సర్కార్ సంచలన నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వే.. క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పాస్ పుస్తకాలు

|

Jan 04, 2025 | 9:01 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 20వ తేదీ నుంచి భూములను రీ సర్వే చేస్తామని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని సర్వే చేస్తామని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. భూముల గొడవలను పరిష్కరిస్తామని ప్రకటించారు. రోజుకు 20 ఎకరాలు మాత్రమే సర్వే చేస్తామన్నారు.

సర్కార్ సంచలన నిర్ణయం.. రాష్ట్ర వ్యాప్తంగా భూ రీసర్వే.. క్యూఆర్ కోడ్‌తో పట్టాదారు పాస్ పుస్తకాలు
Land Survey
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 20వ తేదీ నుంచి భూములను రీ సర్వే చేస్తామని ప్రకటించింది. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వం భూ సర్వే చేసి ప్రజల మధ్య గొడవలు పెట్టిందన్నారు రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ . ఆ గొడవల వల్ల రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా పోయిందన్నారు. అందుకే భూమలను రీ సర్వే చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈనెల 20 నుంచి భూ సమస్యలపై రీసర్వే చేస్తామన్నారు . మండలంలో ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని సర్వే చేపడుతామన్నారు. రోజుకు 20 ఎకరాలు మాత్రమే సర్వే చేస్తామన్నారు. 200 ఎకరాలకు ముగ్గురు అధికారులను పెట్టి పకడ్బందీగా లెక్కలు తీస్తామన్నారు. పైలెట్ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామసభలు పెట్టి క్యూ ఆర్ కోడ్‌తో పాస్‌ బుక్ లు జారీ చేస్తామన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్.

ఇప్పటికే గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన వినతుల్లో 13 వేల దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకున్నామన్నారు అనగాని. గ్రామ రెవెన్యూ సదస్సుల్లో లక్షా 80వేలకు పైగా వినతులు వచ్చాయని ఇందులో దాదాపు లక్షకు పైగా రికార్డ్‌ అఫ్‌ రైట్స్‌లోని తప్పులపైనే వచ్చాయన్నారు. వీటిల్లో ఇప్పటివరకు 9వేల సమస్యలను పరిష్కరించామన్నారు. భూముల సరిహద్దు సమస్యలపై దాదాపు 18 వేల దరఖాస్తులు రాగా 3 వేల దరఖాస్తులకు పరిష్కారం చూపాలమన్నారు. వైసీపీ హయాంలో జరిగిన రీ-సర్వేకు సంబంధించిన సమస్యలపై 11 వేల అప్లికేషన్లు వస్తే ఇందులో 647 సమస్యలను వెంటనే పరిష్కరించామని తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..