AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: వారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వెంటనే ఆ కార్డులు ఇవ్వాలని ఆదేశాలు

ట్రాన్స్‌జెండర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉపాధిహామీ పథకాన్ని ట్రాన్స్ జెండర్లకు కూడా అమలు చేయనుంది. ఉపాధి హామీ పథకం కింద పని కావాలని ముందుకు వచ్చే ట్రాన్స్‌జెండర్లను ఒక్కో వ్యక్తిని ఒక్కో కుటుంబంగా గుర్తించి జాబ్ కార్డులు మంజూరు చేయనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి...

AP News: వారికి జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వెంటనే ఆ కార్డులు ఇవ్వాలని ఆదేశాలు
CM YS Jagan
Ram Naramaneni
|

Updated on: Mar 23, 2024 | 2:58 PM

Share

జగన్ సర్కార్ ట్రాన్స్‌జెండర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. సమాజంలో వారు గౌరవప్రదమైన జీవనం గడిపే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీరికి కూడా వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం చొరవ మేరకు ఉపాధిహామీ పథకాన్ని ట్రాన్స్ జెండర్లకు కూడా అమలు చేయనుంది ఏపీ సర్కార్. దీంతో వారికి జాబ్ కార్డులు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ మేరకు మార్చి 15న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి హామి పనులు చేసేందుకు వచ్చే ఒక్కో ట్రాన్స్‌జెండర్‌ను ఒక్కో వ్యక్తిని ఒక్కో ఫ్యామిలీగా గుర్తించి జాబ్ కార్డులు ఇవ్వనున్నారు. అలాగే ఒకే పంచాయతీ పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువమంది ట్రాన్స్ జెండర్లు… పనుల కోసం ముందుకొస్తే వారిని శ్రమశక్తి సంఘాలుగా గుర్తిస్తామని అధికారులు వెల్లడించారు.

సమాజంలో తమపై వివిక్ష కొనసాగుతోందని, పని దొరక్క ఇబ్బందులు పడుతున్నామని.. తమకు ప్రభుత్వమే ఆసరాగా ఉండాలంటూ గతకొంతకాలంగా ట్రాన్స్‌జెండర్లు కేంద్ర ప్రభుత్వానికి తమ సమస్యలు విన్నవించుకుంటున్నారు. దీంతో కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిక మంత్రిత్వశాఖ.. ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉపాధిహామీ పథకాన్ని వర్తింప చేయాలని సూచించింది. దీంతో ఏపీ సర్కార్ కూడా సానుకూలంగా స్పందించి.. ట్రాన్స్‌జెండర్లకు జాబ్ కార్డులు ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది.  ప్రభుత్వం పంపిన సర్క్యులర్ వివరాలు ఇలా ఉన్నాయి.

  •  ట్రాన్స్‌జెండర్‌ను కుటుంబంగా పరిగణించి జాబ్ కార్డు అందజేయాలి.
  • దరఖాస్తు ఫామ్‌లో కూడా పురుషులు, స్త్రీలతో పాటు ట్రాన్స్‌జెండర్ కాలమ్ ఉంచాలి.
  • ఒక పంచాయతీ పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువమంది ట్రాన్స్‌జెండర్లు ఉంటే వారిని శ్రమశక్తి సంఘంగా గుర్తించాలి.
  •  పని చేసే ప్రదేశాల్లో వారిని తక్కువ చేసి మాట్లాడడం, వెకిలి చేష్టలు చేయడాన్ని నేరంగా పరిగణించాలి.
  • ఇక ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికి మండల, జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్లను నియమించాలని.. వారి ద్వారా పని ప్రాంతాల్లో ట్రాన్స్‌జెండర్లకు ఎదురయ్యే సమస్యలకు చరమగీతం పాడాలని ప్రభుత్వం సర్క్యులర్‌లో పేర్కొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ కిక్ చేయండి..

Follow Us
కమెడియన్ డాక్టర్ భద్రమ్ ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడని తెలుసా?
కమెడియన్ డాక్టర్ భద్రమ్ ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడని తెలుసా?
వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం..
వీర్య కణాల సంఖ్య ఎంతున్నా.. ఈ సీక్రెట్ తెలియకపోతే తండ్రి కావడం..
నాగలితో దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..
నాగలితో దున్నుతుండగా బయటపడింది చూసి ఆశ్చర్యపోయిన రైతు..
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ నం.1గా టీమిండియా
కార్గిల్ వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్న యావత్ దేశం!
కార్గిల్ వీర జవాన్ల త్యాగాలను స్మరించుకున్న యావత్ దేశం!
14 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన యువ ఓపెనర్
14 ఏళ్ల భారత క్రికెట్ చరిత్రను తిరగరాసిన యువ ఓపెనర్
శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే
శ్రీశైలం ప్రాజెక్టు గంగమ్మతో సిరిసిరిమువ్వలు పలికేది ఎప్పుడంటే
వర్షాకాలంలో ఏసీ కరెంట్ బిల్లు తగ్గించే సీక్రెట్ ట్రిక్స్..
వర్షాకాలంలో ఏసీ కరెంట్ బిల్లు తగ్గించే సీక్రెట్ ట్రిక్స్..
ఆమె 90's కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. బాక్సాఫీస్ క్వీన్..
ఆమె 90's కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. బాక్సాఫీస్ క్వీన్..
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు