Mekapathi Goutham Reddy: గౌతమ్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి..
Mekapati Goutham Reddy's Funeral: ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. నెల్లూరులోని ఆయన ఇంటినుంచి బుధవారం ఉదయం ప్రారంభమైన అంతిమయాత్ర
Mekapati Goutham Reddy’s Funeral: ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. నెల్లూరులోని ఆయన ఇంటినుంచి బుధవారం ఉదయం ప్రారంభమైన అంతిమయాత్ర ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్ రెడ్డి కళాశాల వరకు సాగింది. గౌతమ్ రెడ్డి (Goutham Reddy) ని కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులు, నేతలు, కుటుంబసభ్యుల అశ్రునయనాల మధ్య 12 గంటలకు ఆయన కుమారుడు కృష్ణార్జున్ రెడ్డి.. చితికి నిప్పంటించారు. ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. గౌతమ్ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దంపతులు, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ దంపతులు గౌతమ్ రెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, నేతలు గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి కన్నీంటిపర్యంతమయ్యారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. సోమవారం ఉదయం అనారోగ్యానికి గురికావడంతో కుటుంబసభ్యులు హుటా హుటిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు అత్యవసరంగా ఐసీయూకు తరలించి చికిత్స అందించారు.. అక్కడ చికిత్సపొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన హఠాన్మరణంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Also Read: