జిలి మండలం షలంతరి ఎంపీటీసీ స్థానానికి సంబంధించిన పోలింగ్ బూత్‌, ఆమదాలవలస నియోజకవర్గం పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్స్‌కు చెదలు పట్టాయి. దీనితో ఆ జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బీ లాఠకర్ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం జేసీ సుమిత్ కుమార్ అద్వర్యంలో చెదపట్టిన బూత్‌లోని బ్యాలెట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.

  • 19 Sep 2021 09:36 AM (IST)

    కనిగిరి కౌంటింగ్‌ కేంద్రంలో ఏజెంట్ల మధ్య వాగ్వివాదం…

    పామూరు మండలం 5వ ప్రాదేశిక ఎంపిటిసి ఎలక్షన్ కౌంటింగ్ విషయంలో వైసిపి, సిపిఎం ఏజెంట్ల మధ్య వాగ్వివాదం జరిగింది. బ్యాలెట్ బాక్స్ టేబుల్ పైన పెట్టి తర్వాత కింద పెట్టడంపై సిపియం ఏజెంట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. బాక్స్‌ను తిరిగి టేబుల్ పై పెట్టాలంటూ సిపిఎం ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు.

  • 19 Sep 2021 09:31 AM (IST)

    చెదలు పట్టిన బ్యాలెట్ బ్యాక్స్‌లు

    శ్రీకాకుళం జిల్లా బ్యాలెట్ బ్యాక్స్‌లకు చెదలు పట్టాయి. సరుబుజ్జిలి మండలం షలంతరి ఎంపీటీసీ స్థానానికి సంబంధించిన పోలింగ్ బూత్‌, ఆమదాలవలస నియోజకవర్గం పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ బాక్స్‌కు చెదలు పట్టాయి. దీనితో ఆ జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బీ లాఠకర్ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం జేసీ సుమిత్ కుమార్ అద్వర్యంలో చెదపట్టిన బూత్‌లోని బ్యాలెట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.

  • 19 Sep 2021 09:24 AM (IST)

    బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు.. కలెక్టర్‌కు సమాచారం..

    విశాఖపట్నం.. నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం బ్యాలెట్ బాక్స్‌లో నీళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించి.. కలెక్టరుకు సమాచారం అందించారు. తదుపరి ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారులు తెలిపారు.

  • 19 Sep 2021 09:19 AM (IST)

    బ్యాలెట్ బాక్సుల్లో నీళ్లు..

    విశాఖపట్నం.. నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం బ్యాలెట్ బాక్స్‌లో నీళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పాకలపాడు, మాకవరపాలెం మండలం, తూటిపాల, పాపయ్యపాలెం బ్యాలెట్ బాక్సుల్లోకి నీరు వెళ్లడంతో బ్యాలెట్ పేపర్లు తడిచిపోయాయి.

  • 19 Sep 2021 09:17 AM (IST)

    తడిచిన బ్యాలెట్ పేపర్లు..

    గుంటూరు జిల్లా తాడికొండ మండలం బేజాత్‌పురం, రావెల, ఎంపీటీసి స్థానాల్లో ఓట్ల లెక్కింపుపై సందిగ్దత కొనసాగుతోంది. ఓ బ్యాలెట్ బాక్స్‌లోబ్యాలెట్ పేపర్‌లు తడిచిపోయాయి. దీంతో కౌంటింగ్‌ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

Follow us on