AP Breaking News: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

| Edited By: Ravi Kiran

Sep 16, 2021 | 2:36 PM

AP MPTC ZPTC Elections: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను హైకోర్టు సమర్థించింది. ఎన్నికల కౌంటింగ్‌కు ఉన్నత న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

AP Breaking News: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
Ap High Court
Follow us on

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను హైకోర్టు సమర్థించింది. ఎన్నికల కౌంటింగ్‌కు ఉన్నత న్యాయస్థానం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నిలిచిపోయిన కౌనటింగ్ ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.  సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను తోసిపుచ్చిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

ఏప్రిల్‌ 1న ఎస్‌ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఏప్రిల్‌ 8న జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి మే 21న తీర్పు ఇచ్చారు. పోలింగ్‌ డేట్‌కి నాలుగు వారాలకు ముందు ఎన్నికల కోడ్‌ విధించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ ఉందని సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఎస్ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన మరికొందరు అభ్యర్థులు అప్పీళ్లు దాఖలు చేశారు. విచారణలో ఎస్‌ఈసీ అప్పీల్‌పై నిర్ణయాన్ని వెల్లడించేంతవరకు పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించవద్దని కోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో, అక్కడ నుంచి ఎన్నికలు నిర్వహించేందుకు తాజా నోటిఫికేషన్‌ ఇవ్వాలంటూ మే 21న హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ అప్పీల్‌‌పై మరోసారి విచారణకు రాగా తీర్పు రిజర్వ్ చేశారు. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది.

Also Read: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. అతడి అరెస్టుకు రంగం సిద్దం..!

Cyber Crime Police: పోర్న్ చూస్తున్నారా..? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే.