Amaravati NTR Statue: స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం.. ఎన్ని అడుగులంటే..

అమరావతి నగర అభివృద్ధిలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే మరో పని చేయాలని నిర్ణయించింది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజకీయ నాయకుడు, దిగ్గజ నటుడు స్వర్గియ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్మారకంగా భారీ విగ్రహాన్ని నీరుకొండ గ్రామం వద్ద ఏర్పాటు చేయనుంది.

Amaravati NTR Statue: స్టాట్యూ ఆఫ్ యూనిటీ తరహాలో అమరావతిలో ఎన్టీఆర్ భారీ విగ్రహం.. ఎన్ని అడుగులంటే..
Amaravati Ntr Statue

Edited By:

Updated on: Apr 22, 2025 | 5:01 PM

అమరావతి నగర అభివృద్ధిలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోయే మరో పని చేయాలని నిర్ణయించింది. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజకీయ నాయకుడు, దిగ్గజ నటుడు స్వర్గియ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్మారకంగా భారీ విగ్రహాన్ని నీరుకొండ గ్రామం వద్ద ఏర్పాటు చేయనుంది. ఈ భారీ విగ్రహ నిర్మాణానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. అమరావతిలో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ  తరహాలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్ర సాంస్కృతిక విలువలు, వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

టెండర్ల ప్రక్రియ – సాంకేతిక పద్ధతుల్లో ముందడుగు

ఈ విగ్రహ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR) తో ఆసక్తి కల వారి RFP (Request for Proposal), కన్సల్టెంట్స్ నియామకానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ టెండర్లను పిలిచింది.

టెండర్లకు చివరి రోజు, టెక్నికల్ బిడ్లు తెరవబడే తేదీ: మే 14

గుజరాత్ పర్యటన – స్టాట్యూ ఆఫ్ యూనిటీ సందర్శన..

ఈ ప్రాజెక్టు రూపకల్పనకు మౌలిక ప్రేరణను పొందేందుకు, మంత్రి పి. నారాయణ అధికారులతో కలిసి గుజరాత్‌లోని Statue of Unity ప్రాంతాన్ని సందర్శించారు. విగ్రహ నిర్మాణ పద్ధతులు, పర్యాటక మౌలిక సదుపాయాలు లాంటి అంశాలపై అధ్యయనం చేసి, అమరావతిలో అన్వయించడానికి కీలకమైన సమాచారం సేకరించారు.

విగ్రహ లక్షణాలు

ఎత్తు: సుమారు 195 అడుగులు

ప్రాంతం: నీరుకొండ, విస్తృత ప్రదేశం, పర్యాటక ఆకర్షణకు అనుగుణంగా అభివృద్ధి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..