Andhrapradesh: ఆ జిల్లాల్లో పదునైన ఆయుధాలపై మరో 6 నెలలు నిషేధం పొడిగింపు

|

Jul 15, 2021 | 7:22 AM

రాయలసీమ జిల్లాలు సహా కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పదును కలిగిన ఆయుధాలపై నిషేధాన్ని పొడిగిస్తూ ఏపీ హోంశాఖ...

Andhrapradesh: ఆ జిల్లాల్లో పదునైన ఆయుధాలపై మరో 6 నెలలు నిషేధం పొడిగింపు
AP Govt
Follow us on

రాయలసీమ జిల్లాలు సహా కోస్తాంధ్రలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పదును కలిగిన ఆయుధాలపై నిషేధాన్ని పొడిగిస్తూ ఏపీ హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయుధాల చట్టం 1959లోని సెక్షన్ 4 ప్రకారం రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు సహా ఆంధ్రప్రాంతంలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పదునైన ఆయుధాలపై నిషేధం విధిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. జులై 15వ తేదీ నుంచి ఆరు నెలల పాటు ఈ నిషేధాన్ని పొడిగిస్తూ హోంశాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈమేరకు హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఆదేశాలు జారీ చేశారు.

మాస్క్ లేని వారిని అనుమతిస్తే.. రూ.25 వేల వరకు జరిమానా

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మాస్కులు లేకుండా వాణిజ్య సముదాయాలు, షాపుల్లోకి అనుమతిస్తే భారీగా జరిమానా విధించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. కొవిడ్ ప్రోటోకాల్ పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే.. సదరు వాణిజ్య సంస్థలు, షాపుల యాజమాన్యానికి రూ.10 వేల నుంచి రూ.25 వేల జరిమానా విధించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు లేకుండా తిరిగే వ్యక్తులకు రూ.100 జరిమానా విధించాల్సిందిగా సూచించింది. వైద్యారోగ్యశాఖ అధికారులతో పాటు ఎస్‌ఐ లేదా ఆపై అధికారికి కూడా ఫైన్ వసూలు చేసే అధికారాలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అన్ని జిల్లాల్లోనూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్ విధిస్తున్నట్టు సర్కార్ పేర్కొంది. మరోవైపు ఈ నెల 21 తేదీ వరకూ రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read: జగన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అమలుకు జీవో జారీ..

అనంతపురంలో విషాదం.. పాము కాటుకు 8 ఏళ్ల చిన్నారి మృతి.. కన్నీరు పెట్టుకున్న టీచర్లు..