AP High Court: ఏపీ హైకోర్టు సంచలనాత్మక తీర్పు.. 8 మంది ఐఏఎస్‌లకు జైలుశిక్ష..

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతో ఎనిమిది ఐఏఎస్‌ అధికారులు..

AP High Court: ఏపీ హైకోర్టు సంచలనాత్మక తీర్పు.. 8 మంది ఐఏఎస్‌లకు జైలుశిక్ష..
Ap High Court

Updated on: Mar 31, 2022 | 12:51 PM

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP High Court) సంచలనాత్మక తీర్పునిచ్చింది. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ఎనిమిది మంది ఐఏఎస్‌లకు(IAS officers) జైలు శిక్ష విధిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. కోర్టు తీర్పుతో ఎనిమిది ఐఏఎస్‌ అధికారులు హైకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. పొరపాటు అయ్యిందని.. భవిష్యతలో ఇలాంటిది పునావృతం కాకుండా చూస్తామని విన్నవించుకున్నారు. ఐఏఎస్‌ల క్షమాపణలను అంగీకరించిన హైకోర్టు.. జైలుశిక్షకు బదులుగా ఏడాది పాటు ప్రతినెలలో ఒకరోజు సంక్షేమ హాస్టల్‌కు వెళ్లి సేవ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఏడాది పాటు సంక్షేమ హాస్టల్‌లో ఒక్కపూట భోజనం పెట్టాలని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు సీనియర్ ఐఏఎస్‌లు విజయ్‌కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్‌, శ్రీలక్ష్మి, గిరిజాశంకర్‌, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎంఎం నాయక్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. కోర్టు ధిక్కరణ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధానంగా గ్రామ సచివాలయ భవనాలను హైస్కూల్‌ ప్రాంగణాలు, ఇతర ప్రభుత్వ స్థలాల్లో నిర్మించడాన్ని హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. వాటిని వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేసింది.

కోర్టు ఆదేశాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు ధిక్కరణ కేసును ఇనీషియేట్ చేసిన హైకోర్టు గురువారం విచారణ ప్రారంభించింది. విచారణ అనంతరం ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం… రాష్ట్రంలోని ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు రెండు వారాల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

ఇవి కూడా చదవండి: Gold Coins: పొలంలో బంగారు నిధి.. మరో మహిళతో రవితేజ జంప్.. ఇదో గోల్డ్ కాయిన్ మిస్టరీ..

Srisailam: శ్రీశైలంలో అర్ధరాత్రి ఉద్రిక్తత.. కన్నడ భక్తుడిపై హోటల్ యజమాని దాడి.. ఘర్షణ..