AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ద‌ర్శన టోకెన్లు వాయిదా.. మళ్ళీ ఎప్పటి నుంచి TTD జారీ చేయనున్నదంటే

Tirumala: శ్రీవారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమల తిరుపతి(Tirupati) క్షేత్రానికి వస్తారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఈ నేపధ్యంలో వృద్దులకు, దివ్యాంగులకు..

Tirumala: వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ద‌ర్శన టోకెన్లు వాయిదా.. మళ్ళీ ఎప్పటి నుంచి TTD జారీ చేయనున్నదంటే
Surya Kala
| Edited By: |

Updated on: Mar 31, 2022 | 2:41 PM

Share

Tirumala: శ్రీవారిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమల తిరుపతి(Tirupati) క్షేత్రానికి వస్తారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఈ నేపధ్యంలో వృద్దులకు, దివ్యాంగులకు స్వామివారిని దర్శించుకోవడానికి టీటీడీ(TTD) ప్రతేక దర్శన సదుపాయాలను కల్పించింది. అయితే ఈ ప్రత్యేక దర్శనాలను కరోనా(Corona) మహమ్మారి నేపథ్యంలో 2020 మార్చి 20వ తేదీ నుంచి నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కోవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో కరోనా నిబంధనలను పాటిస్తూ… స్వామివారి దర్శనాలను, సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తున్నారు. తాజాగా శ్రీవారిని దర్శించుకోవడానికి వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలను పునరుద్దరించాలని టీటీడీ నిర్ణయించుకుంది. ఈ మేరకు స్పెషల్ దర్శన టికెట్లను జారీ చేయడానికి రంగం సిద్ధం చేసింది.. కానీ ఈరోజు సాఫ్ట్‌వేర్‌లో స‌మ‌స్య ఏర్పడడంతో ఈటోకెన్ల జారీని ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేసినట్లు టిటిడీ అధికారులు ప్రకటించారు.

ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 11 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు స్పెషల్ దర్శన టోకెన్లను ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నామని తెలిపింది. సాఫ్ట్‌వేర్‌లో స‌మ‌స్యతో ఏప్రిల్ 8కి టోకెన్ల జారీ వాయిదా వేసినట్లు పేర్కొంది. ఈ స్పెషల్ దర్శన టోకెన్లను రోజుకు వెయ్యి చొప్పున జారీ చేయనున్నామని ప్రకటించింది. ప్రతి రోజూ ఉద‌యం 10 గంట‌లకు, శుక్రవారం మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు ద‌ర్శనాల‌కు అనుమ‌తిని ఇవ్వనున్నారు. ఇక మరోవైపు ఈరోజు జారీ చేయనున్న అంగ ప్రదక్షణ టోకెన్లను కూడా పరిపాలనా కారణాలతో వాయిదా వేసినట్లు టిటిడీ ప్రకటించింది. ఈ అంగ ప్రదక్షణ టోకెన్లను ఏప్రిల్ 2వ తేదీ ఉగాది నుంచి ఇవ్వనున్నామని పేర్కొంది.

Also Read: Marriage Function: మొదలు కానున్న పెళ్లిళ్ల సీజన్.. 40 లక్షల వివాహలు..రూ. 5లక్షల కోట్ల వ్యాపారం జరగనున్నట్లు అంచనా

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!