Andhra Pradesh: ఏపీ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఆ జిల్లానే ఫస్ట్ ప్లేస్
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు జూన్ 13న సాయంత్రం ఈ ఫలితాలను విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు జూన్ 13న సాయంత్రం ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 1 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 56,767 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే సెకండ్ ఇయర్‌లో 42,931 మంది ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో బాలురు 74 శాతం, బాలికలు 8.56 శాతం, సెకండ్ ఇయర్‌లో బాలురు 81.99 శాతం, బాలికలు 86.46 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాల్లో పశ్చిమ గోదావరి జిల్లా 97.32 స్థానంలో మొదటి స్థానంలో ఉండగా.. 75.95 శాతంతో కడప జిల్లా చివరి స్థానంలో ఉంది. అలాగే రీ వెరిఫికేషన్ కోసం జూన్ 23 ఆఖరి తేదిగా అధికారులు ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
