AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Reddy: తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు కుప్పంలో గెలవరు.. మంత్రి పెద్దిరెడ్డి షాకింగ్ కామెంట్స్.. 

Peddi Reddy Ramachandra Reddy  on Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుప్పం

Peddi Reddy: తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు కుప్పంలో గెలవరు.. మంత్రి పెద్దిరెడ్డి షాకింగ్ కామెంట్స్.. 
Peddireddy
Shaik Madar Saheb
|

Updated on: Jan 06, 2022 | 5:52 PM

Share

Peddi Reddy Ramachandra Reddy  on Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కుప్పం పర్యటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఎన్నికలప్పుడే చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి వచ్చే వారని తెలిపారు. ఇప్పుడు గ్రామాలు కూడా తిరగాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారన్నారు. 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఇంకా కుప్పంలో చంద్రబాబు పర్యటించని గ్రామాలు చాలా ఉన్నాయన్నారు. సీఎం జగన్ ఆధ్వర్యంలో మేమంతా గ్రామాలు తిరుగుతున్నామని వివరించారు. కేవలం ఒడిపోతామన్న భయంతో, అభద్రతా భావంతోనే చంద్రబాబు 3 రోజుల కుప్పం పర్యటన అంటూ ఎద్దెవా చేశారు.చంద్రబాబు కుప్పం బాట పట్టడం తమ నైతిక విజయం అంటూ పెద్దరెడ్డి తెలిపారు. తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు కుప్పంలో గెలవడని కుప్పం ప్రజలకు తెలుసన్నారు. ఖచ్చితంగా కుప్పంలో గెలిచే పరిస్థితి లేకుండా చూస్తామంటూ పెద్దిరెడ్డి వివరించారు.

14 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా ఉన్నా జగన్ సీఎం అయ్యేంత వరకు రాష్ట్రంలో అర్హులకు ఇల్లు, పెన్షన్లు అందలేదంటూ పెద్దిరెడ్డి పేర్కొన్నారు. 14ఏళ్ళపాటు సీఎంగా ఉండి కూడా ఏ పని చేశానో చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నారంటూ విమర్శించారు. నిరాశ, నిస్పృహతోనే సీఎం జగన్ పై చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పేదరికం కొలమానంగా చూసి అర్హులకు పథకాలు అందిస్తున్నామని పెద్దిరెడ్డి వివరించారు.