ఏపీ ప్రజానీకం ఎదురుచూస్తోన్న కలల ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌.. మే 3న సీఎం జగన్ శంకుస్థాపన.. ఆ జిల్లాకు మహర్ధశ..!

|

Apr 21, 2023 | 8:06 AM

శంకుస్థాపన చేసిన తర్వాత 24 నుంచి 30 నెలలలోపు నిర్మాణ పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్మాణ బాధ్యతలను జీఎంఆర్‌ సంస్థ తీసుకుంటోంది.

ఏపీ ప్రజానీకం ఎదురుచూస్తోన్న కలల ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌.. మే 3న సీఎం జగన్ శంకుస్థాపన.. ఆ జిల్లాకు మహర్ధశ..!
Botsa Satyanarayana Review
Follow us on

విజయనగరంలో అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ కల సాకారం కానుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ శంఖుస్థాపనపై మంత్రి బొత్స సమీక్షా సమవేశం నిర్వహించారు. సుదీర్ఘకాలంగా ఏపీ ప్రజానీకం ఎదురుచూస్తోన్న భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ కి మే3న శంకుస్థాపన చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిర్‌పోర్ట్‌ శంకుస్థాపనకు డేట్స్‌ ఖరారు కావడంతో మంత్రి బొత్స సత్యానారాయణ విజయనగరం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించి….ఎయిర్‌పోర్ట్‌ శంకుస్థాపనకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేశారు. చంద్రబాబు హయాంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కి ప్రయత్నాలు జరిగాయి. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ సారథ్యంలో మే3వ తేదీన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ కల సాకారం కానుంది.

విశాఖపట్నానికి ఈశాన్యంగా 40 కిలోమీటర్ల దూరంలో నిర్మించతలపెట్టిన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సర్వసన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ కల సాకారం చేసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సంసిద్ధమౌతోంది. అందులో భాగంగానే విజయనగరం కలెక్టరేట్ లో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు బొత్స సత్యనారాయణ. శంకుస్థాపన చేసిన తర్వాత 24 నుంచి 30 నెలలలోపు నిర్మాణ పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్మాణ బాధ్యతలను జీఎంఆర్‌ సంస్థ తీసుకుంటోంది.

ఏపీ ప్రజల అవసరాలకు అనుగుణంగా విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇక విశాఖలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌ ఆర్మీకి చెందినది కావడంతో… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ కోసం చంద్రబాబు హయాంలో కొంత ప్రయత్నం జరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..