ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక ఆదేశాలు..

ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడికేసులో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్‌ 19న దాడి జరిగింది. ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల వివరాలను సేకరిస్తున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు.

ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట.. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కీలక ఆదేశాలు..
Ap High Court Tdp Office
Follow us

|

Updated on: Jul 11, 2024 | 1:22 PM

ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడికేసులో వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్‌ 19న దాడి జరిగింది. ఆ కేసుకు సంబంధించిన విచారణ ఇప్పుడు వేగంగా జరుగుతోంది. నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు నిందితుల వివరాలను సేకరిస్తున్నారు. విధ్వంసానికి పాల్పడిన వారిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఇప్పటికే ఐదుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. అయితే గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మొత్తం 56 మంది నిందితులు ఉన్నట్లు గుర్తించామన్నారు.

ఈ ఘటనలో ప్రధాన నిందితులుగా దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, కార్పొరేటర్లు ఆరవ సత్యం (సత్యనారాయణ), అంబేద్కర్‎తో సహా మరి కొందరిని గుర్తించించామన్నారు. త్వరలో మిగిలిన వారిని అరెస్టు చేసేందుకు రంగం సిద్దం చేసినట్లు తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు. ఈ తరుణంలోనే ముందస్తు బెయిల్ కు దాఖలు చేసుకున్నారు వైసీపీ ముఖ్యనేతలు. వీరి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ జరిపిన ఏపీ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, ఆర్కే, సజ్జల రామకృష్ణా రెడ్డి, దేవినేని అవినాష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగిరమేష్‌కు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అలాగే ఈ కేసులో తదుపరి విచారణ జూలై 16కు వాయిదా వేసింది. ఈ క్రమంలో ఈ నెల 16 వరకు అరెస్ట్ చేయొద్దని తెలిపింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినట్లు పిటిషన్ వేశారు టీడీపీ నాయకులు. ఆ పిటిషన్ పై ఇప్పటి వరకూ జరిపిన విచారణలో వైసీపీ కీలక నేతలకు ఊరట లభించినట్లయింది. అయితే దీనిపై భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓ మై నెట్‏ఫ్లిక్సు.. టాలీవుడ్ హీరోలకు తెలుగు డబ్బింగ్ ఏంట్రా..
ఓ మై నెట్‏ఫ్లిక్సు.. టాలీవుడ్ హీరోలకు తెలుగు డబ్బింగ్ ఏంట్రా..
బడ్జెట్ ప్రసంగం ఇక్కడ లైవ్ వీక్షించండి
బడ్జెట్ ప్రసంగం ఇక్కడ లైవ్ వీక్షించండి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. లైవ్ వీడియో
బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఆమె పేరిట రికార్డులెన్నో..
బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. ఆమె పేరిట రికార్డులెన్నో..
చారిత్రాత్మకంగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు.. అంత స్పెషల్ ఏంటంటే?
చారిత్రాత్మకంగా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు.. అంత స్పెషల్ ఏంటంటే?
గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన ఐఏఎస్‌ అధికారి భార్య.. తాజాగా
గ్యాంగ్‌స్టర్‌తో వెళ్లిపోయిన ఐఏఎస్‌ అధికారి భార్య.. తాజాగా
ఆ పాట కోసం సీతారామ శాస్త్రిని పబ్‏కి తీసుకెళ్లిన డైరెక్టర్..
ఆ పాట కోసం సీతారామ శాస్త్రిని పబ్‏కి తీసుకెళ్లిన డైరెక్టర్..
మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు
మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు
జీతభత్యాలు పొందే వ్యక్తులకు శుభవార్త? ఆర్థిక సర్వేలో కీలక అంశాలు
జీతభత్యాలు పొందే వ్యక్తులకు శుభవార్త? ఆర్థిక సర్వేలో కీలక అంశాలు
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే