AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: మిషన్ అమరావతి.. డిసెంబర్ 1 నుంచి రాజధాని నిర్మాణం.. నాలుగేళ్లు టార్గెట్

ఎటు చూసినా పచ్చదనం..చుట్టూ పరవళ్లు తొక్కే జలవనరులు ఉండేలా రాజధాని నిర్మాణం ఉండాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. అందుకోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అమరావతిలో దట్టంగా పేరుకుపోయిన ముళ్ల కంపలు, చెత్తా చెదారాన్ని తొలగించే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది.

AP News: మిషన్ అమరావతి.. డిసెంబర్ 1 నుంచి రాజధాని నిర్మాణం.. నాలుగేళ్లు టార్గెట్
Minister Narayana
Ravi Kiran
|

Updated on: Aug 25, 2024 | 7:42 AM

Share

ఎటు చూసినా పచ్చదనం..చుట్టూ పరవళ్లు తొక్కే జలవనరులు ఉండేలా రాజధాని నిర్మాణం ఉండాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. అందుకోసం భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అమరావతిలో దట్టంగా పేరుకుపోయిన ముళ్ల కంపలు, చెత్తా చెదారాన్ని తొలగించే ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఆ పనులు పూర్తయిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభమవుతాయి. ఆ లోపే అమరావతిని ఆకుపచ్చగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది..ప్రభుత్వం.

రాజధాని అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది.. ఏపీ ప్రభుత్వం. ఉద్యానవనాలు, జలాశయాలతో కళకళలాడే విధంగా నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున పార్కుల నిర్మాణం జరుగుతోంది. తద్వారా రాజధాని ప్రాంతంలో గ్రీనరీతో పాటు ఆక్సిజన్‌ శాతం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకోసం పెద్ద ఎత్తున ఉద్యానవనాలు నిర్మించేందుకు సన్నద్ధమైంది.

ప్రపంచంలో టాప్‌-5 నగరాల్లో ఒకటిగా అమరావతిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామన్నారు మంత్రి నారాయణ. అలాగే రాజధాని ప్రాంతంలో పచ్చదనాన్ని పెంచేందుకు నాలుగు పార్కులు నిర్మిస్తున్నామన్నారు. శాఖమూరులో 300 ఎకరాల విస్తీర్ణంలో సెంట్రల్‌ పార్క్‌తో పాటు రిజర్వాయర్‌ నిర్మిస్తున్నామని అలాగే అనంతవరం, మల్కాపురంలో పార్క్‌ల నిర్మాణం చేపట్టామని వివరించారు. ఆరు నెలల్లోనే వీటి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.

మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణంపై శరవేగంగా అడుగులు వేస్తోంది.. కూటమి ప్రభుత్వం. వైసీపీ పాలనలో పడకేసిన రాజధాని పనులను..తిరిగి గాడిన పెట్టే చర్యలను చేపట్టింది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు జరుగుతుండగా..డిసెంబర్‌ 1 నుంచి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని ప్రకటించారు మంత్రి నారాయణ. 60 వేల కోట్ల రూపాయల ఖర్చుతో చేపడుతున్న నిర్మాణాలను..నాలుగేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మధ్యలో నిలిచిపోయిన నిర్మాణాలను ముందుగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది..ప్రభుత్వం.