Solar Vehicle: ఏపీ వ్యక్తి వినూత్న సృష్టి.. పెట్రోల్, విద్యుత్ లేకుండా సూర్య రశ్మితో నడిచే కారు.. పైసా ఖర్చు లేకుండా షికారు

|

Dec 26, 2022 | 3:13 PM

విద్యుత్ రేట్లు కూడా భారీగా పెరిగిన ఈ సమయంలో పైసా ఖర్చు లేకుండా సోలార్ సహాయంతో వాహనాలను నడిపే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు తెనాలికి చెందిన ఒక కార్మికుడు..

Solar Vehicle: ఏపీ వ్యక్తి వినూత్న సృష్టి.. పెట్రోల్, విద్యుత్ లేకుండా సూర్య రశ్మితో నడిచే కారు.. పైసా ఖర్చు లేకుండా షికారు
Solar Vehicle
Follow us on

రోజు రోజుకీ పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ కు బదులుగా ప్రత్యామ్నాయ వస్తువులపై దృష్టి సారిస్తున్నారు.      ఒకవైపు పెట్రోల్ రేట్లు భారీగా పెరిగాయని విద్యుత్ తో నడిచే వాహనాల వైపుకి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రికల్  బైక్స్, వాహనాలను రూపొందిస్తూ వాహనదారులను ఆకట్టుకుంటున్నారు. అయితే విద్యుత్ రేట్లు కూడా భారీగా పెరిగిన ఈ సమయంలో పైసా ఖర్చు లేకుండా సోలార్ సహాయంతో వాహనాలను నడిపే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు తెనాలికి చెందిన ఒక కార్మికుడు.. పెట్రోల్, విద్యుత్ అవసరం లేకుండా కేవలం సూర్య రశ్మి సహాయంతో కారులో హాయిగా షికారుకు వెళ్ళవచ్చు అంటున్నారు

అంతేకాదు సోలార్ ఎనర్జీతో నడిచే ఓ కారుని తయారు చేశారు. కారుని తయారు చేసింది వెంకట్ నారాయణ ఒక కార్మికుడు. ఈయన మదిలో నుంచి మెదిలింది ఈ సోలార్ కారు. బ్యాటరీ కారు తీసుకుని దానికి సోలార్ ప్యానల్స్ ని బిగించి సోలార్ కారుగా మార్చేశారు. ఎండ ఉన్నంత సేపు కారు పైసా ఖర్చు లేకుండా నడుస్తుంది, సూర్య రష్మి తగ్గిపోగానే వెంటనే బ్యాటరీ నుంచి పవర్ తీసుకుని కారు నడుస్తుంది. సుమారు 150 కిలోమీటర్ల వరకు పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేయవచ్చునని అంటున్నారు వెంకటనారాయణ. ఇద్దరు ప్రయాణించే ఈ చిన్న కారు సెకండ్ హ్యాండ్ లో తీసుకొని తానే సొంతగా సోలార్ ప్యానెల్ బిగించి ప్రయాణిస్తున్నానని కారు నడిపించి చూపించారు.

Reporter: Nagaraju

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..