ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జనసేన పార్టీ ఊరట లభించింది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకే గ్లాస్ గుర్తు కేటాయిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది. డాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీ వ్యవస్థాపక, అధ్యక్షులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. గ్లాస్ గుర్తును జనసేనకే కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గుర్తు కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది.
గ్లాస్ గుర్తు ఫ్రీ సింబల్ జాబితాలో ఉంటే.. ఏపీలో అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేసినా, మిగతా స్థానాల్లో ఫ్రీ సింబల్‌పై ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉంటుంది. అదే జరిగితే జనసేనకు వచ్చే ఓట్లకు గండి అవకాశం ఉంది. ఈ మధ్యే గాజుగ్లాస్ జనసేనకు కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఫ్రీ సింబల్‌గా ప్రకటించడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది జనసేన.
అయితే గాజు గ్లాస్ తమకు కావాలంటోంది రాష్ట్రియ ప్రజా కాంగ్రెస్. దీనిపై గత ఏడాది మే నెలలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై ఇరువురి వాదనలు ఉన్న ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా గ్లాస్ గుర్తును జనసేన పార్టీకే కేటాయిస్తున్నట్లు ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…