AP Intermediate Board: జూనియర్ కాలేజీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ప్రొవిజినల్ అఫిలియేషన్, అదనపు సెక్షన్ల మంజూరు కోసం దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ మేరకు ఇంటర్‌బోర్డు సెక్రెటరీ వి.రామకృష్ణ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆన్‌లైన్ ద్వారా ఈ దరఖాస్తు ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, ఎలాంటి అపరాద రుసుము లేకుండా ప్రైవేటు కాలేజీలు జూన్ 30 వరకు ప్రొవిజినల్ అఫిలియేషన్, అదనపు సెక్షన్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఇక రూ.1000 ఆలస్య రుసుముతో జూలై 7వ తేదీ వరకు, రూ.3,000 ఆలస్య రుసుముతో జూలై 14వ తేదీ వరకు, రూ.5,000 ఆలస్య రుసుముతో జూలై 21వ తేదీ వరకు, రూ.10,000 ఆలస్య రుసుముతో జూలై 28వ తేదీ వరకు, రూ.15,000 ఆలస్య రుసుముతో ఆగస్టు 4వ తేదీ వరకు, రూ.20,000 ఆలస్య రుసుముతో ఆగస్టు 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా, కరోనా నేపథ్యంలో అఫిలియేషన్ కోసం ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని ఇంటర్‌బోర్డు సెక్రెటరీ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Also read:
Viral Video: కరోనా మంత్రాలతో విచిత్ర వివాహం.. వీడియో చూస్తే అసలు నవ్వాపుకోలేరు.!