Botsa Satyanarayana: చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి బొత్స

|

Aug 29, 2021 | 9:54 PM

విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటిస్తే.. రెండేళ్ళుగా ప్రతిపక్ష టీడీపీ ఎందుకు అడ్డుపడుతుందో చెప్పాలని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana: చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి బొత్స
Follow us on

Visakhapatnam: విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటిస్తే.. రెండేళ్ళుగా ప్రతిపక్ష టీడీపీ ఎందుకు అడ్డుపడుతుందో చెప్పాలని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు. విశాఖపట్నంలో ఏ ఒక్క కార్యాలయం కూడా కట్టడానికి వీల్లేదని, రిట్ పిటిషన్లు వేసి, ఏ ఒక్క కార్యాలయం విశాఖ రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. అంతేకాదు, విశాఖలో ఏ నిర్మాణం జరగకుండా, ఉత్తరాంధ్ర అభివృద్ధికి నంబర్ 1 శత్రువులుగా నిలబడింది చంద్రబాబు కాదా అని మంత్రి ప్రశ్నించారు.

విశాఖ రాజధానిని అడ్డుపడటం వల్ల మొత్తంగా ఉత్తరాంధ్రకు జరిగిన అన్యాయానికి క్షమాపణ చెప్పకుండా ఏ మొహం పెట్టుకుని చర్చా వేదికలు పెడుతున్నారని బొత్స టీడీపీ నేతల్ని అడిగారు. విజయనగరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక – పోరాటం చేస్తాం.. అంటూ.. టీడీపీ చేస్తున్న హడావుడి చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని ఆయన ఎద్దేవా చేశారు.

అశోక్ గజపతిరాజు.. గత ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా బీజేపీ ప్రభుత్వంలో, మోదీ కేబినెట్‌లో కేంద్రమంత్రిగా ఉన్నారని ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఆయన చేసిందేంటో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయం మీ కనుసన్నల్లోనే జరిగిందా కాదా? మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి? అని అశోక్ గజపతిరాజుని బొత్స ప్రశ్నించారు.

Read also: Tank Bund: మరింత హాయిగా హైదరాబాద్ ట్యాంక్ బండ్.. ఆర్నెళ్లుగా చేపట్టిన బ్యూటిఫికేషన్.. నో ట్రాఫిక్‌తో ఫుల్ హ్యాపీ