Andhra Pradesh: నేడు మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం.. ఆ నివేదిక ఇవ్వాల్సిందే అంటున్న ఉద్యోగులు..

|

Nov 12, 2021 | 8:42 AM

Andhra Pradesh: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి నేడు మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని 5వ బ్లాక్‌లో..

Andhra Pradesh: నేడు మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం.. ఆ నివేదిక ఇవ్వాల్సిందే అంటున్న ఉద్యోగులు..
Employees
Follow us on

Andhra Pradesh: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించి నేడు మరోసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరుగనుంది. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని 5వ బ్లాక్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి హాజరు కావాలని ప్రభుత్వం నుంచి 13 ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది. ఈ సమావేశంలో పీఆర్సీ సహా ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక పరమైన అంశాలపై చర్చించనున్నారు. ఇక ఈ సమావేశంలో ఉద్యోగుల సంఘాలతో పాటు.. ప్రభుత్వం తరఫున సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. కాగా, పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ జరుగున్న సమావేశంలో ప్రభుత్వ స్పందనను బట్టి తమ కార్యాచరణను ప్రకటిస్తామని ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి సంఘాలు తెలిపారు. మరి ఈ సమావేశంలో ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందా? ఉద్యోగులు శాంతిస్తారా? అనేది వేచి చూడాలి.

Also read:అనంతపురంలో కలకలం రేపిన వివాహిత వీడియో.. తీవ్రంగా స్పందించిన పోలీసులు.. అసలేమైందంటే?

16 ఏళ్ల వయసులో క్యాన్సర్‌.. దానికి తోడు కలర్ బ్లైండ్.. జట్టులో ప్లేసే కరవు.. ప్రస్తుతం 3 బంతుల్లో సూపర్ హీరోగా మారిన ఆసీస్ బ్యాట్స్‌మెన్

Andhra Pradesh Rains: వాయుగుండం ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..