AP: విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. అగ్రకులాలవారికి కూడా

ప్రతిభ ఉంటే చాలు.. అండగా ఉంటామని మెసేజ్ పంపింది జగన్ సర్కార్. విదేశాల్లో చదువుకోవాలనుకునే మెరిట్ విద్యార్థులకు కులమతాలకు అతీతంగా పూర్తి సాయం చేసేందుకు ముందుకొచ్చింది.

AP: విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. అగ్రకులాలవారికి కూడా
Cm Jagan
Follow us

|

Updated on: Jul 11, 2022 | 5:37 PM

Andhra Students: విద్య, వైద్యం.. సీఎం జగన్(CM Jagan) అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఈ అంశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ఏపీలోని విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. జగనన్న విదేశీ విద్యా దీవెన(Jagananna Vidya Deevena)పై ఉత్తర్వులు వెలువరించింది. పక్షపాతం లేకుండా ప్రతిభకే పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ కూడా ఈ పథకంలో భాగం కల్పిస్తూ.. తాము ప్రతిభను ప్రొత్సహిస్తామన్న సంకేతాలు పంపింది. క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌(QS World University Rankings)లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వనుంది. 100పైబడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపు చేయనున్నట్లు తెలిపింది. నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్‌ డబ్బు జమ చేయనున్నట్లు తెలిపింది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఈ పథకం వర్తింపజేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులుగా తెలిపింది. ఏపీలో స్థానికుడై ఉండాలి. అయితే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి ఏటా సెప్టెంబరు–డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నోటిఫికేషన్‌ విడుదల చేస్తుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీచే అర్హుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
Current Bill: కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గాలా? ఇవిగో టిప్స్
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
అలా అయితే భారత్‌లో వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
కియారా అద్వానీ లిస్ట్ లో అందరూ సౌత్‌ స్టార్లేనా.? స్టార్ కాస్ట్..
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్