AP Bonds Action: ఆదాయం పెంచుకునే మార్గంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర సెక్యురిటీ బాండ్ల వేలం

AP Government: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులను పెంచుకునే క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం అధిక వడ్డీకి రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర మంగళవారం సెక్యూరిటీ బాండ్లు వేలం వేసింది.

AP Bonds Action: ఆదాయం పెంచుకునే మార్గంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర సెక్యురిటీ బాండ్ల వేలం
Ap Security Bonds With The Reserve Bank

Updated on: Oct 12, 2021 | 7:32 PM

AP Security Bonds Action: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వనరులను పెంచుకునే క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం అధిక వడ్డీకి రిజర్వ్‌ బ్యాంక్‌ దగ్గర మంగళవారం సెక్యూరిటీ బాండ్లు వేలం వేసింది. రిజర్వు బ్యాంకు ద్వారా వెయ్యి కోట్ల రూపాయల చొప్పున వేర్వేరుగా సెక్యూరిటీలను వేలం వేసింది. 20 ఏళ్ల కాలపరిమితితో వెయ్యి కోట్లు , 15 ఏళ్ల కాలపరిమితితో మరో వెయ్యి కోట్ల రూపాయల విలువైన సెక్యూరిటీలను వేలానికి పెట్టింది ఆంధ్రప్రదేశ్ సర్కార్. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అత్యధిక వార్షిక వడ్డీ రేట్లకు ఏపీ సెక్యురిటీల వేలంలో పోయాయి.

7.14 శాతం వడ్డీకి రూ.వెయ్యి కోట్లు 20 ఏళ్లలో చెల్లించే విధంగా అప్పు చేసింది. మరో రూ. వెయ్యి కోట్లు 7.13 శాతం వడ్డీకి 15 ఏళ్లలో చెల్లించే విధంగా రుణం సేకరణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం అదనంగా అనుమతించిన రూ.10,500 కోట్లలో.. ఇప్పటికే రూ.8వేల కోట్లు బాండ్ల వేలం ద్వారా ఏపీ ప్రభుత్వం సేకరించింది. వచ్చే వారంతో కేంద్రం అనుమతించిన అదనపు పరిమితి నిధులు మొత్తం వ్యయం అయ్యే అవకాశముంది. బాండ్ల వేలం ద్వారా సేకరించిన రూ.2వేల కోట్లతో మిగిలిన తమ పెన్షన్లు, వేతనాలు వస్తాయని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశిస్తున్నారు.

Read Also…  Power Crisis: బొగ్గు కొరతపై ప్రధాని మోడీ సమీక్ష.. ఆందోళన అవసరం లేదన్న కేంద్ర మంత్రి